సోంపేట : బారువ ప్రాంతంలో థర్మల్ పవర్ ప్లాంట్ అనుమతులు రద్దు జీవో ఇంకెప్పుడు ఇస్తారంటూ మండలంలోని రుషికుడ్డ గ్రామానికి చెందిన గండు తులసి నారాయణ, కామేశ్వరరావు, లక్ష్మీనారాయణ తదితరులు ఎమ్మెల్యే బి.అశోక్‌బాబును నిలదీశారు. గ్రామంలో గురువారం నిర్వహించిన రైతు సాధికార సదస్సులో పాల్గొన్న ఎమ్మెల్యేను ఈ మేరకు ప్రశ్నించారు. దీంతో ఆయన మాట్లాడుతూ జీవోను ప్రభుత్వం తొందర్లోనే విడుదల చేస్తుందన్నారు. దీనికోసం మంత్రి అచ్చెన్నాయుడు, ఎంపీ రామ్మోహన్ నాయుడు, పలాస ఎమ్మెల్యే శ్యామ సుందర శివాజీ కృషి చేస్తున్నారని అన్నారు. ఆందోళన చెందవలసిన అవసరం లేదన్నారు.
టీడీపీ చెప్పిన మాట ప్రకారం రుణమాఫీ చేసిందన్నారు. మత్స్యకారులకు తుపాను పరిహారం, రైతులకు రుణమాఫీ పత్రాలు అందించారు. తమ పింఛన్లు అన్యాయంగా తొలగించారంటూ పలువురు ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేశారు. అలాగే మండలంలోని ఇస్కలపాలెం, గొల్లగండి, సోంపేట, సిరిమామిడి గ్రామ పంచాయితీల్లో రైతు సాధికార సదస్సులు నిర్వహించారు. ఎంపీపీ చిత్రాడ శ్రీనివాసరావు, జెడ్పీటీసీ సభ్యుడు చంద్రమోహన్, మండల ప్రత్యేకాధికారి కరుణాకరరావు, వ్యవసాయ శాఖ ఏడీ వెంకటేశ్వరులు, తహశీల్దార్ గోపాలరత్నం, ఎంపీడీవో పట్నాయక్ పాల్గొన్నారు.
‘థర్మల్’ అనుమతులు రద్దు ఎప్పుడు?
Published Fri, Dec 12 2014 2:23 AM | Last Updated on Sat, Sep 2 2017 6:00 PM
Advertisement