న్యాయవాద గుమస్తాల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా అనూప్‌కుమార్
హన్మకొండ అర్బన్ : తెలంగాణ న్యాయవాద గుమస్తాల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా వరంగల్‌కు చెందిన వి.అనూప్‌కుమార్ ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. రాష్ట్ర స్థాయి న్యాయవాద గుమస్తాల సంఘం సర్వసభ్య సమావేశం ఆదివారం హన్మకొండ సుబేదారిలోని పంక్షన్ హాల్లో నిర్వహించి తొలిసారిగా తెలంగాణ రాష్ట్ర సంఘాన్ని ఎన్నుకున్నారు.
సంఘం ప్రధాన కార్యదర్శిగా చందు(ఖమ్మం), కార్యనిర్వాహక అధ్యక్షుడిగా బి.వి. పురుషోత్తం(వరంగల్), సంయుక్త కార్యదర్శిగా శంకరలింగం(నల్గొండ), కోశాధికారిగా ఆర్.కుమారస్వామి, కార్యవర్గ సభ్యులుగా నాగరాజు, పవన్Sకుమార్, తిరుపతి, సారయ్య ఎన్నికయ్యారు. రాష్ట్రంలోని 10 జిల్లాలకు కార్యవర్గంలో ప్రాతినిధ్యం కల్పించారు. ఈ సందర్బంగా జరిగిన సమావేశంలో న్యాయవాద గుమస్తాలకు హెల్త్ కార్డులు ఇవ్వాలని, పీఎఫ్, ఇన్సూరెన్ సౌకర్యం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతూ తీర్మానాలు చేశారు.