విజయనగరం: జపాన్ బృందం బుధవారం విజయనగరం జిల్లాలో పర్యటించింది. జిల్లాలోని గంత్యాడ, ఎస్.కోట మండలాల పరిధిలో 15 వేల ఎకరాలకు నీరందించేందుకు నిర్మించిన తాటిపూడి ఆయకట్టు ప్రాజెక్టును సందర్శించింది.
2011లో మొదలైన ఈ ప్రాజెక్టు నిర్మాణానికి జపాన్ ప్రభుత్వం రూ. 23 కోట్ల నిధులు సమకూర్చిన సంగతి తెలిసిందే. కాగా, దండిగా నిధులున్నప్పటికీ నిర్మాణం పనుల్లో తీవ్రజాప్యం నెలకొన్న కారణంగా ప్రాజెక్టు ఇంకా పూర్తికాలేదు. పనులు జరుగుతున్న తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన జపాన్ బృందం.. డిసెంబర్ లోగా పనులు పూర్తిచేయాలని అధికారులను కోరింది. జపాన్ బృందం పర్యటనలో జిల్లా ఇరిగేషన్ ఉన్నతాధికారులు, సిబ్బంది కూడా పాల్గొన్నారు.
పనుల నత్తనడకపై జపాన్ బృందం అసంతృప్తి
Published Wed, Jul 29 2015 4:31 PM | Last Updated on Sun, Sep 3 2017 6:24 AM
Advertisement
Advertisement