రామగుండం: కరీంనగర్ జిల్లా రామగుండం బీ-థర్మల్ విద్యుత్ కేంద్రంలో జెన్‌కో ఆధ్వర్యంలో మరో 600 మెగావాట్ల సామర్థ్యం గల విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుకు జెన్‌కో గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు గురువారం స్థానిక జెన్‌కో ఎస్‌ఈ సూర్యనారాయణకు ఉత్తర్వులు అందాయి. నూతన కేంద్రం ఏర్పాటుకు 522 ఎకరాల ప్రభుత్వ భూమిని వినియోగించుకోనున్నట్లు పేర్కొన్నారు. వారంలోగా పూర్తి నివేదికలను జెన్‌కో సీఎండీ ప్రభాకర్‌రావుకు పంపిస్తామని ఎస్‌ఈ తెలిపారు.