japan team
-
నాగార్జునసాగర్ విద్యుత్ కేంద్రాన్ని పరిశీలనుంచనున్న జపాన్ నిపుణులు
-
ఫైనల్ బెర్త్ లక్ష్యంగా...
చెన్నై: ఫైనల్ బెర్తే లక్ష్యంగా భారత హాకీ జట్టు సన్నద్ధమైంది. ఆసియా చాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నమెంట్లో శుక్రవారం జరిగే సెమీఫైనల్లో హర్మన్‌ప్రీత్ బృందం జపాన్ జట్టుతో తలపడుతుంది. ఈ టోరీ్నలో ఇప్పటివరకు ఓటమెరుగని భారత జట్టే ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. ఈ టోర్నీలో అందరిపై అధిపత్యం కనబరిచింది... గెలిచింది. కానీ ఇలాంటి అజేయమైన భారత్‌ను నిలువరించింది మాత్రం జపానే! లీగ్ దశలో ఇరుజట్ల పోరు 1–1తో డ్రాగా ముగిసింది. ఇప్పుడు నాకౌట్ దశలో జరిగే ఈ పోరులో ఎవరు గెలిస్తే వాళ్లే టైటిల్ ఫేవరెట్ కావడం ఖాయం. గతంలో జపాన్ చేతిలో భారత్‌కు చేదు అనుభవం ఉంది. 2021లో బంగ్లాదేశ్‌లో జరిగిన ఆసియా చాంపియన్స్ ట్రోఫీలో లీగ్ దశలో టీమిండియా 6–0తో జపాన్ను చిత్తు చేసినప్పటికీ తీరా సెమీస్‌కు వచ్చేసరికి వారి చేతిలో 3–5తో ఓడి ఇంటికొచ్చింది. ఇప్పుడు సమష్టి ఆటతీరుతో బదులు తీర్చుకుంటుందా లేదంటే స్వదేశంలోనూ గత అనుభవాన్నే చవిచూస్తుందా అనేది ఇంకొన్ని గంటల్లో తేలుతుంది. చివరి లీగ్ మ్యాచ్‌లో పాకిస్తాన్‌ను 4–0తో చిత్తు చేసి జోరుమీదున్న భారత్ పట్టుదలగా ఆడితే విజయం ఏమంత కష్టం కానేకాదు. మరో సెమీఫైనల్లో మలేసియాతో దక్షిణ కొరియా తలపడుతుంది. 5–6 స్థానాల కోసం పాకిస్తాన్, చైనా జట్లు తలపడతాయి. -
FIFA WC: ఇదెక్కడి ఆచారమో ఏంటో.. ఆకట్టుకున్న జపాన్ జట్టు
ఖతర్ వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్‌కప్‌లో సంచలనాలు నమోదవుతూనే ఉన్నాయి. మొన్న అర్జెంటీనాకు సౌదీ అరేబియా షాక్ ఇస్తే.. బుధవారం నాలుగుసార్లు ఛాంపియన్ అయిన జర్మనీని ఆసియా టీమ్ జపాన్ 1-2 తేడాతో ఓడించి చారిత్రాత్మక విజయాన్ని అందుకుంది. కాగా అంతకముందే ఈ వరల్డ్‌కప్‌లో జపాన్ అభిమానులు తమ ప్రత్యేకతను చాటుకున్నారు. ఫిఫా వరల్డ్‌కప్‌లో ఆరంభ మ్యాచ్ అయిన ఖతర్, ఈక్వెడార్ పోరు ముగిసిన తర్వాత స్టాండ్స్‌లో నిండిపోయిన చెత్తను మొత్తం క్లీన్ చేయడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.జపాన్ ప్రజలు పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యమిస్తారు.అక్కడ రోడ్డు మీద వెళ్తూ చాక్లెట్ తింటే ఆ ప్యాక్ ను జేబులోనే పెట్టుకుని రోడ్డు మీద ఉన్న చెత్త డబ్బాల్లో పడేస్తారు. అందుకే జపాన్ లో వీధులు పరిశుభ్రంగా కనిపిస్తాయి. ఇదే సూత్రాన్ని జపాన్ ఫుట్‌బాల్ ఫ్యాన్స్ ఖతర్ స్టేడియంలో కూడా పాటించారు. తాజాగా అభిమానులకు తామేం తీసిపోమని జపాన్ ఫుట్‌బాల్ టీం ఆటగాళ్లు కూడా తమ లాకర్ రూంను శుభ్రం చేసుకున్నారు. జర్మనీతో మ్యాచ్‌లో సంచలన విజయం అనంతరం డ్రెస్సింగ్ రూమ్ చేరుకున్న జపాన్ జట్టు లాకర్ రూంలో చిందర వందరగా పడి ఉన్న వస్తువులను, బట్టలను ఆటగాళ్లంతా కలిసి చక్కగా సర్దుకున్నారు. తమకు వచ్చిన ఆహార పాకెట్లతో సహా టవల్స్, వాటర్ బాటిల్స్, బట్టలను నీట్‌గా సెంటర్లో ఉన్న టేబుల్‌పై పెట్టారు. అనంతరం లాకర్ రూం క్లీన్ చేసిన ఫోటోను ట్విటర్లో షేర్ చేశారు. ఇదే ఫోటోను ఫిఫా షేర్ చేస్తూ ఇలా రాసుకొచ్చింది.''జర్మనీపై చారిత్రక విజయం అనంతరం స్టేడియంలో ఉన్న చెత్తను జపాన్ అభిమానులు క్లీన్ చేస్తే.. లాకర్ రూంలో ఉన్న చెత్తను ఆటగాళ్లు శుభ్రం చేసుకున్నారు.. ఆ తర్వాత తమ వస్తువులను ఎంతో నీట్‌గా సర్దుకున్నారు. ఇది నిజంగా చూడడానికి చాలా బాగుంది. అంటూ ట్వీట్ చేసింది. After an historic victory against Germany at the #FIFAWorldCup on Match Day 4, Japan fans cleaned up their rubbish in the stadium, whilst the @jfa_samuraiblue left their changing room at Khalifa International Stadium like this. Spotless. Domo Arigato.👏🇯🇵 pic.twitter.com/NuAQ2xrwSI — FIFA.com (@FIFAcom) November 23, 2022 After their shocking win against Germany, Japan fans stayed after the match to clean up the stadium. Respect ❤️👏 @ESPNFC pic.twitter.com/ocDtsyXXXB — ESPN (@espn) November 23, 2022 Following their historical win over Germany, Japan fans stayed to clean up the stadium ❤️👏 #SamuraiBlue pic.twitter.com/ABogrUVDjg — FCB One Touch (@FCB_OneTouch) November 23, 2022 చదవండి: FIFA WC: ‘నోరు మూసుకొని’ నిరసన! జర్మనీ ఆటగాళ్లు ఇలా ఎందుకు చేశారంటే -
ఏపీతో కలిసి పనిచేయడానికి సిద్ధం
నెల్లూరు(సెంట్రల్): ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో కలసి పనిచేయడానికి తాము సిద్ధంగా ఉన్నట్లు జపాన్ ప్రత్యేక బృందం తెలిపింది. రాష్ట్రంలో పలు చోట్ల పెట్టుబడులు, ఇతర విషయాలపై చర్చించేందుకు రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డిని జపాన్ ప్రతినిధులు టెక్ గెంట్సియా సీఈవో జాయ్ సెబాస్టియన్, మార్కెటింగ్ సేల్స్ వైస్ ప్రెసిడెంట్ డెనిస్ యూజిస్ అరకవల్ తదితరులు శనివారం నెల్లూరులోని క్యాంపు కార్యాలయంలో కలిశారు. ఏపీతో కలసి పనిచేయడానికి ఆసక్తిగా ఉన్నట్లు మంత్రికి చెప్పారు. ఈ సందర్భంగా ఐటీ, పరిశ్రమలు, నైపుణ్య రంగాల్లో తీసుకుని వస్తోన్న వినూత్న సంస్కరణలతో పాటు, యువతకు ఉపాధి పెంచడం కోసం చేపడుతున్న చర్యలను జపాన్ బృందానికి మంత్రి వివరించారు. రెండు రోజుల్లో మరోసారి భేటీ అయ్యాక పలు అంశాలపై చర్చించి ముందుకు వెళతామని మంత్రి పేర్కొన్నారు. కార్యక్రమంలో బ్లూ ఓషియాన్ బిజినెస్ ఫెసిలిటేషన్ సర్వీసెస్ చైర్మన్ బెన్సి జార్జ్ పాల్గొన్నారు. -
చంద్రబాబుకు షాక్ ఇచ్చిన జపాన్ బృందం
విజయవాడ : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు జపాన్ బృందం షాక్ ఇచ్చింది. తాత్కాలిక సచివాలయం వెలగపూడిలో అయిదు నిమిషాలు కూడా సందర్శించకుండా ఆ బృందం వెళ్లిపోయింది. బస్సులో నుంచే నిర్మాణాలను చూసిన ఆ బృందం వెనుదిరిగింది. కాగా జపాన్ బృందం తాత్కాలిక సచివాలయాన్ని సందర్శిస్తుందంటూ ఎల్లో మీడియా మంగళవారం ఉదయం నుంచే హడావుడి చేసింది. అయితే బృంద సభ్యులు మాత్రం వెలగపూడిలో కనీసం బస్సు దిగి కూడా చూడలేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వచ్చేవరకూ కూడా జపాన్ బృందం అక్కడ వేచి చూడకుండానే వెళ్లిపోయింది. అనంతరం అక్కడకు వచ్చిన చంద్రబాబు... అధికారులతో భేటీ అయ్యారు. సచివాలయ నిర్మాణ మ్యాప్‌ను పరిశీలించిన ఆయన, ఎప్పటికప్పుడూ నిర్మాణ పనులపై నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. -
ఆనకట్టల ఆధునికీకరణ జరిగేనా..?
జపాన్ నిధులపైనే ప్రాజెక్టుల భవితవ్యం నిధులు దోచుకుంటున్న అధికార పార్టీ నేతలు బుచ్చిరెడ్డిపాళెం : జిల్లాలో ఆనకట్టల ఆధునీకరణపై నీలినీడలు కమ్ముకున్నా యి.ఈ విషయంలో రాష్ట్రప్రభుత్వం సొమ్మొకరిది..సోకు మరొకరిది అన్న చందంగా వ్యవహరిస్తోంది. అభివృద్ధి పనులకు నిధులు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నప్పటికీ అవి తమ ప్రభుత్వం చేస్తున్న పనులుగా అధికార పార్టీ చూపుతోంది. తాజాగా జపాన్ బృం దం రాష్ట్రవ్యాప్త పర్యటనలో భాగంగా జిల్లాలోనూ పర్యటించింది. జపాన్ నిధులతో ప్రాజెక్టుల ఆధునికీకరణ పనులు చేపట్టి, ఆ క్రెడిట్ తమ ఖాతా ల్లో వేసుకునే ప్రయత్నంలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. వివరాల్లోకి వెళితే..జపాన్ బృందం ఈ నెల 6న జిల్లాలోని కండలేరు, సంగం ఆనకట్టలను పరిశీలించింది. అయితే వాటి పరిధిలో జరుగుతున్న పనులు, అధికారుల నిర్లక్ష్యాన్ని చూసి జపాన్ బృందం నవ్వుకుంది. వాస్తవానికి జిల్లాలోని కండలేరు, సోమశిల, కనిగిరి రిజర్వాయర్ల అభివృద్ధి పనులు జరగాల్సి ఉంది. గేట్ల మరమ్మతుల మొదలు సామర్థ్యాన్ని పెంచేందుకు పలు పనులు చేపట్టాల్సి ఉంది. అయితే అధికారులు మాత్రం జపాన్ బృందానికి నామమాత్రంగా సంగం ఆనకట్టను, కండలేరు జలాశయాన్ని చూపి మమ అనిపించారు. ఆయా ఆన కట్టల పరిధిలో ఎన్నో కాలువలు నేటికీ అభివృద్ధికి నోచుకోలేదు.ఆనక ట్టల అభివృద్ధికే రూ. 800 కోట్లు అవసరమవుతాయని జపాన్ బృందం అంచనా వేసిన ట్లు సమాచారం. అయితే అంతటితో సరిపెడితే పనిపూర్తి కాదని చివరి పంటకు నీరందేలా కాలువల అభివృద్ధి పనులు కూడా చేయాల్సి వస్తోందని బృందం భావించినట్లు తెలిసింది. ప్రభుత్వం నియమించిన కమిటీ జాడేది..? జిల్లాలోని రిజర్వాయర్లు, కాలువలపై అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని ఏడాది క్రితం రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక కమిటీని నియమిస్తున్నట్లు ప్రకటిం చారు. కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం తదుపరి చర్యలు చేపట్టనున్నామన్నారు. రిజర్వాయర్లను అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. కమిటీ పరిశీలన జరిపి ఏడాది దాటుతున్నా ఆ దిశగా పనులు చేసిన దాఖలాలు లేవు. కేవలం కాలువల పనులు అధికార పార్టీ నేతల దోపిడీకే పరిమితమయ్యాయి. కాలువల అభివృద్ధి ఏదీ? జిల్లాలో కాలువల అభివృద్ధి పనులు నామమాత్రంగా జరుగుతున్నాయి. ఇరిగేషన్ అధికారుల కాసుల కక్కుర్తితో పనులు తూతూమంత్రంగా జరుగుతున్నాయి. రూ.50 లక్షల నిధులతో చేపట్టిన మలిదేవి డ్రెయిన్ పనులు అస్తవ్యస్తంగా జరిగిన విషయం తెలిసిందే. అధికార పార్టీ నేతలకు ఇరిగేషన్ ఏఈ మొదలు ఎస్ఈ వరకు దాసోహమయ్యారు. కాలువ పనుల్లో అవినీతి జరుగుతున్నా పట్టించుకోవడం లేదు. జపాన్ నిధులతోనే ప్రాజెక్టు భవితవ్యం కాలువల పనుల పేరుతో అధికార పార్టీ నేతలకు ప్రభుత్వం కోట్లు దోచి పెడుతున్న విషయం చెప్పనక్కర్లేదు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వంపై ఆశలు వదులుకున్న రైతులు జపాన్ నిధుల కోసం ఎదురుచూస్తున్నారు. అయితే జపాన్ బృందం మాత్రం ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి నెలాఖరు వరకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలో పర్యటించనున్నట్లు తెలిపింది. పూర్తిగా వివరాలు తీసుకున్న తరువాతే తదుపరి చర్యలు ఉంటాయని ప్రకటించింది. ఈ మేరకు జపాన్ నిధులతో ప్రాజెక్టుల భవితవ్యం తేలనుందని విశ్లేషకులు చెబుతున్నారు. జిల్లాలో ఆనకట్టల ఆధునికీక రణ అటకెక్కింది. జపాన్ నిధులపైనే ప్రాజెక్టుల భవితవ్యం ఆధారపడి ఉంది. ప్రభుత్వం కేటాయించిన నిధులు అధికారపార్టీ నేతల దోపిడీకి గురయ్యాయి. ఫలితంగా సాగునీరు రైతులకు సక్రమంగా అందడంలేదు. -
శివభాష్యం సాగర్ లో జపాన్ బృందం
ఆత్మకూరు: కర్నూలు జిల్లా ఆత్మకూరులోని శివభాష్యం సాగర్ మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టు జపాన్‌కు చెందిన జైకా టీం సభ్యులు సందర్శించారు. గురువారం వచ్చిన ఐదుగురు సభ్యుల బృందానికి జిల్లా మైనర్ ఇరిగేషన్ ఎస్ఈ చంద్రశేఖర్ రెడ్డితో పాటు పలువురు అధికారులు స్వాగతం పలికారు. ప్రాజెక్టు పరిస్థితిని జైకా టీం ప్రతినిధులు పరిశీలించారు. ఆధునీకరణకు చేపట్టాల్సిన చర్యలను అక్కడి అధికారులతో కలిసి చర్చించారు. ప్రాజెక్టు ఆనకట్టను పరిశీలించిన అనంతరం వారు అక్కడి రైతులతో మాట్లాడారు. -
పనుల నత్తనడకపై జపాన్ బృందం అసంతృప్తి
విజయనగరం: జపాన్ బృందం బుధవారం విజయనగరం జిల్లాలో పర్యటించింది. జిల్లాలోని గంత్యాడ, ఎస్.కోట మండలాల పరిధిలో 15 వేల ఎకరాలకు నీరందించేందుకు నిర్మించిన తాటిపూడి ఆయకట్టు ప్రాజెక్టును సందర్శించింది. 2011లో మొదలైన ఈ ప్రాజెక్టు నిర్మాణానికి జపాన్ ప్రభుత్వం రూ. 23 కోట్ల నిధులు సమకూర్చిన సంగతి తెలిసిందే. కాగా, దండిగా నిధులున్నప్పటికీ నిర్మాణం పనుల్లో తీవ్రజాప్యం నెలకొన్న కారణంగా ప్రాజెక్టు ఇంకా పూర్తికాలేదు. పనులు జరుగుతున్న తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన జపాన్ బృందం.. డిసెంబర్ లోగా పనులు పూర్తిచేయాలని అధికారులను కోరింది. జపాన్ బృందం పర్యటనలో జిల్లా ఇరిగేషన్ ఉన్నతాధికారులు, సిబ్బంది కూడా పాల్గొన్నారు. -
రాజధాని ప్రాంతంలో జపాన్ బృందం ఏరియల్ సర్వే
విజయవాడ : గుంటూరు జిల్లాలోని రాజధాని ప్రతిపాదిత ప్రాంతంలో జపాన్ బృందం బుధవారం ఏరియల్ సర్వే చేసింది. తొలుత కృష్ణా జిల్లాలో వివిధ ప్రాంతాల్లో బృంద సభ్యులు పర్యటించారు. అనంతరం హెలికాప్టర్ ద్వారా రాజధాని ప్రతిపాదిత ప్రాంతాన్ని పరిశీలించినట్లు కలెక్టర్ బాబు.ఎ తెలిపారు. జపాన్ పారిశ్రామిక వేత్తల బృంద సభ్యులు మూడు దశల్లో పర్యటించారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామిక అభివృద్ధికి చేపట్టిన అంశాలను సమగ్రంగా వివరించామన్నారు. ఈ పర్యటనపై జపాన్ ఆర్థిక మంత్రి ఆకియో ఇసోమాట ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పారిశ్రామిక అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలను ప్రశంసించారని కలెక్టర్ తెలిపారు. ఏరియల్ పరిశీలనలో కృష్ణా, గుంటూరు జిల్లాల కలెక్టర్లతోపాటు జపాన్ ఎంబసీలు ఏకియో ఇసోమోటా, టోమో పూమి, పుకామియా, ప్యూజి ఎలక్ట్రానిక్స్‌కు చెందిన టోమో యూకి కవాగోయి, హిటాచి మపాయోఫి తముర, జె.ఆర్.ఐ కిమిహికో, టకా మల్సూ, శంకర్ నారాయణ, హిటాచి జోసిన్, హిచిరో ఎబిఐ జెట్రో, హిరోషి హషి మోటో, కజిమా పర్యటించారు. జిల్లా కలెక్టర్ బాబు.ఎ, గుంటూరు కలెక్టర్ కాంతిలాల్ దండే, ఢిల్లీలోని ఎ.పి.భవన్ రెసిడెంట్ కమిషనర్ వీణా ఈష్, సీఆర్డీఏ అదనపు కమిషనర్ గంధం చంద్రుడు,సబ్ కలెక్టర్ ఎస్. నాగలక్ష్మి, ట్రైనీ కలెక్టర్ ఎల్. శివశంకర్ తదితరులు ఉన్నారు. అనంతరం బృందం సభ్యులుగన్నవరం విమానాశ్రయం నుంచి హైదరాబాద్ వెళ్లారు. -
అమ్మో.. ఇది కష్టాల తీరం!
పోలాకి: థర్మల్ ప్లాంట్ ఏర్పాటుకు స్థలపరిశీలన జరుపుతున్న జపాన్ బృందానికి మృతి చెందిన ఆలివ్ రిడ్లే తాబేలు అపశకునం పలికింది. దాన్ని గమనించిన సభ్యులు దిస్ ప్లేస్ ఈజ్ వెరీ క్రిటికల్(ఇది అత్యంత సున్నిత ప్రాంతం) అని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం జిల్లాలో 4వేల మెగావాట్ల ఆల్ట్రామెగా సూపర్ క్రిటికల్ థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణానికి స్ధల పరిశీలన చేస్తున్న జపాన్‌కు చెందిన సుమిటొమొ సంస్థ ప్రతినిధుల బృందం రెండో రోజైన బుధవారం పోలాకి మండలంలో పర్యటించింది. ఈ బృందానికి ఏపీ జెన్కో ఉన్నతాధికారులతో పాటు స్థానిక రెవెన్యూ యంత్రాంగం ఇక్కడి భూముల వివరాలు, స్ధితిగతుల గూర్చి వివరించారు. ముందుగా చీడివలస, ఓదిపాడు, గవరంపేట, చెల్లాయివలసల్లోని మెట్టు భూములను పరిశీలించిన బృందం సభ్యులు అనంతరం కొత్తరేవు పంచాయతీలోని కొవిరిపేట సముద్రతీరానికి చేరుకున్నారు. అక్కడ నీటి సాంధ్రత, ఉప్పు శాతంతో పాటు ప్రతిపాదిత ప్లాంట్ స్థలానికి గల దూరంపై ఆరా తీశారు. ఈ సందర్భంగా తీరంలో పడి ఉన్న ఆలివ్ రిడ్లే తాబేలు కళేబరాన్ని గమనించి ‘దిస్ ప్లేస్ ఈజ్ వెరీ క్రిటికల్’ అని వ్యాఖ్యానించారు. ప్రత్యేక జాతికి చెందిన ఈ తాబేళ్ల మనుగడపై అంతర్జాతీయస్ధాయిలో ఒత్తిడి ఉంటుందని సభ్యులు అభిప్రాయపడ్డారు. అనంతరం తోటాడ సమీపంలోని సన్యాసిరాజుపేట గుట్టలను పరిశీలించారు. అక్కడి ఉష్ణోగ్రత, సముద్రమట్టం నుంచి ఎంత ఎత్తులో ఉందన్న సమాచారం సేకరించారు. రైలు, రోడ్డు, పోర్టు కనెక్టివిటీ, నీటి వసతి బాగున్నాయని రెవెన్యూ, జెన్కో అధికారులు మ్యాప్ ఆధారంగా జపాన్ బృందానికి వివరించారు. అక్కడి నుంచి జోగంపేట తీరానికి వెళ్లారు. అక్కడి సౌకర్యాలు, ఇతర వివరాలు నమోదు చేసుకున్నారు. వీరి వెంట ఏపీ జెన్కో చీఫ్ ఇంజినీర్ నాగేశ్వరరావు, ఈఈలు కె.మూర్తి, సీవీ రంగనాగన్, రాజకుమార్, రామక్రిష్ణ, తహశీల్దార్ జె.రామారావు, తదితరులు ఉన్నారు. గట్టి బందోబస్తు జపాన్ బృందం పర్యటన నేపథ్యంలో శ్రీకాకుళం డీఎస్పీ భార్గవనాయుడు ఆధ్వర్యంలో నరసన్నపేట సీఐ చంద్రశేఖర్, పోలాకి ఎస్ఐ సత్యనారాయణలు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలాకి పోలీస్ సిబ్బందితో పాటు మరో 50 మంది బలగాలను ఈదులవలస జంక్షన్లో మోహరించారు. -
నవంబర్‌లో చంద్రబాబు జపాన్ పర్యటన
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నవంబర్ 24వ తేదీ నుంచి వారం రోజుల పాటు జపాన్ పర్యటనకు వెళ్లనున్నారు. ఈ పర్యటనలో ఆయనవెంట పారిశ్రామిక ప్రతినిధులు కూడా ఉంటారని అధికార వర్గాలు తెలిపాయి. జపాన్ దేశ ప్రతినిధి బృందం బుధవారం చంద్రబాబుతో సచివాలయంలో భేటీ అయింది. ఈ సందర్భంగా తన జపాన్ పర్యటన గురించి చంద్రబాబు వెల్లడించారు. విజయవాడ, గుంటూరు ప్రాంతాల్లో నిర్మించనున్న స్మార్ట్ క్యాపిటల్ సిటీకి తమ సాంకేతిక సహకారం ఉంటుందని జపాన్ బృందం తెలిపింది. విశాఖపట్నంలో నెలకోల్పే 4 వేల మెగావాట్ల విద్యుత్ ప్లాంటు, శ్రీకాకుళంలో నాలుగు వేల మెగావాట్లు, అనంతపురంలో రెండు వేల మెగావాట్ల సోలార్‌పవర్ ప్లాంట్ల ఏర్పాటుకు సహకరిస్తామని పేర్కొంది. -
జపాన్ బృందంతో చంద్రబాబు భేటీ
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జపాన్ ప్రతినిధుల బృందంతో సమావేశమయ్యారు. 'స్మార్ట్ కేపిటల్ సిటీ' నిర్మాణంలో ఆంధ్రప్రదేశ్‌కు సహకరించేందుకు జపాన్ ముందుకొచ్చింది. చంద్రబాబు నవంబర్‌లో జపాన్ పర్యటనకు వెళ్లనున్నారు. -
సూపర్ జపాన్
తొలిసారి థామస్ కప్ కైవసం న్యూఢిల్లీ: సెమీఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ చైనాపై సాధించిన విజయం గాలివాటం ఏమీ కాదని జపాన్ జట్టు నిరూపించింది. అద్వితీయ ఆటతీరుతో తొలిసారి పురుషుల టీమ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ ‘థామస్ కప్’ను సొంతం చేసుకుంది. ఆదివారం జరిగిన ఫైనల్లో జపాన్ 3-2తో గతంలో ఐదుసార్లు చాంపియన్‌గా నిలిచిన మలేసియాను ఓడించింది. తొలి మ్యాచ్‌లో ప్రపంచ నంబర్‌వన్ లీ చోంగ్ వీ 21-12, 21-16తో కెనిచి టాగోపై నెగ్గి మలేసియాకు 1-0 ఆధిక్యాన్ని అందించాడు. రెండో మ్యాచ్‌లో హయకావా-హిరోయుకి ఎండో జోడి 12-21, 21-17, 21-19తో బూన్ తాన్-థియెన్ హూన్ జంటను ఓడించి జపాన్ స్కోరును 1-1తో సమం చేసింది. మూడో మ్యాచ్‌లో కెంటో మొమొటా 21-15, 21-17తో వీ ఫెంగ్ చోంగ్‌పై గెలిచి జపాన్ను 2-1తో ఆధిక్యంలో నిలిపాడు. నాలుగో మ్యాచ్‌లో షెమ్ గో-వీ కియోంగ్ తాన్ ద్వయం 19-21, 21-17, 21-12తో కీగో సోనోదా-కమూరా జోడిపై గెలిచి మలేసియా 2-2తో స్కోరును సమం చేసింది. నిర్ణాయక ఐదో మ్యాచ్‌లో టకూమా ఉయెదా 21-12, 18-21, 21-17తో డారెన్ లూపై గెలిచి జపాన్‌కు 3-2తో చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. సెమీఫైనల్స్‌లో ఓడిన చైనా, ఇండోనేసియా జట్లకు కాంస్య పతకాలు లభించాయి.