ఖమ్మం జిల్లా పవర్ ప్లాంటును నల్గొండ తరలిస్తారా ? | ponguleti sudhakar reddy takes on kcr government | Sakshi
Sakshi News home page

ఖమ్మం జిల్లా పవర్ ప్లాంటును నల్గొండ తరలిస్తారా ?

Published Wed, Dec 24 2014 2:31 PM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM

ఖమ్మం జిల్లా పవర్ ప్లాంటును నల్గొండ తరలిస్తారా ? - Sakshi

ఖమ్మం జిల్లా పవర్ ప్లాంటును నల్గొండ తరలిస్తారా ?

హైదరాబాద్: ఖమ్మం జిల్లాలోని పవర్ ప్లాంట్ను నల్గొండ జిల్లాకు తరలించడం కరెక్ట్ కాదని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్రెడ్డి బుధవారం హైదరాబాద్లో అభిప్రాయపడ్డారు. ఖమ్మం జిల్లాలో 3200 మెగావాట్ల పవర్ ప్లాంట్ నిర్మాణానికి భూ సేకరణ పూర్తయిందని... ఇలాంటి సమయంలో ఈ ప్రాజెక్ట్ను నల్గొండకు ఎలా తీసుకెళ్తారని ఆయన తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. 

ఇప్పటికే ఖమ్మం జిల్లాలోని 7 మండలాలు, విద్యుత్ ప్లాంట్ను ఆంధ్రప్రదేశ్కు ఇచ్చి  అన్యాయం చేశారని ఆరోపించారు. మంజూరైన విద్యుత్ ప్లాంట్ను కూడా నిర్మించకుండా ఇతర జిల్లాకు తరలిస్తే ఖమ్మం జిల్లా మరింత నష్టపోతుందని పొంగులేటి సుధాకర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. పవర్ ప్లాంట్ ప్రాజెక్ట్ మరో జిల్లాకు తరలిపోకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా మంత్రి తుమ్మలకు ఈ సందర్భంగా పొంగులేటీ సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement