ఒక్కొక్కరు వంద మందికి గాలం వేయండి | Rods to make each one hundred people | Sakshi
Sakshi News home page

ఒక్కొక్కరు వంద మందికి గాలం వేయండి

Published Sun, Aug 17 2014 3:15 AM | Last Updated on Sat, Sep 2 2017 11:58 AM

Rods to make each one hundred people

  • మంత్రి శివకుమార్
  • బళ్లారి టౌన్ : ఒక్కొక్క కాంగ్రెస్ నాయకుడు వంద మంది బీజేపీ కార్యకర్తలకు గాలం వేసి పార్టీలోకి రప్పించుకోవాలని రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి డీకే.శివకుమార్ పిలుపునిచ్చారు. శనివారం నగరంలోని రాఘవ కళామందిరంలో వాల్మీకి కార్యకర్తల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో శ్రీరాములు ఒక్కడే వాల్మీకి నాయకుడు కాదన్నారు.

    మీరంతా మనసు పెడితే మరో పది మంది లీడర్లను తయారు చేసుకోవచ్చన్నారు. ఈ ఎన్నికల్లో ఎన్‌వై. గోపాలకృష్ణ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. శ్రీరాములు అభివృద్ధి చేసిన దానిపై తాను చర్చించనని, కానీ తనకు నియోజకవర్గం వద్దని రాజీనామా చేసిన తర్వాత మరలా ఆ పార్టీ తరఫున ఎలా అభ్యర్థిని నిలబెట్టారన్నారు. ఎన్‌వై.హనుమంతప్ప ఆశీస్సుల వల్లే ఆయన ఈ  స్థాయికి ఎదిగారన్నారు.

    ఒకప్పుడు ఆయనను ఇంటి దేవుడిగా కొలిచి నేడు ఆయనపైనే పోటీ చేసి ఓడించే స్థాయికి ఎదిగారన్నారు. తాను ఈ నియోజకవర్గాన్ని ఎన్నికల జరిగేలోగానే ఖాళీ చేస్తామని శ్రీరాములు వ్యాఖ్యనలు చేయడం తగదన్నారు. తాను బళ్లారిలో ఎన్నికల ముగిసేంత వరకు ఉంటానన్నారు.  సీఎం సిద్దరామయ్య సామాజిక న్యాయం, పేదల సంక్షేమానికి పెద్ద పీట వేస్తున్నారన్నారు. రానున్న రోజుల్లో రాజీవ్ ఆవాస్ పథకం ద్వారా ఒక్కొక్క లబ్ధిదారుడికి రూ. 4 లక్షల వరకు ఇవ్వాలని, అందరికీ  స్థలాలు ఇవ్వాలనే యోచనలో ఉన్నట్లు చెప్పారు. ఇది ఎన్నికల హామీ కాదని తమ ప్రభుత్వ ప్రణాళిక అని చెప్పారు.

    శ్రీరాములు నాడు బీజేపీ నుంచి స్వాభిమానం దెబ్బతినిందని చెప్పి కొత్త పార్టీ పెట్టి తర్వాత ఆ పార్టీలోకి ఎలా వెళ్లారని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్‌చార్జి మంత్రి పీటీ పరమేశ్వరనాయక్, సినీ నటి శశికుమార్, ఎమ్మెల్యే అనిల్‌లాడ్, తుకారాం, ఉగ్రప్ప, పార్టీ అభ్యర్థి ఎన్‌వై.గోపాలకృష్ణ, స్థానిక నేతలు బెస్ట్ రామప్ప, నెట్టి కల్లప్ప, రాంప్రసాద్, జేఎస్.ఆంజినేయులు, వీకే.బసప్ప, హగరి వండ్రి తదితరులు పాల్గొన్నారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement