అనూప్, శివకుమార్‌లకు స్వర్ణాలు
సాక్షి, హైదరాబాద్: ఆసియన్ రోలర్ స్కేటింగ్ చాంపియన్‌షిప్‌లో భారత స్కేటర్లు అనూప్‌కుమార్, శివకుమార్ మనీశ్‌లు సత్తా చాటారు. చైనాలోని లిషుయ్ నగరంలో జరిగిన ఈ టోర్నమెంట్ సీనియర్ విభాగంలో అనూప్ కుమార్ రెండు స్వర్ణాలు, రెండు రజతాలను సాధించగా... క్యాడెట్ విభాగంలో శివకుమార్ పసిడి పతకాన్ని దక్కించుకున్నాడు.