సాక్షి, హైదరాబాద్: శ్రీశైలం ఎడమ జల విద్యుత్ ఉత్పతి కేంద్రంలో చిక్కుకుపోయిన తొమ్మిదిమంది జెన్‌కో ఉద్యోగులను రక్షించేందుకు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. పొగతో పాటు మంటలు అదుపులోకి రాకపోవడంతో గత రాత్రి సహాయక చర్యలకు అంతరాయం ఏర్పడింది. దీంతో విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేశారు. సీఐఎస్‌ఎఫ్ కమాండెంట్ సిద్ధార్థ రెహ ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం రెస్క్యూ ఆపరేషన్ మొదలుపెట్టారు. అధునాతన పరికరాలతో పవర్ హౌస్‌లోకి వెళ్లిన 35మంది సీఐఎస్‌ఎఫ్ సభ్యుల బృందం సహాయక చర్యలు మొదలుపెట్టింది. మరోవైపు అదనపు డీజీ సీవీ ఆనంద్ పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. తెలంగాణ డీజీపీ విజ్ఞప్తితో సీఐఎస్‌ఎఫ్ ప్రత్యేక బృందాన్ని పంపింది. ఇవాళ మధ్యాహ్నానికి పరిస్థితి అదుపులోకి వచ్చే అవకాశం ఉంది.
(చదవండి: జల విద్యుత్ కేంద్రంలో భారీ అగ్ని ప్రమాదం..)
మంటల్లో చిక్కుకున్నవారి వివరాలు
1.DE శ్రీనివాస్ గౌడ్, హైదరాబాద్
2.AE వెంకట్‌రావు, పాల్వంచ
3.AE మోహన్ కుమార్, హైదరాబాద్
4.AE ఉజ్మ ఫాతిమా, హైదరాబాద్
5.AE సుందర్, సూర్యాపేట
6. ప్లాంట్ అటెండెంట్ రాంబాబు, ఖమ్మం జిల్లా
7. జూనియర్ ప్లాంట్ అటెండెంట్ కిరణ్, పాల్వంచ
8,9 హైదరాబాద్‌కు చెందినా అమరన్ బ్యాటరీ కంపెనీ సిబ్బంది వినేష్ కుమార్, మహేష్ కుమార్
(చదవండి: గతంలో ఎప్పుడూ ఇలాంటి ఘటన జరగలేదు)
ఏపీ గవర్నర్ దిగ్భ్రాంతి
శ్రీశైలం ప్రాజెక్ట్ ఎడమ గట్టు భూగర్భ జల విధ్యుత్ కేంద్రంలో జరిగిన ప్రమాదం పట్ల ఆంధ్రప్రదేశ్ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. భూగర్భ జల విధ్యుత్ కేంద్రంలో చిక్కుకున్న తొమ్మిది మంది ఉద్యోగులు క్షేమంగా బయటకు వస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
ప్రమాద స్థలం వద్ద ఏపీ ఎమ్మెల్యేలు
పలువురు ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యేలు ప్రమాదం జరిగిన శ్రీశైలం ప్రాజెక్ట్ ఎడమ గట్టు భూగర్భ జల విధ్యుత్ కేంద్రం వద్దకు చేరుకుని రెస్క్యూ ఆపరేషన్‌ను పరిశీలించారు. ఎడమ గట్టు విద్యుత్ కేంద్రంలో ప్రమాదం జరగడం దురదృష్టకరమని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వానికి పూర్తి సహకారం అందిస్తామని చెప్పారు. లోపల చిక్కుకుపోయిన 9 మంది క్షేమంగా తిరిగిరావాలని ఆకాక్షించారు.
Comments
Please login to add a commentAdd a comment