ఎస్సీ వర్గీకరణ చేయాలని డిమాండ్ చేస్తూ ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు శివకుమార్ ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం ముఖ్యమంత్రి చంద్రబాబు దిష్టిబొమ్మను దహనం చేశారు.
ఎస్సీ వర్గీకరణ చేయాలని డిమాండ్ చేస్తూ ఎమ్మార్పీఎస్ ధర్నా నిర్వహించారు. మండల అధ్యక్షుడు శివకుమార్ ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం ముఖ్యమంత్రి చంద్రబాబు దిష్టిబొమ్మను దహనం చేశారు. పట్టణంలోని వైఎస్సార్ సర్కిల్ వద్దకు భారీగా చేరుకున్న ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు.. ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎన్నికల సమయంలో మాట ఇచ్చి.. ఇప్పుడు హామీ నెరవేర్చక పోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.