వరంగల్ క్రైం, న్యూస్‌లైన్ : తెలంగాణ బిల్లు ప్రతులను భోగి మంటల్లో వేసి తగులబెట్టిన ఏపీఎన్‌జీవో నాయకుడు అశోక్‌బాబుపై చర్య తీసుకోవాలని టీఆర్‌ఎస్ నాయకుడు జానీదర్శన్‌సింగ్ హన్మకొండ పోలీసులకు మంగళవారం ఫిర్యాదు చేశారు. తెలంగాణ బిల్లును తెలంగాణ ప్రజలు ఒక పవి త్ర గ్రంథంగా భావిస్తుండగా దానిని మంటల్లో తగుల బెట్టడం తెలంగాణ ఆకాంక్షను అడ్డుకోవడమేనని ఫిర్యాదులో పేర్కొన్నారు. రాష్ట్రపతి పంపిన తెలంగాణ బిల్లును అశోక్‌బాబు అపహాస్యం చేయడం తగదని, ఆయనపై చట్టరీత్యా చర్య తీసుకోవాలని కోరారు.
అశోక్‌బాబుపై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు
Published Thu, Jan 16 2014 4:26 AM | Last Updated on Sat, Aug 18 2018 4:13 PM
Advertisement
Advertisement