సాక్షి, వరంగల్ : రాజస్తాన్‌లో తెలంగాణ పోలీసులపై స్థానికులు దాడికి పాల్పడ్డారు. ఓ చోరీ కేసు విచారణ నిమిత్తం వరంగల్ సుబేదార్ పోలీస్ స్టేషన్‌కు చెందిన ఏఎస్‌ఐ శివకుమార్ మరో ఇద్దరు కానిస్టేబుల్స్ బేల్వాడ జిల్లా హెర్నియ గ్రామానికి వెళ్లారు. నిందితులను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నించగా వారిపై స్థానికులు ఒక్కసారిగా దాడి చేశారు. ఈ సంఘటనలో ఏఎస్‌ఐ శివకుమార్‌తో పాటు కానిస్టేబుల్స్ తీవ్రంగా గాయపడ్డారు. బేల్వాడలోని ఓ ప్రయివేట్ ఆస్పత్రిలో వీరంతా చికిత్స పొందుతున్నారు. మరోవైపు వరంగల్ పోలీసులపై దాడి చేసిన వారిపై రాజస్తాన్ పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment