
నాగర్‌కర్నూల్: శ్రీశైలం ఎడమ గట్టు భూగర్భ జల విద్యుత్ కేంద్రం అగ్ని ప్రమాదంలో విషాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదం ఒకరు మృతి చెందారు. ఏఈ సుందర్ నాయక్ (35) మృతదేహాన్ని రెస్క్యూ బృందం గుర్తించింది. మిగతా 8 మంది కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. మరో రెండు గంటలపాటు ఈ ఆపరేషన్ కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
కాగా, మృతుడు సుందర్ నాయక్‌ది సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం, జగన తండాగా తెలిసింది. అతనికి భార్య ప్రమీల ఇద్దరు కూతుళ్లు మనస్వి, నిహస్వి ఉన్నారు. నెల రోజుల క్రితం కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో సుందర్ నాయక్ సొంతూరుకు వచ్చి 15 రోజులు హోమ్ క్వారెంటైన్‌లో ఉండి కరోనాను జయించారు. నిన్న రాత్రి 9 గంటలకు శ్రీశైలం ఎడమ జల విద్యుత్ కేంద్రంలో విధులకు హాజరయ్యారు. అతని తండ్రి నాగేశ్వరరావు కోపరేటివ్ అసిస్టెంట్ రిజిస్ట్రార్‌గా పనిచేశారు.
(35 మందితో పవర్ హౌస్‌లోకి రెస్క్యూ టీమ్)
Comments
Please login to add a commentAdd a comment