మానిక్‌భండార్ వద్ద రోడ్డు ప్రమాదం | road accident at manikbhandar | Sakshi
Sakshi News home page

మానిక్‌భండార్ వద్ద రోడ్డు ప్రమాదం

Published Sat, Nov 29 2014 3:02 AM | Last Updated on Mon, Oct 1 2018 2:03 PM

మానిక్‌భండార్ వద్ద రోడ్డు ప్రమాదం - Sakshi

మానిక్‌భండార్ వద్ద రోడ్డు ప్రమాదం

మాక్లూర్ : మండలంలోని మానిక్‌భండార్ గ్రామ సమీపంలోని 63వ జాతీయ రహదారి పై గురువారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు రైతులు మృతి చెందారు. ఎస్సై సంతోష్ కుమార్ కథనం ప్రకారం..  నందిపేట మండలంలోని సిద్దాపూర్ గ్రామానికి చెందిన రసాయి సాయన్న(30), కొండపల్లి పెంటన్న (31) అనే ఇద్దరు రైతులు నిజామాబాద్ నుంచి సిద్దాపూర్‌కు బైక్ పై వెళుతున్నారు. మానిక్‌భండార్ వద్ద చెక్‌పోస్టు వద్ద ఆగి ఉన్న లారీని వీరి బైక్ అతివేగంగా ఢీ కొట్టడంతో ఇద్దరు అక్కడిక్కడే మృతి చెందారు.  

నిజామాబాద్ నుంచి విజయవాడకు వెళుతున్న బియ్యం లోడ్ లారీ చెక్‌పోస్టు వద్ద నిబంధనలకు వ్యతిరేకంగా ఆగి ఉంది. నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీలో పనులు ముగించుకుని ఇంటికి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. బైక్ పూర్తిగా నుజ్జు నుజ్జు అయ్యింది. మృతుడు సాయన్నకు భార్య, ముగ్గురు కొడుకులు ఉన్నారు. మరో మృతుడు కొండపల్లి పెంటన్నకు భార్య ఉంది. కేసు నమోదు చేసి మృతదేహాలను పోస్టు మార్టం కోసం జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించినట్లు ఎస్సై శుక్రవారం తెలిపారు.
 
గుర్తు తెలియని వాహనం ఢీకొని యువకుని మృతి

మాక్లూర్ : మండలంలోని చిన్నాపూర్, అడవిమామిడిపల్లి గ్రామ సమీపంలో గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. ఎస్సై సంతోష్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆర్మూర్‌కు చెందిన ధర్మగడ్డ శ్రావణ్(31) అనే యువకుడు నిజామబాద్ నుంచి ఆర్మూర్‌కు బైక్ పై వెళుతుండగా, ఓ గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టడంతో అక్కడిక్కడే మృతి చెందాడు. మృతుడికి ఇంకా పెళ్ళి కాలేదు. మృతుడికి త ల్లి ఉంది. కేసు నమోదు చేసి శవాన్ని పోస్టు మార్టం కోసం జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించిన్నట్లు ఎస్సై  తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement