గణపురం(వరంగల్ జిల్లా): తెలంగాణలోని విద్యుత్ సంస్థల్లో పనిచేసి బదిలీ అయిన సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ఇంజనీర్లను తిరిగి తెలంగాణలోని సంస్థల్లోకి తీసుకోవద్దని వరంగల్ జిల్లాలోని కాకతీయ థర్మల్ పవర్ ప్లాంట్ (కేటీపీపీ) ఎదుట ఇంజనీర్లు శుక్రవారం ధర్నా చేశారు. రెండు నెలల క్రితం కేటీపీపీ నుంచి 80 మంది ఇంజనీర్లతోపాటు వివిధ విద్యుత్ సంస్థల్లో సుమారుగా 2వేల మందికి బదిలీలు జరిగాయి. తెలంగాణ, ఆంధ్ర ఉద్యోగులు కోర్టులను కూడా ఆశ్రయించారు.
ఆంధ్ర ఉద్యోగులు ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేస్తుండగా.. తెలంగాణ ఉద్యోగులు వారు పని చేస్తున్న సంస్థల ఎదుట ధర్నా చేస్తున్నారు. ఈ క్రమంలో ఆంధ్ర ప్రాంతం ఉద్యోగులకు తెలంగాణలో అవకాశం ఇవ్వొద్దని డిమాండ్ చేస్తూ స్థానిక ఇంజనీర్లు ధర్నాకు దిగారు. ఇప్పటికే ఆంధ్ర ఉద్యోగుల పెత్తనం కింద సర్వం నష్టపోయామని.. మళ్లీ అలాంటి పరిస్థితి రాకుండా చూడాలని కోరారు.
'ఆంధ్ర ఇంజనీర్లను తిరిగి తీసుకోవద్దు'
Published Fri, Jul 31 2015 8:49 PM | Last Updated on Sat, Aug 18 2018 4:27 PM
Advertisement