నాగకన్య పోరాటం | nagakanya fight | Sakshi
Sakshi News home page

నాగకన్య పోరాటం

Published Fri, Oct 7 2016 11:31 PM | Last Updated on Thu, Aug 9 2018 7:28 PM

నాగకన్య పోరాటం - Sakshi

నాగకన్య పోరాటం

గతజన్మ స్మృతుల అన్వేషణలో ఓ నాగకన్యకు ఎదురైన సంఘటనలు ఏంటి? ప్రతికూల శక్తులపై ఆమె ఎటువంటి పోరాటం చేశారు? నాగకన్య నేపథ్యం ఏంటి? అనే కథాంశంతో తెరకెక్కిన సోషియో ఫాంటసీ థ్రిల్లర్ ‘నాగభరణం’. కోడి రామకృష్ణ దర్శకత్వంలో సాజీద్ ఖురేషి, ధావల్ గడ, సొహైల్ అన్సారీ నిర్మించారు. రమ్య, దిగంత్, సాయికుమార్ ప్రధాన పాత్రధారులు. సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై మల్కాపురం శివకుమార్ ఈ నెల 14న రెండు తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేస్తున్నారు. ‘‘క్లైమాక్స్‌లో స్వర్గీయ కన్నడ నటుడు విష్ణువర్థన్‌ను గ్రాఫిక్స్ రూపంలో పునఃసృష్టించిన సన్నివేశాలు అలరిస్తాయి.

మకుట సంస్థ అందించిన విజువల్ ఎఫెక్ట్స్ సినిమాకి బలం. కొత్తదనం కోరుకునే ప్రతి ఒక్కరినీ ఈ సినిమా మెప్పిస్తుంది’’ అన్నారు కోడి రామకృష్ణ. ఇటీవల విడుదలైన పాటలు, ప్రచార చిత్రాలకు చక్కటి ప్రేక్షకాదరణ లభించిందని శివకుమార్ తెలిపారు. ముకుల్‌దేవ్, రవి కాలే తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమేరా: వేణు, సంగీతం: గురుకిరణ్.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement