తొలిసారి థామస్ కప్ కైవసం
న్యూఢిల్లీ: సెమీఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ చైనాపై సాధించిన విజయం గాలివాటం ఏమీ కాదని జపాన్ జట్టు నిరూపించింది. అద్వితీయ ఆటతీరుతో తొలిసారి పురుషుల టీమ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ ‘థామస్ కప్’ను సొంతం చేసుకుంది. ఆదివారం జరిగిన ఫైనల్లో జపాన్ 3-2తో గతంలో ఐదుసార్లు చాంపియన్‌గా నిలిచిన మలేసియాను ఓడించింది. తొలి మ్యాచ్‌లో ప్రపంచ నంబర్‌వన్ లీ చోంగ్ వీ 21-12, 21-16తో కెనిచి టాగోపై నెగ్గి మలేసియాకు 1-0 ఆధిక్యాన్ని అందించాడు.
రెండో మ్యాచ్‌లో హయకావా-హిరోయుకి ఎండో జోడి 12-21, 21-17, 21-19తో బూన్ తాన్-థియెన్ హూన్ జంటను ఓడించి జపాన్ స్కోరును 1-1తో సమం చేసింది. మూడో మ్యాచ్‌లో కెంటో మొమొటా 21-15, 21-17తో వీ ఫెంగ్ చోంగ్‌పై గెలిచి జపాన్‌ను 2-1తో ఆధిక్యంలో నిలిపాడు. నాలుగో మ్యాచ్‌లో షెమ్ గో-వీ కియోంగ్ తాన్ ద్వయం 19-21, 21-17, 21-12తో కీగో సోనోదా-కమూరా జోడిపై గెలిచి మలేసియా 2-2తో స్కోరును సమం చేసింది. నిర్ణాయక ఐదో మ్యాచ్‌లో టకూమా ఉయెదా 21-12, 18-21, 21-17తో డారెన్ లూపై గెలిచి జపాన్‌కు 3-2తో చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. సెమీఫైనల్స్‌లో ఓడిన చైనా, ఇండోనేసియా జట్లకు కాంస్య పతకాలు లభించాయి.
సూపర్ జపాన్
Published Mon, May 26 2014 1:06 AM | Last Updated on Sat, Sep 2 2017 7:50 AM
Advertisement
Advertisement