Manikbhandar
-
మానిక్‌భండార్ వద్ద రోడ్డు ప్రమాదం
మాక్లూర్ : మండలంలోని మానిక్‌భండార్ గ్రామ సమీపంలోని 63వ జాతీయ రహదారి పై గురువారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు రైతులు మృతి చెందారు. ఎస్సై సంతోష్ కుమార్ కథనం ప్రకారం.. నందిపేట మండలంలోని సిద్దాపూర్ గ్రామానికి చెందిన రసాయి సాయన్న(30), కొండపల్లి పెంటన్న (31) అనే ఇద్దరు రైతులు నిజామాబాద్ నుంచి సిద్దాపూర్‌కు బైక్ పై వెళుతున్నారు. మానిక్‌భండార్ వద్ద చెక్‌పోస్టు వద్ద ఆగి ఉన్న లారీని వీరి బైక్ అతివేగంగా ఢీ కొట్టడంతో ఇద్దరు అక్కడిక్కడే మృతి చెందారు. నిజామాబాద్ నుంచి విజయవాడకు వెళుతున్న బియ్యం లోడ్ లారీ చెక్‌పోస్టు వద్ద నిబంధనలకు వ్యతిరేకంగా ఆగి ఉంది. నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీలో పనులు ముగించుకుని ఇంటికి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. బైక్ పూర్తిగా నుజ్జు నుజ్జు అయ్యింది. మృతుడు సాయన్నకు భార్య, ముగ్గురు కొడుకులు ఉన్నారు. మరో మృతుడు కొండపల్లి పెంటన్నకు భార్య ఉంది. కేసు నమోదు చేసి మృతదేహాలను పోస్టు మార్టం కోసం జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించినట్లు ఎస్సై శుక్రవారం తెలిపారు. గుర్తు తెలియని వాహనం ఢీకొని యువకుని మృతి మాక్లూర్ : మండలంలోని చిన్నాపూర్, అడవిమామిడిపల్లి గ్రామ సమీపంలో గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. ఎస్సై సంతోష్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆర్మూర్‌కు చెందిన ధర్మగడ్డ శ్రావణ్(31) అనే యువకుడు నిజామబాద్ నుంచి ఆర్మూర్‌కు బైక్ పై వెళుతుండగా, ఓ గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టడంతో అక్కడిక్కడే మృతి చెందాడు. మృతుడికి ఇంకా పెళ్ళి కాలేదు. మృతుడికి త ల్లి ఉంది. కేసు నమోదు చేసి శవాన్ని పోస్టు మార్టం కోసం జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించిన్నట్లు ఎస్సై తెలిపారు. -
ముగిసిన టెక్నో ఫెస్టు-2014 వేడుకలు
మాక్లూర్, న్యూస్‌లైన్ : మండలంలోని మానిక్‌భండార్ గ్రామ సమీపంలోని విజయ్ రూరల్ ఇంజనీరింగ్ కళాశాలలో రెండు రోజులుగా నిర్వహిస్తున్న జాతీయస్థాయి టెక్నో ఫెస్టు-2014 వేడుకలు శనివారం ముగిశాయి. ఈ సందర్భంగా విద్యార్థులు వివిధ సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొని హంగామా చేశారు. అంత్యాక్షరి, క్విజ్, జామ్, ఫైల్, హరీల్, ట్రైజరి, నృత్యాలు తదితర కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఐడియా సంస్థ వారు స్లోబైక్ రైడింగ్ నిర్వహించి విద్యార్థులను చైతన్య పరిచారు. అనంతరం కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ బీఆర్ విక్రమ్ మాట్లాడుతూ.. ఇంజినీరింగ్ విద్యార్థులు మంచిగా చదువుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలన్నారు. విద్యార్థులు తమ గమ్యం చేరే వ రకు క్రమశిక్షణతో ముందుకుపోవాలన్నారు. అనంతరం విద్యార్థులను ఆయన అభినందించి, నగదు, సర్టిఫికెట్లు అందజేశారు. కార్యక్రమంలో జిల్లాలోని అన్ని ఇంజినీరింగ్ కళాశాలలకు చెందిన సుమారు వెయ్యి మంది విద్యార్థులు, కళాశాల అధ్యాపకులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు