పరామర్శ యాత్రను విజయవంతం చేయండి | Make Successful to the paramarsha yatra | Sakshi
Sakshi News home page

పరామర్శ యాత్రను విజయవంతం చేయండి

Published Thu, Jun 25 2015 3:54 AM | Last Updated on Tue, May 29 2018 4:18 PM

పరామర్శ యాత్రను విజయవంతం చేయండి - Sakshi

పరామర్శ యాత్రను విజయవంతం చేయండి

ఈనెల 29 నుంచి రంగారెడ్డి జిల్లాలో ప్రారంభం కానున్న షర్మిలమ్మ పరామర్శ యాత్రను జయప్రదం చేయాలని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన

 సరూర్‌నగర్ : ఈనెల 29 నుంచి రంగారెడ్డి జిల్లాలో ప్రారంభం కానున్న షర్మిలమ్మ పరామర్శ యాత్రను జయప్రదం చేయాలని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివకుమార్ పార్టీ నాయకులను, అభిమానులను, కార్యకర్తలను కోరారు. దివంగత ముఖ్యంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అకాల మరణాన్ని జీర్ణించుకోలేక   చనిపోయిన వారి కుటుంబాలను పరామర్శించేందుకు షర్మిలమ్మ చేపట్టబోతున్న పరామర్శ యాత్ర పోస్టర్‌ను బుధవారం మందమల్లమ్మ చౌరస్తాలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి కొలిశెట్టి శివకుమార్, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు జి.సురేష్‌రెడ్డి విడుదల చేశారు.

ఈ సందర్బంగా శివకుమార్ మాట్లాడుతూ ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలోని మూడు జిల్లాలో పరామర్శ యాత్ర పూర్తయిందని అన్నారు. ఈనెల 29నుంచి రంగారెడ్డి జిల్లాలో.. సరూర్‌నగర్ మండలం, జిల్లెలగూడనుంచి ప్రారంభమై వచ్చే నెల 2వ తేదీ వరకు కొనసాగుతుందని తెలిపారు. జిల్లాలోని 7 నియోజక వర్గాలలో 580 కిలోమీటర్లమేర తిరుగుతూ 15 కుటుంబాలను పరామర్శిస్తారని వెల్లడించారు. మహేశ్వరం నియోజకవర్గంలోని జిల్లెలగూడనుంచి పరామర్శయాత్ర మొదలవుతుందని పేర్కొన్నారు.

పోస్టర్ విడుదల చేసిన మందమల్లమ్మ చౌరస్తాలోనే షర్మిలమ్మ చేత బహిరంగసభ ఉంటుందని తెలిపారు. జిల్లా అధ్యక్షుడు జి.సురేష్‌రెడ్డి మాట్లాడుతూ వైఎస్సార్ కోసం రంగారెడ్డి జిల్లాలో మరణించిన అన్ని కుటుంబాలను షర్మిలమ్మ విచ్చేసి పరామర్శిస్తారన్నారు. పరామర్శయాత్రను విజయవం తం చేసేందుకు పెద్ద ఎత్తున పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, వైఎస్ పథకాలతో లబ్ధిపొందిన లబ్దిదారులు, విద్యార్థులు పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు.

కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శులు దుబ్బాక గోపాల్‌రెడ్డి, సూరజ్‌ఎస్‌దాని, జిల్లా కార్యదర్శి ఎమ్మెటి వెంకట్‌రెడ్డి, సరూర్‌నగర్ మండల అధ్యక్షుడు కొంతం మోహన్‌రెడ్డి,  విద్యార్థి నాయకులు గుర్జని సుమన్‌గౌడ్,  మామిడి రాంచందర్, మాసూం, పోల రాజశేఖర్‌రెడ్డి, జాపాల కిష్టయ్య, నగరపంచాయితీ అధ్యక్షురాలు విజయలక్ష్మీ, యాదయ్య, పాండునాయక్, ఆనంద్‌కమార్, శ్రీనివాస్, తదితరులున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement