భూసుపోషణ నిర్వహణపై సన్నాహక సమావేశం
మంచిర్యాలరూరల్(హాజీపూర్): జిల్లా గ్రామ వికాస్ ఆధ్వర్యంలో మంగళవారం జిల్లా కేంద్రంలోని మాధవ నిలయంలో భూసుపోషణ కార్యక్రమాల నిర్వహణపై సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ ఉగాది పండుగ నుంచి నెలపాటు భూసుపోషణ కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించారు. జిల్లాలోని ఆయా గ్రామాల్లోని రైతులను భాగస్వాములను చేస్తూ సేంద్రియ సాగులోనూ రా ణించేలా చూడాలని సంకల్పించారు. తెలంగాణ ప్రాంత గ్రామ వికాస్ ప్రముఖ్ సత్యనారాయణరెడ్డి, జిల్లా కార్యవాహక్ రాజేశ్, జిల్లా సంయోజక్ కృష్ణభాస్కర్, సహ సంయోజక్ బొలిశెట్టి తిరుపతి, సభ్యులు వెంబడి కిషన్, బక్కయ్య, తిరుపతి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment