ముగిసిన టెక్నో ఫెస్టు-2014 వేడుకలు | Techno Festa celebrations ended -2014 | Sakshi
Sakshi News home page

ముగిసిన టెక్నో ఫెస్టు-2014 వేడుకలు

Published Sun, Mar 23 2014 4:27 AM | Last Updated on Sat, Sep 2 2017 5:01 AM

టెక్నో ఫెస్టు-2014 వేడుకలు

టెక్నో ఫెస్టు-2014 వేడుకలు

మాక్లూర్, న్యూస్‌లైన్ : మండలంలోని మానిక్‌భండార్ గ్రామ సమీపంలోని విజయ్ రూరల్ ఇంజనీరింగ్ కళాశాలలో రెండు రోజులుగా నిర్వహిస్తున్న జాతీయస్థాయి టెక్నో ఫెస్టు-2014  వేడుకలు శనివారం ముగిశాయి.  ఈ సందర్భంగా విద్యార్థులు వివిధ సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొని హంగామా చేశారు. అంత్యాక్షరి, క్విజ్, జామ్, ఫైల్, హరీల్, ట్రైజరి, నృత్యాలు తదితర కార్యక్రమాలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఐడియా  సంస్థ  వారు  స్లోబైక్ రైడింగ్ నిర్వహించి విద్యార్థులను చైతన్య పరిచారు. అనంతరం కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ బీఆర్ విక్రమ్ మాట్లాడుతూ.. ఇంజినీరింగ్ విద్యార్థులు మంచిగా చదువుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలన్నారు. విద్యార్థులు తమ గమ్యం చేరే వ రకు క్రమశిక్షణతో ముందుకుపోవాలన్నారు.

అనంతరం విద్యార్థులను ఆయన అభినందించి, నగదు, సర్టిఫికెట్లు అందజేశారు.  కార్యక్రమంలో జిల్లాలోని అన్ని ఇంజినీరింగ్ కళాశాలలకు చెందిన సుమారు వెయ్యి మంది విద్యార్థులు, కళాశాల అధ్యాపకులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement