ఉద్యోగం చేయమని తల్లి మందలించడంతో ఓ యువకుడు ఇంట్లో నుంచి వెళ్లిపోయిన సంఘటన జగద్గిరిగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
ఉద్యోగం చేయమని తల్లి మందలించడంతో ఓ యువకుడు ఇంట్లో నుంచి వెళ్లిపోయిన సంఘటన జగద్గిరిగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. చంద్రగిరినగర్‌కు చెందిన విమలమ్మ కుమారుడు శివకుమార్ (22) చదువు మానేసి సినిమా కథలు రాయడం ప్రారంభించాడు. దీంతో తల్లి విమలమ్మ ఏదైనా పని చేసి, డబ్బు సంపాదించాలంటూ మందలించింది. మనస్తాపానికి గురైన శివకుమార్ ఈ నెల 21న ఎవరికీ చెప్పకుండా ఎటో వెళ్లిపోయాడు. కుమారుడు ఇప్పటి వరకు తిరిగి రాకపోవడంతో తల్లి విమలమ్మ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.