ప్రపంచ బ్యాడ్మింటన్‌లో తమకు తిరుగులేదని చైనా జట్లు మరోసారి చాటుకున్నాయి. థామస్ కప్, ఉబెర్ కప్ టీమ్ టోర్నమెంట్‌లో విజేతగా అవతరించాయి. సొంతగడ్డపై ఆదివారం ముగిసిన ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో చైనా మహిళల జట్టు ఉబెర్ కప్‌ను 16వ సారి... చైనా పురుషుల జట్టు థామస్ కప్‌ను 11వ సారి సొంతం చేసుకున్నాయి.
ఇండోనేసియాతో జరిగిన ఉబెర్ కప్ టైటిల్ పోరులో చైనా 3–0తో గెలిచింది. తొలి మ్యాచ్‌లో చెన్ యు ఫె 21–7, 21–16తో మరిస్కాపై... రెండో మ్యాచ్‌లో చెన్ కింగ్ చెన్–జియా యి ఫాన్ 21–11, 21–8తో సితి ఫాదియా–రిబ్కా సుగియార్తోలపై... మూడో మ్యాచ్‌లో హి బింగ్ జియావో 10–21, 21–15, 21–17తో ఎస్తెర్‌పై గెలిచారు. థామస్ కప్ ఫైనల్లో చైనా 3–1తో ఇండోనేసియాను ఓడించింది.
తొలి మ్యాచ్‌లో షి యు కి 21–17, 21–6 తో జిన్‌టింగ్‌పై, రెండో మ్యాచ్‌లో లియాంగ్ –వాంగ్ చాంగ్ 21–18, 17–21, 21–17తో ఫజర్–అర్దియాంతోలపై నెగ్గడంతో చైనా 2–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. మూడో మ్యాచ్‌లో జొనాథన్ క్రిస్టీ (ఇండోనేసియా) 21–16, 15–21, 21–17తో లీ షి ఫెంగ్‌ను ఓడించాడు. నాలుగో మ్యాచ్‌లో హి జి టింగ్–జియాంగ్ 21–11, 21–15తో ఫిక్రి–మౌలానాలపై నెగ్గి చైనాకు 3–1తో టైటిల్‌ను ఖరారు చేశారు.
ఇవి చదవండి: స్టార్ రెజ్లర్ బజరంగ్ పై.. తాత్కాలిక నిషేధం!
Comments
Please login to add a commentAdd a comment