సాక్షి, బళ్లారి : బళ్లారి ఉప ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థి ఎన్‌వై. గోపాలకృష్ణ గెలి చినా, ఓడినా బళ్లారి అభివృద్ధికి స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని పెట్టుకున్నట్లు కాం గ్రెస్ ఎన్నికల ఇన్‌ఛార్జి, రాష్ట్ర విద్యుత్ శా ఖ మంత్రి డీకే శివకుమార్ తెలిపారు. ఆ యన ఆదివారం నగరంలోని పోలా ప్యా రడైజ్ హోటల్‌లో విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల ఫలితాల అనంతరం బ ళ్లారిలో కేబినేట్ సమావేశం నిర్వహించే విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తామన్నారు.
ఇక్కడ అన్ని శాఖల ముఖ్యాధికారు లు, మంత్రులు పాల్గొనడం వల్ల అభివృ ద్ధి పనులు ఎలా చేపట్టాలో అర్థమవుతుం దన్నారు. బళ్లారి ఉప ఎన్నికల ఇన్‌ఛార్జిగా ఉన్నందున తనకు ఇక్కడ సమస్యలు చూ సి ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని భావించినట్లు చెప్పారు. తాము అధికారంలో ఉన్నప్పటికీ ఎలాంటి గొడవలు జరగకుండా శాంతియుతంగా ఎన్నికలను నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు, చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.
తమ పార్టీ అధికారంలో ఉందని, బళ్లారి అభివృద్ధి కూడా తమతోనే సాధ్యమన్నారు. ఈ నేపథ్యంలో జేడీఎస్, బీజే పీ కార్యకర్తలు కూడా తమకే ఓట్లు వేస్తారనే నమ్మకం ఉందన్నారు. ఆపరేషన్ హస్తం తాము చేపట్టడం లేదని, వారి ఇష్ట ప్రకారమే తమ పార్టీలోకి వస్తున్నారన్నారు. తాను ఎన్నికల జిమ్మిక్కులు చేయడం లేదని, సేవ చేయడం మాత్రమే తనకు తెలుసన్నారు.
బళ్లారిలో ఇళ్లు లేని పేదలు, వృద్ధాప్య పెన్షన్లు రాని వృద్ధులు ఎంతో మంది ఉన్నారని , పేదల జాబితాను సిద్ధం చేసి వారికి ప్రభుత్వ ఫలాలు నేరుగా అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి పరమేశ్వర నాయక్, డీసీసీ అధ్యక్షుడు జేఎస్.ఆంజనేయులు, లోక్‌సభ సభ్యుడు డీకే సురేష్ కుమార్ పాల్గొన్నారు.
గెలిచినా, ఓడినా బళ్లారి అభివృద్ధికి స్పెషల్ డ్రైవ్
Published Mon, Aug 18 2014 3:17 AM | Last Updated on Sat, Sep 2 2017 12:01 PM
Advertisement
Advertisement