Uber Cup
-
చైనా ‘డబుల్’ ధమాకా... థామస్ కప్, ఉబెర్ కప్ టైటిల్స్ సొంతం..
ప్రపంచ బ్యాడ్మింటన్‌లో తమకు తిరుగులేదని చైనా జట్లు మరోసారి చాటుకున్నాయి. థామస్ కప్, ఉబెర్ కప్ టీమ్ టోర్నమెంట్లో విజేతగా అవతరించాయి. సొంతగడ్డపై ఆదివారం ముగిసిన ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో చైనా మహిళల జట్టు ఉబెర్ కప్‌ను 16వ సారి... చైనా పురుషుల జట్టు థామస్ కప్‌ను 11వ సారి సొంతం చేసుకున్నాయి.ఇండోనేసియాతో జరిగిన ఉబెర్ కప్ టైటిల్ పోరులో చైనా 3–0తో గెలిచింది. తొలి మ్యాచ్‌లో చెన్ యు ఫె 21–7, 21–16తో మరిస్కాపై... రెండో మ్యాచ్‌లో చెన్ కింగ్ చెన్–జియా యి ఫాన్ 21–11, 21–8తో సితి ఫాదియా–రిబ్కా సుగియార్తోలపై... మూడో మ్యాచ్‌లో హి బింగ్ జియావో 10–21, 21–15, 21–17తో ఎస్తెర్పై గెలిచారు. థామస్ కప్ ఫైనల్లో చైనా 3–1తో ఇండోనేసియాను ఓడించింది.తొలి మ్యాచ్‌లో షి యు కి 21–17, 21–6 తో జిన్టింగ్పై, రెండో మ్యాచ్‌లో లియాంగ్ –వాంగ్ చాంగ్ 21–18, 17–21, 21–17తో ఫజర్–అర్దియాంతోలపై నెగ్గడంతో చైనా 2–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. మూడో మ్యాచ్‌లో జొనాథన్ క్రిస్టీ (ఇండోనేసియా) 21–16, 15–21, 21–17తో లీ షి ఫెంగ్‌ను ఓడించాడు. నాలుగో మ్యాచ్‌లో హి జి టింగ్–జియాంగ్ 21–11, 21–15తో ఫిక్రి–మౌలానాలపై నెగ్గి చైనాకు 3–1తో టైటిల్‌ను ఖరారు చేశారు.ఇవి చదవండి: స్టార్ రెజ్లర్ బజరంగ్ పై.. తాత్కాలిక నిషేధం! -
ఉబెర్ కప్ టోర్నీకి సింధు దూరం
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక ఉబెర్ కప్ మహిళల టీమ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ పోటీల్లో ఈసారి భారత ద్వితీయ శ్రేణి జట్టు బరిలోకి దిగనుంది. ఈ మెగా టోర్నీ ఏప్రిల్ 27 నుంచి మే 5 వరకు చైనాలోని చెంగ్డూలో జరగనుంది. సింగిల్స్ విభాగం నుంచి స్టార్ ప్లేయర్ పీవీ సింధు తప్పుకోగా... డబుల్స్ విభాగం నుంచి పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ; అశ్విని పొన్నప్ప–తనీషా క్రాస్టో జోడీలు కూడా వైదొలిగాయి. పారిస్ ఒలింపిక్స్కల్లా తన ఆటలో మరింత పదును పెరిగేందుకు, పూర్తి ఫిట్‌గా ఉండేందుకు సింధు ఉబెర్ కప్ నుంచి వైదొలగాలని నిర్ణయం తీసుకుంది. పారిస్ ఒలింపిక్స్ బెర్త్‌లు దక్కించుకోవాలనే లక్ష్యంతో గాయత్రి–ట్రెసా, అశ్విని–తనీషా జోడీలు ఇతర క్వాలిఫయింగ్ టోర్నీలపై దృష్టి పెట్టాయి. భారత మహిళల జట్టు ఉబెర్‌కప్‌లో మూడుసార్లు (1957, 2014, 2016) సెమీఫైనల్లో ఓడి కాంస్య పతకాలు సాధించింది. మరోవైపు థామస్ కప్ పురుషుల టీమ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో డిఫెండింగ్ చాంపియన్ భారత్ పూర్తి బలగంతో బరిలోకి దిగనుంది. భారత మహిళల జట్టు: అన్మోల్, తన్వీ శర్మ, అష్మిత, ఇషారాణి బారువా (సింగిల్స్); శ్రుతి మిశ్రా, ప్రియా కొంజెంగ్‌బమ్, సిమ్రన్, రితిక (డబుల్స్). భారత పురుషుల జట్టు: ప్రణయ్, లక్ష్య సేన్, శ్రీకాంత్, ప్రియాన్షు, కిరణ్ జార్జి (సింగిల్స్); సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి, అర్జున్, ధ్రువ్ కపిల, సాయిప్రతీక్ (డబుల్స్). ఆసియా చాంపియన్‌షిప్ నుంచి వైదొలిగిన సాత్విక్ జోడీ భుజం గాయం నుంచి సాత్విక్ పూర్తిగా కోలుకోకపోవడంతో... ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ నుంచి సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి జోడీ వైదొలిగింది. గత ఏడాది దుబాయ్‌లో జరిగిన ఈ మెగా టోర్నీలో సాత్విక్–చిరాగ్ శెట్టి ద్వయం పురుషుల డబుల్స్‌లో స్వర్ణ పతకం సాధించి కొత్త చరిత్ర సృష్టించింది. థామస్ కప్‌లో మాత్రం సాత్విక్–చిరాగ్ ద్వయం బరిలోకి దిగుతుందని భారత బ్యాడ్మింటన్ సంఘం తెలిపింది. ఆసియా చాంపియన్‌షిప్ ఈనెల 9 నుంచి 14 వరకు చైనాలో జరుగుతుంది. -
థామస్ కప్–ఉబెర్ కప్‌లో భారత జట్లు శుభారంభం
బ్యాంకాక్: ప్రతిష్టాత్మక థామస్ కప్–ఉబెర్ కప్ టీమ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత పురుషుల, మహిళల జట్లు శుభారంభం చేశాయి. థామస్ కప్‌లో భారత పురుషుల జట్టు గ్రూప్ ‘సి’ తొలి లీగ్ మ్యాచ్‌లో 5–0తో జర్మనీపై నెగ్గగా... ఉబెర్ కప్‌లో భారత మహిళల జట్టు గ్రూప్ ‘డి’ తొలి లీగ్ మ్యాచ్‌లో 4–1తో కెనడా జట్టును ఓడించింది. జర్మనీతో పోటీలో తొలి మ్యాచ్‌లో లక్ష్య సేన్ 21–16, 21–13తో మాక్స్ వీస్కిర్చెన్ను ఓడించగా... రెండో మ్యాచ్‌లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి ద్వయం 21–15, 10–21, 21–13తో జోన్స్ రాల్ఫీ–మార్విన్ సీడెల్ జోడీపై నెగ్గింది. మూడో మ్యాచ్‌లో కిడాంబి శ్రీకాంత్ 18–21, 21–9, 21–11తో కాయ్ ష్కాఫెర్పై గెలిచి భారత్‌కు 3–0తో ఆధిక్యాన్ని అందించడంతోపాటు విజయాన్ని ఖరారు చేశాడు. నాలుగో మ్యాచ్‌లో అర్జున్ –ధ్రువ్ జోడీ... ఐదో మ్యాచ్‌లో ప్రణయ్ కూడా నెగ్గ డంతో భారత్ 5–0తో జర్మనీని క్లీన్‌స్వీప్ చేసింది. సింధు అలవోకగా... కెనడాతో జరిగిన పోటీలో తొలి సింగిల్స్‌లో ప్రపంచ ఏడో ర్యాంకర్ పీవీ సింధు 21–17, 21–10తో 11వ ర్యాంకర్ మిచెల్లి లీపై 33 నిమిషాల్లో గెలిచి భారత్‌కు 1–0 ఆధిక్యాన్ని అందించింది. రెండో మ్యాచ్‌లో శ్రుతి మిశ్రా–సిమ్రన్ సింగ్ జంట ఓడిపోవడంతో స్కోరు 1–1తో సమమైంది. అయితే ఆ తర్వాతి మూడు మ్యాచ్‌ల్లో ఆకర్షి కశ్యప్ ... తనీషా–ట్రెసా జాలీ జంట... అష్మిత నెగ్గడంతో భారత్ 4–1తో విజయాన్ని దక్కించుకుంది. -
2022 Thomas-Uber Cup: ఈసారైనా పతకం వచ్చేనా!
బ్యాంకాక్: ప్రతిష్టాత్మక థామస్ కప్, ఉబెర్ కప్ టీమ్ బ్యాడ్మింటన్ టోర్నీలో పతకాలే లక్ష్యంగా భారత పురుషుల, మహిళల జట్లు బరిలోకి దిగనున్నాయి. నేడు జరిగే తొలి లీగ్ మ్యాచ్‌ల్లో జర్మనీతో భారత పురుషుల జట్టు... కెనడాతో భారత మహిళల జట్టు తలపడతాయి. ఈ మెగా ఈవెంట్లో అందరి కళ్లు థామస్ కప్‌లో పోటీపడనున్న భారత పురుషుల జట్టుపైనే ఉన్నాయి. థామస్ కప్ చరిత్రలో భారత్‌కు ఇప్పటివరకు ఒక్కసారీ పతకం రాలేదు. మరోవైపు మహిళల ఈవెంట్ ఉబెర్ కప్‌లో భారత్ రెండుసార్లు (2014, 2016) సెమీఫైనల్ చేరి కాంస్య పతకాలు సాధించింది. లక్ష్య సేన్, శ్రీకాంత్, ప్రణయ్... సాత్విక్–చిరాగ్ శెట్టిలతో భారత పురుషుల జట్టు పటిష్టంగా కనిపిస్తోంది. గ్రూప్ ‘సి’లో జర్మనీ, చైనీస్ తైపీ, కెనడా జట్లతో భారత్ పోటీపడనుంది. ఈసారి భారత మహిళల జట్టులో పీవీ సింధు మినహా మిగతా వారందరూ అంతర్జాతీయస్థాయిలో అంతగా అనుభవంలేని వారే ఉన్నారు. గ్రూప్ ‘డి’లో భారత్‌తోపాటు కొరియా, కెనడా, అమెరికా జట్లు ఉన్నాయి. భారత్‌కు విజయం దక్కా లంటే సింధుతోపాటు ఉన్నతి హుడా, ఆకర్షి కశ్యప్ సింగిల్స్‌లో రాణించాల్సి ఉంటుంది. -
ఇక ఉబెర్ కప్ టోర్నీపై దృష్టి: పీవీ సింధు
ఆసియా చాంపియన్‌షిప్ సెమీఫైనల్లో పెనాల్టీ పాయింట్ వివాదం కూడా తన ఓటమికి ఒక కారణమని భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు అభిప్రాయపడింది. ఇక తన దృష్టంతా ఈనెల 8 నుంచి జరిగే ఉబెర్ కప్ టోర్నీపై ఉందని తెలిపింది. సమయానికి విమానం అందుకోవాలనే కారణంతో సింధు పతకాల ప్రదానోత్సవ కార్యక్రమానికి హాజరు కాలేదని.. అంతే తప్ప సెమీఫైనల్ ఉదంతంపై నిరసన వ్యక్తం చేయడానికి కాదని సింధు తండ్రి పీవీ రమణ తెలిపారు. ఈ విషయమై నిర్వాహకులకు సింధు సమాచారం ఇచ్చిందని ఆయన అన్నారు. చదవండి: PV Sindhu: 'ఇది చాలా అన్యాయం'.. అంపైర్‌పై పీవీ సింధు ఆగ్రహం -
Uber Cup: టోర్నీకి సిక్కి రెడ్డి దూరం.. కారణమిదే
Uber Cup Tourney: Sikki Reddy- Ashwini Ponnappa: భారత బ్యాడ్మింటన్ డబుల్స్ స్టార్ సిక్కి రెడ్డి ప్రముఖ టీమ్ ఈవెంట్ ఉబెర్ కప్ నుంచి వైదొలిగింది. ఆమె పొత్తికడుపు కండరాల్లో గాయమైంది. కోలుకునేందుకు సిక్కి రెడ్డికి 4 నుంచి 6 వారాల సమయం పడుతుందని డాక్టర్లు తేల్చారు. దాంతో వచ్చే నెల 8 నుంచి 15 వరకు బ్యాంకాక్‌లో జరిగే ఉబెర్ కప్ నుంచి సిక్కి రెడ్డి–అశ్విని పొన్నప్ప జంట వైదొలిగింది. ఈ జోడీ స్థానంలో సిమ్రన్æ–రితిక జంటను ఉబెర్ కప్ కోసం ఎంపిక చేసినట్లు భారత బ్యాడ్మింటన్ సంఘం తెలిపింది. చదవండి: రజతం నెగ్గిన రెజ్లర్లు అన్షు, రాధిక.. మనీషాకు కాంస్యం -
ఉన్నతి హుడాకు చోటు
న్యూఢిల్లీ: ఈ ఏడాది ప్రతిష్టాత్మక టీమ్ ఈవెంట్లలో పాల్గొనే భారత బ్యాడ్మింటన్ జట్లను ‘బాయ్’ ప్రకటించింది. ఏప్రిల్ 15నుంచి 20 వరకు ఆరు రోజుల పాటు జరిగిన సెలక్షన్ ట్రయల్స్‌లో షట్లర్ల ప్రదర్శనను బట్టి ఆటగాళ్లను జట్టులోకి తీసుకున్నారు. ట్రయల్స్‌కు ముందే నేరుగా అర్హత సాధించిన ప్లేయర్లతో పాటు ట్రయల్స్‌లో అత్యుత్తమ ప్రదర్శన కనపర్చిన ఆటగాళ్లతో కూడిన జాబితాను సెలక్టర్లు వెల్లడించారు. ఈ ఏడాది జరిగే కామన్వెల్త్, ఆసియా క్రీడలతో పాటు థామస్, ఉబెర్ కప్‌లలో వీరు సింగిల్స్, డబుల్స్, మిక్స్డ్ డబుల్స్ విభాగాల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తారు. మహిళల సింగిల్స్‌లో టీనేజ్ సంచలనం ఉన్నతి హుడాకు తొలి సారి చోటు లభించింది. హరియాణాలోని రోహ్టక్కు చెందిన 14 ఏళ్ల ఉన్నతి సెలక్షన్ ట్రయల్స్‌లో మూడో స్థానంలో నిలిచింది. ఆసియా క్రీడల జట్టులో స్థానం దక్కించుకున్న అతి పిన్న వయస్కురాలిగా ఉన్నతి నిలిచింది. ట్రయల్స్ ద్వారా పారదర్శకంగా ఆటగాళ్ల ఎంపిక జరిగిందని, ప్రతిభ గలవారే అవకాశం దక్కించుకున్నారని ‘బాయ్’ ప్రధాన కార్యదర్శి సంజయ్ మిశ్రా అన్నారు. మూడు మెగా ఈవెంట్ల కోసం కాకుండా ఓవరాల్‌గా 40 మందిని సీనియర్ కోచింగ్ క్యాంప్ కోసం కూడా ఎంపిక చేశారు. ఎంపికైన ఆటగాళ్ల జాబితా: కామన్వెల్త్ క్రీడలు: పురుషుల విభాగం – లక్ష్యసేన్, కిడాంబి శ్రీకాంత్, సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి, సుమీత్ రెడ్డి మహిళల విభాగం – పీవీ సింధు, ఆకర్షి కశ్యప్, ట్రెసా జాలీ, పుల్లెల గాయత్రి, అశ్విని పొన్నప్ప ఆసియా క్రీడలు, థామస్–ఉబెర్ కప్ పురుషుల విభాగం – లక్ష్య సేన్, కిడాంబి శ్రీకాంత్, హెచ్ఎస్ ప్రణయ్, ప్రియాన్షు రజావత్, చిరాగ్ శెట్టి, సాత్విక్ సాయిరాజ్, ధ్రువ్ కపిల, ఎంఆర్ అర్జున్, విష్ణువర్ధన్ గౌడ్, జి.కృష్ణప్రసాద్ మహిళల విభాగం – పీవీ సింధు, ఆకర్షి కశ్యప్, అస్మిత చాలిహా, ఉన్నతి హుడా, ట్రెసా జాలీ, పుల్లెల గాయత్రి, ఎన్.సిక్కి రెడ్డి, అశ్విని పొన్నప్ప, తనీషా క్రాస్టో, శ్రుతి మిశ్రా -
సైనా నెహ్వాల్ కీలక నిర్ణయం..
న్యూఢిల్లీ: ఈ ఏడాది బర్మింగ్హమ్ కామన్వెల్త్ గేమ్స్‌లో... భారత స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ సైనా నెహ్వాల్ మహిళల సింగిల్స్ స్వర్ణ పతకాన్ని నిలబెట్టుకునే అవకాశం కనిపించడంలేదు. కామన్వెల్త్ గేమ్స్, ఆసియా క్రీడలు, థామస్ కప్ –ఉబెర్ కప్ టోర్నీలో పాల్గొనే భారత జట్లను ఎంపిక చేసేందుకు భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) నిర్వహించే సెలెక్షన్ ట్రయల్స్‌కు దూరంగా ఉండాలని 23వ ర్యాంకర్ సైనా నిర్ణయించుకుంది. ఈ మేరకు ఈనెల 15న నుంచి 20 వరకు జరిగే ట్రయల్స్‌కు దూరంగా ఉంటున్నానని సైనా ‘బాయ్’కు లేఖ రాసింది. ప్రపంచ బ్యాడ్మింటన్ ర్యాంకింగ్స్‌లో టాప్–15 లో ఉన్నవారికి నేరుగా చోటు లభిస్తుందని... 16 నుంచి 50 ర్యాంకింగ్స్‌లో ఉన్న వారు ట్రయల్స్‌కు హాజరుకావాలని ‘బాయ్’ తెలిపింది. చదవండి: IPL 2022: మొదట్లో కష్టాలు... తర్వాత చుక్కలు... సిక్సర్ల సునామీతో చెన్నై బోణీ -
Uber Cup 2021: వీళ్లు జపాన్ చేతిలో.. వాళ్లు చైనా చేతిలో చిత్తు
Uber Cup 2021: ఆర్హస్ (డెన్మార్క్): థామస్–ఉబెర్ కప్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ఫైనల్స్ భారత జట్లు గురువారం కంగు తిన్నాయి. అయితే థామస్ కప్‌లో ఇదివరకే క్వార్టర్స్ చేరిన పురుషుల జట్టు ఆఖరి లీగ్‌లో చైనా చేతిలో ఓడిపోయింది. కానీ ఉబెర్ కప్‌లో మహిళల జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించింది. క్వార్టర్ ఫైనల్లో భారత అమ్మాయిల జట్టుకు 0–3తో జపాన్ చేతిలో చుక్కెదురైంది. వరుసగా మూడు మ్యాచ్‌ల్లోనూ ఓటమితో ఫలితం రావడంతో మిగతా రెండు మ్యాచ్‌లు నిర్వహించలేదు. తొలి సింగిల్స్‌లో మాళవిక బన్సోద్ 12–21, 17–21తో ప్రపంచ ఐదో ర్యాంకర్ యామగుచి చేతిలో కంగుతింది. డబుల్స్‌లో తనీషా–రుతుపర్ణ పండా జోడీ 8–21, 10–21తో యూకి ఫుకుషిమా–మయు మత్సుమొటొ జంట చేతిలో ఓడింది. రెండో సింగిల్స్‌లో అదితి భట్ 16–21, 7–21తో సయాక టకహషి చేతిలో పరాజయం చవిచూసింది. చైనా చేతిలో చిత్తు... భారత పురుషుల జట్టు చివరి గ్రూప్ మ్యాచ్‌ను పరాజయంతో ముగించింది. పటిష్ట చైనా 4–1 తేడాతో భారత్‌పై ఘన విజయం సాధించింది. డబుల్స్‌లో మాత్రమే మన జోడీకి ఊరటనిచ్చే విజయం దక్కింది. సాత్విక్ సాయిరాజ్ – చిరాగ్ శెట్టి ద్వయం 21–14, 21–14తో చైనాకు చెందిన హి జి టింగ్ – జూ హావో డోంగ్ జంటను ఓడించింది. మరో డబుల్స్ జంట ఎంపీ అర్జున్ – ధ్రువ్ కపిల 24–26, 19–21తో ల్యూ చెంగ్ – వాంగ్ యి ల్యూ చేతిలో పోరాడి ఓడారు. మూడు సింగిల్స్ మ్యాచ్‌లలో భారత షట్లర్లు కిడాంబి శ్రీకాంత్, సమీర్ వర్మ, కిరణ్ జార్జ్‌లకు పరాజయం తప్పలేదు. షి యు ఖి 21–12, 21–16తో శ్రీకాంత్‌పై, లూ గ్వాంగ్ జు 14–21, 21–9, 24–22తో సమీర్ వర్మపై, లి షి ఫెంగ్ 21–15, 21–17తో కిరణ్ జార్జ్‌పై గెలుపొందారు. టోర్నీలో భారత్‌కు ఇదే తొలి పరాజయం. నెదర్లాండ్స్, తహిటిలను 5–0 తేడాలతో ఓడించిన మన టీమ్, నేడు జరిగే క్వార్టర్ ఫైనల్ సమరంలో ఆతిథ్య డెన్మార్క్‌తో తలపడుతుంది. చదవండి: MS Dhoni: హెలికాప్టర్ షాట్ ప్రాక్టీస్ చేస్తున్న ధోని.. వీడియో వైరల్ -
Uber Cup: ఐదేళ్ల తర్వాత... తొలిసారిగా..
అర్హుస్ (డెన్మార్క్): ప్రపంచ చాంపియన్ పీవీ సింధు లేకపోయినా... గాయం కారణంగా మరో స్టార్ ప్లేయర్ సైనా నెహ్వాల్ సేవలు అందుబాటులో లేకపోయినా... భారత మహిళల బ్యాడ్మింటన్ జట్టు అద్భుత ఆటతీరుతో ఉబెర్ కప్ టోర్నమెంట్లో నాకౌట్ దశకు అర్హత సాధించింది. గ్రూప్ ‘బి’లో భాగంగా మంగళవారం జరిగిన రెండో లీగ్ మ్యాచ్‌లో భారత్ 4–1తో స్కాట్లాండ్ జట్టును ఓడించింది. వరుసగా రెండో విజయం నమోదు చేసిన భారత్ క్వార్టర్ ఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. నాలుగు జట్లున్న గ్రూప్ ‘బి’లో భారత్, థాయ్‌లాండ్ జట్లు రెండేసి విజయాలు సాధించి సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచి నాకౌట్ దశకు అర్హత పొందాయి. నేడు థాయ్ లాండ్, భారత్ జట్ల మధ్య జరిగే మ్యాచ్ ద్వారా గ్రూప్ విజేత ఎవరో తేలుతుంది. 2014, 2016ల లో ఉబెర్‌కప్‌లో సెమీఫైనల్ చేరుకొని తమ అత్యు త్తమ ప్రదర్శన కనబరిచిన భారత జట్టు 2018లో లీగ్ దశలోనే వెనుదిరిగింది. ఐదేళ్ల విరామం తర్వాత భారత్ మళ్లీ నాకౌట్ దశకు చేరుకుంది. స్కాట్లాండ్తో జరిగిన పోటీలో తొలి మ్యాచ్‌లో ప్రపంచ 104వ ర్యాంకర్ మాళవిక బన్సోద్ 13–21, 9–21తో ప్రపంచ 26వ ర్యాంకర్ క్రిస్టీ గిల్మోర్ చేతిలో ఓడిపోయింది. రెండో మ్యాచ్‌లో అదితి భట్ 21–14, 21–8తో రాచెల్ సుగ్డెన్‌పై నెగ్గి స్కోరును 1–1తో సమం చేసింది. మూడో మ్యాచ్‌లో తనీషా–రితూపర్ణ ద్వయం 21–11, 21–8తో జూలీ–క్లారా టోరెన్స్ జోడీపై గెలిచి భారత్ ఆధిక్యాన్ని 2–1కి పెంచింది. నాలుగో మ్యాచ్‌లో తస్నీమ్ మీర్ 21–15, 21–6తో లౌరెన్ మిడిల్టన్ను ఓడించి 3–1తో భారత్ విజయాన్ని ఖరారు చేసింది. నామమాత్రమైన ఐదో మ్యాచ్‌లో త్రిసా జాలీ–గాయత్రి గోపీచంద్ జోడీ 21–8, 19–21, 21–10తో క్రిస్టీ గిల్మోర్–ఎలానోర్ జంటపై గెలిచింది. చదవండి: DC vs KKR, Qualifier 2: చెన్నైని ఢీ కొట్టేదెవరు? -
భారత జట్లకు సులువైన డ్రా
న్యూఢిల్లీ: బ్యాడ్మింటన్ టీమ్ ఈవెంట్ టోర్నీ థామస్, ఉబెర్ కప్‌లలో భారత జట్లకు సులువైన డ్రా ఎదురైంది. డెన్మార్క్‌లోని అర్హస్‌లో అక్టోబర్ 9 నుంచి 17 వరకు ఈ టోర్నీలు జరుగనున్నాయి. పురుషుల టోర్నీ థామస్ కప్‌లో భారత జట్టు గ్రూప్‘సి’లో డిఫెండింగ్ చైనా, నెదర్లాండ్స్, తాహిటిలతో తలపడనుంది. ఈ గ్రూప్‌లో చైనా మింగుడుపడని ప్రత్యర్థి అయినప్పటికీ మిగతా జట్టు నెదర్లాండ్, తాహిటిలపై గెలవడం ద్వారా నాకౌట్‌కు అర్హత సంపాదించవచ్చు. మహిళల టోర్నీ ఉబెర్ కప్‌లో భారత్ గ్రూప్ ‘బి’లో ఉంది. థాయ్‌లాండ్, స్పెయిన్, స్కాట్లాండ్ ప్రత్యర్థులు కాగా, ఇందులో ముందంజ వేయడం అంత కష్టమైన పనే కాదు. ఉబెర్ కప్‌లో భారత మహిళల జట్టు 2014, 2016లో సెమీస్ చేరింది. గతేడాది మేలో జరగాల్సిన ఈ టోర్నీ కరోనాతో వాయిదా పడింది. -
వచ్చే ఏడాదికి వాయిదా!
కౌలాలంపూర్: ప్రతిష్టాత్మక థామస్ కప్–ఉబెర్ కప్ ఫైనల్స్ టోర్నీ వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి. కరోనా కారణంగా అగ్రశ్రేణి జట్లు తప్పుకోవడంతో టోర్నీ కళ తప్పుతోందంటూ స్పాన్సర్లు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో డెన్మార్క్‌లోని అర్హస్ వేదికగా అక్టోబర్ 3 నుంచి 11 వరకు జరగాల్సిన ఈ టోర్నీని వచ్చే ఏడాది టోక్యో ఒలింపిక్స్ ముగిశాక టోక్యోలో నిర్వహిస్తారనే ఊహాగానాలు మొదలయ్యాయి. శనివారం వర్చువల్‌గా జరిగిన ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య సమావేశంలో ఎక్కువ మంది వాయిదాకే మొగ్గుచూపినట్లు తెలిసింది. -
‘ఇప్పుడు ఈ టోర్నీలు అవసరమా’
న్యూఢిల్లీ: కరోనా తీవ్రత ఇంకా తగ్గని ప్రస్తుత స్థితిలో ప్రతిష్టాత్మక ‘థామస్, ఉబెర్ కప్ ఫైనల్స్’ టోర్నీ నిర్వహణపై భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ ఆందోళన వ్యక్తం చేసింది. వైరస్ వ్యాప్తి కొనసాగుతోన్న ఈ సమయంలో టోర్నీ నిర్వహణ సురక్షితమేనా అని ఆమె ప్రశ్నించింది. ‘మహమ్మారికి భయపడి ఏడు దేశాలు టోర్నీ నుంచి నిష్క్రమించాయి. ఈ సమయంలో టోర్నీ నిర్వహించడం సబబేనా?’ అని సైనా ట్వీట్ చేసింది. డెన్మార్క్‌లో అక్టోబర్ 3నుంచి 11వరకు థామస్, ఉబెర్ కప్ జరుగనుంది. మార్చిలో ఆగిపోయిన అంతర్జాతీయ బ్యాడ్మింటన్ పోటీలు మళ్లీ ఈ టోర్నీతోనే ప్రారంభం కానున్నాయి. అంతర్జాతీయ బ్యాడ్మింటన్‌ను పునరుద్ధరించేందుకు ప్రయత్నిస్తోన్న ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) ఆటగాళ్లకు క్వారంటీన్ వెసులుబాటు కూడా కల్పించింది. టోర్నీ కోసం డెన్మార్క్ చేరుకునే ఆటగాళ్లు ‘నెగెటివ్’గా తేలితే తప్పనిసరిగా క్వారంటీన్లో ఉండాల్సిన అవసరం లేదని బీడబ్ల్యూఎఫ్ ప్రకటించింది. ఇప్పటికే ఈ టోర్నీలో పాల్గొనే భారత పురుషుల, మహిళల జట్లను ‘బాయ్’ ప్రకటించింది. -
ఇండోనేసియా, కొరియా అవుట్
జకార్తా: ప్రతిష్టాత్మక థామస్, ఉబెర్ కప్ ఫైనల్స్ బ్యాడ్మింటన్ టోర్నీ నుంచి వైదొలుగుతున్న జట్ల సంఖ్య రోజు రోజుకి పెరుగుతోంది. కరోనా భయంతో ఇప్పటికే థాయ్‌లాండ్, తైవాన్, ఆస్ట్రేలియా జట్లు ఈ టోర్నీ నుంచి వైదొలగగా... తాజాగా వాటి సరసన ఇండోనేసియా, దక్షిణ కొరియా జట్లు కూడా చేరాయి. టోర్నీలో పాల్గొంటే తమ ఆటగాళ్లు కరోనా బారిన పడే అవకాశం ఉందని... అందుకే తాము టోర్నీకి దూరంగా ఉంటున్నట్లు ఇండోనేసియా బ్యాడ్మింటన్ సంఘం (పీబీఎస్ఐ) తెలిపింది. డెన్మార్క్‌లోని అర్హస్ వేదికగా అక్టోబర్ 3 నుంచి 11 వరకు ఈ టోర్నీ జరగాల్సి ఉంది. ఇండోనేసియా థామస్ కప్ (పురుషుల విభాగంలో)ను రికార్డు స్థాయిలో 13 సార్లు గెలుచుకోగా... ఉబెర్ కప్ (మహిళల విభాగంలో)ను 3 సార్లు కైవసం చేసుకుంది. ఈ టోర్నీతో పాటు అక్టోబర్‌లోనే జరిగే డెన్మార్క్ ఓపెన్, డెన్మార్క్ మాస్టర్స్ టోర్నీల్లో కూడా తమ ప్లేయర్లు పాల్గొనడం లేదని ఇండోనేసియా పేర్కొంది. -
ఉబెర్ కప్ టోర్నీకి సింధు దూరం
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక థామస్ కప్ అండ్ ఉబెర్ కప్ ప్రధాన టీమ్ టోర్నమెంట్ నుంచి ప్రపంచ చాంపియన్, భారత స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు వైదొలిగింది. వ్యక్తిగత కారణాలరీత్యా ఈ టోర్నీలో సింధు ఆడబోవడం లేదని ఆమె తండ్రి పీవీ రమణ బుధవారం వెల్లడించారు. ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) ఇటీవల సవరించిన షెడ్యూల్ ప్రకారం కరోనా తర్వాత జరుగనున్న తొలి అంతర్జాతీయ టోర్నీ ఇదే కావడం విశేషం. పురుషుల జట్లు థామస్ కప్ కోసం... మహిళల జట్లు ఉబెర్ కప్ కోసం తలపడతాయి. అక్టోబర్ 3 నుంచి 11 వరకు డెన్మార్క్‌లో ఈ టోర్నీని నిర్వహిస్తారు. దీంతోపాటు ఆ తర్వాత జరుగనున్న డెన్మార్క్ ఓపెన్ (అక్టోబర్ 13–18), డెన్మార్క్ మాస్టర్స్ (అక్టోబర్ 20–25) సూపర్–750 సిరీస్‌లలోనూ సింధు బరిలోకి దిగేది అనుమానంగానే ఉంది. ‘వ్యక్తిగత కారణాలతో థామస్ కప్ అండ్ ఉబెర్ కప్ ప్రధాన టోర్నమెంట్‌కు సింధు అందుబాటులో ఉండటం లేదు. ముఖ్యమైన పని కారణంగా ఈవెంట్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఈ మేరకు భారత బ్యాడ్మింటన్ సంఘానికి (బాయ్) కూడా సమాచారమిచ్చాం. తర్వాత జరిగే రెండు టోర్నీల్లో కచ్చితంగా పాల్గొంటుందని చెప్పలేను. ఎంట్రీలైతే పంపించాం. ఆ సమయంలోగా తన పని పూర్తయితే ఆ టోర్నీల్లో పాల్గొంటుంది’ అని రమణ తెలిపారు. హైదరాబాద్‌లోని గోపీచంద్ అకాడమీలో ఏర్పాటైన ‘సాయ్’ జాతీయ శిబిరంలో గత నెల నుంచే పాల్గొంటున్న సింధు... కొరియా కోచ్ పార్క్ సంగ్ ఆధ్వర్యంలో ప్రాక్టీస్ చేస్తోంది. ఆమెతో పాటు ప్రపంచ చాంపియన్‌షిప్ కాంస్య పతక విజేత బి. సాయిప్రణీత్, మాజీ వరల్డ్ నంబర్‌వన్ కిడాంబి శ్రీకాంత్, డబుల్స్ ప్లేయర్ ఎన్. సిక్కి రెడ్డి శిబిరంలో పాల్గొంటున్నారు. -
థామస్–ఉబెర్ కప్ టోర్నీ వాయిదా
కౌలాలంపూర్: ప్రతిష్టాత్మక థామస్ కప్, ఉబెర్ కప్ ప్రపంచ పురుషుల, మహిళల వరల్డ్ టీమ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ టోర్నమెంట్ వాయిదా పడింది. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం మే 16 నుంచి 24 వరకు డెన్మార్క్ వేదికగా ఈ మెగా ఈవెంట్ జరగాల్సింది. అయితే కోవిడ్–19 వైరస్ యూరోప్‌తోపాటు ప్రపంచ వ్యాప్తంగా విజృంభిస్తుండటంతో ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) థామస్ కప్, ఉబెర్ కప్‌ను వాయి దా వేస్తున్నట్లు ప్రకటించింది. తాజా షెడ్యూల్ ప్రకారం డెన్మార్క్ వేదికగానే ఈ ప్రతిష్టాత్మక టోర్నమెంట్ ఆగస్టు 15 నుంచి 23 వరకు జరుగుతుంది. తొమ్మిది రోజులపాటు జరిగే ఈ టోర్నీలో పురుషుల విభాగంలో 16 జట్లు... మహిళల విభాగంలో 16 జట్లు టైటిల్ కోసం తలపడతాయి. ఈ టోర్నీలో రెండు విభాగాల్లోనూ భారత జట్లు అర్హత పొందాయి. -
37 ఏళ్ల నిరీక్షణ ముగిసింది
బ్యాంకాక్: ప్రతిష్టాత్మక ఉబెర్ కప్‌ను 37 ఏళ్ల సుదీర్ఘ విరామం అనంతరం జపాన్ సొంతం చేసుకుంది. శనివారం జరిగిన ఫైనల్లో 3–0తో థాయ్‌లాండ్‌ను మట్టికరిపించి సగర్వంగా కప్‌ను ముద్దాడింది. చివరిసారిగా జపాన్ 1981లో ఉబెర్ కప్ విజేతగా నిలిచింది. తొలి మ్యాచ్‌లో ప్రపంచ రెండో ర్యాంకర్ అకానె యామగుచి 21–15, 21–19తో నాలుగో ర్యాంకర్ ఇంతనోన్ రచనోక్‌పై గెలిచి ఆధిక్యం అందించగా... రెండో మ్యాచ్‌లో యూకీ ఫుకుషిమా–సయాకా హిరోట జంట 21–18, 21–12తో జొంగ్కొల్పాన్ కిటిథరాకుల్–పుట్టిట సుపాజిరాకుల్ జోడీపై గెలిచి ఆధిక్యాన్ని 2–0కు పెంచింది. మూడో మ్యాచ్‌లో ప్రపంచ చాంపియన్ నొజోమి ఒకుహారా 21–12, 21–9తో నిచావోన్ జిందాపోల్‌పై గెలిచి జపాన్‌కు మరపురాని విజయాన్ని అందించింది. అంతకుముందు థాయ్‌లాండ్ సెమీస్‌లో పటిష్ట చైనాపై విజయంతో తుదిపోరుకు చేరగా... కొరియాపై విజయంతో జపాన్ ఫైనల్‌కు అర్హత సాధించింది. క్రితంసారి కాంస్యం సాధించిన భారత బృందం ఈసారి లీగ్ దశలోనే వెనుదిరిగింది. -
కాంస్యంతో సరి
కున్ షాన్(చైనా): ఉబెర్ కప్ ప్రపంచ టీమ్ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్లో భారత జట్టు కాంస్యంతో సరిపెట్టుకుంది. శుక్రవారం జరిగిన సెమీ ఫైనల్ పోరులో భారత్ 0-3 తేడాతో చైనాపై ఓటమి చెందడంతో కాంస్యంతోనే నిష్ర్కమించాల్సి వచ్చింది. సెమీ ఫైనల్లో భాగంగా తొలి మ్యాచ్ లో భారత స్టార్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ 15-21, 21-12, 17-21 తేడాతో లీ జురయ్ చేతిలో పరాజయం చవిచూడగా, ఆ తరువాతి మ్యాచ్ లో మరో భారత క్రీడాకారిణి పివి సింధు 13-21, 21-23 తేడాతో షియాన్ వాంగ్ చేతిలో ఓటమి చెందింది. ఇక డబుల్స్ విభాగంలో భారత జోడి గుత్తా జ్వాలా-సిక్కి రెడ్డిలు 6-21, 6-21 తేడాతో కిన్ తియాన్-యున్లీ హో చేతిలో పరాజయం పాలైంది. దీంతో చైనా 3-0 తేడాతో సంపూర్ణం ఆధిక్యంలో నిలిచి ఫైనల్ కు చేరింది. ఇప్పటివరకూ 13 సార్లు ఉబెర్ కప్ టైటిల్స్ గెలిచిన చైనా మరో టైటిల్ సాధించడానికి అడుగుదూరంలో నిలిచింది. చైనా తన తుదిపోరులో జపాన్-దక్షిణకొరియా జట్ల మధ్య జరిగే సెమీ ఫైనల్ విజేతతో తలపడనుంది. -
మహిళలకు సులువు... పురుషులకు క్లిష్టం
ఉబెర్ కప్, థామస్ కప్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ‘డ్రా’ విడుదల న్యూఢిల్లీ: ప్రపంచ టీమ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌గా పేరున్న థామస్ కప్, ఉబెర్ కప్ ‘డ్రా’ విడుదలైంది. థామస్ కప్‌లో పాల్గొనే భారత పురుషుల జట్టుకు క్లిష్టమైన ‘డ్రా’ ఎదురుకాగా... ఉబెర్ కప్‌లో బరిలోకి దిగే భారత మహిళల జట్టుకు కాస్త సులువైన ‘డ్రా’ పడింది. రెండేళ్లకోసారి జరిగే ఈ మెగా ఈవెంట్లో భారత పురుషుల జట్టు ఇప్పటివరకు ఎన్నడూ సెమీఫైనల్ దశకు చేరుకోలేకపోయింది. మరోవైపు 2014లో న్యూఢిల్లీలో జరిగిన ఉబెర్ కప్‌లో భారత మహిళల జట్టు సంచలనం సృష్టించింది. తొలిసారి సెమీఫైనల్‌కు చేరుకొని కాంస్య పతకాన్ని సాధించి కొత్త చరిత్ర లిఖించింది. ఈసారి థామస్ కప్, ఉబెర్ కప్ పోటీలకు చైనాలోని కున్షాన్ పట్టణం మే 15 నుంచి 22 వరకు ఆతిథ్యం ఇవ్వనుంది. థామస్ కప్‌లో భాగంగా భారత పురుషుల జట్టుకు గ్రూప్ ‘బి’లో చోటు లభించింది. ఈ గ్రూప్‌లో భారత్‌తోపాటు ఇండోనేసియా, థాయ్‌లాండ్, హాంకాంగ్ జట్లున్నాయి. ఉబెర్ కప్‌లో భారత మహిళల జట్టుకు గ్రూప్ ‘డి’లో స్థానం దక్కింది. ఈ గ్రూప్‌లో భారత్‌తోపాటు జపాన్, ఆస్ట్రేలియా, జర్మనీ జట్లు ఉన్నాయి. ఆస్ట్రేలియా, జర్మనీలపై భారత్ కచ్చితమైన విజయావకాశాలు ఉండటంతో భారత్ క్వార్టర్ ఫైనల్ చేరుకోవచ్చు. -
సాధించాల్సింది చాలా ఉంది!
‘సాక్షి’కి ప్రత్యేకం ⇒ ఇది ఆరంభం మాత్రమే ⇒ వచ్చే ఏడాది ఇంకా బాగా ఆడతా ⇒ పీవీ సింధు మనోగతం సాక్షి, హైదరాబాద్: పూసర్ల వెంకట సింధు... 19 ఏళ్ల వయసులోనే బ్యాడ్మింటన్ ప్రపంచంలో ఇప్పటికే తనదైన ముద్ర వేసింది. వరుసగా రెండు సార్లు ప్రపంచ చాంపియన్‌షిప్‌లో కాంస్యాలు సాధించిన ఆమె ఆటతీరు ప్రతి ఏటా మరింత మెరుగుపడుతోంది. గత ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం మరింత నిలకడగా ఆమె ఫలితాలు సాధించింది. తాజాగా మకావు ఓపెన్ గ్రాండ్ ప్రి గోల్డ్ గెలిచిన సింధు, తన కెరీర్ గురించి పలు అంశాలను ‘సాక్షి’తో పంచుకుంది. విశేషాలు ఆమె మాటల్లోనే... మకావు విజయం: టైటిల్ నిలబెట్టుకోవాలనే లక్ష్యంతోనే బరిలోకి దిగాను. మకావులో మళ్లీ విజేతగా నిలవడం సంతోషకరం. గత ఏడాది ఇదే టోర్నీ గెలుచుకోవడానికి, దీనికి పోలిక లేదు. పోటీ, ప్రత్యర్థులు అంతా మారిపోయారు. నా శ్రమకు తగిన ఫలితం లభించింది. దీనికి ముందు కొన్ని పరాజయాలు ఎదురయ్యాయి. అయితే గెలుపుతో ఏడాది ముగించగలిగాను. 2014లో ప్రదర్శన: కచ్చితంగా గత సంవత్సరంతో పోలిస్తే నా ఆట మెరుగు కావడంతో పాటు, గుర్తుంచుకోదగ్గ విజయాలు దక్కాయి. కామన్వెల్త్, ఆసియా క్రీడలు, ఉబెర్ కప్‌లో పతకాలు...వరల్డ్ చాంపియన్‌షిప్‌లో కాంస్యంతో పాటు ఇప్పుడు మకావు గ్రాండ్ ప్రి గోల్డ్ గెలిచాను. కాబట్టి మొత్తంగా చూస్తే ఈ సంవత్సరం ప్రదర్శన పట్ల సంతృప్తిగా ఉంది. మకావుకు ముందు పరాజయాలు: నిజమే, మంచి విజయాలతో పాటు ఈ సారి నేను కొన్ని ఓటములు కూడా ఎదుర్కొన్నాను. అయితే ఆటలో ప్రతీ రోజు ఒకేలా ఉండదు. కొన్ని సార్లు మననుంచి అద్భుతమైన ప్రదర్శన వస్తుంది. మరికొన్ని సార్లు ఏమీ ఆడకుండా చేతులెత్తేస్తాం. కానీ ఒక టోర్నీ గెలవాలంటే ఆ రోజు అత్యుత్తమంగా ఆడాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఇంతకంటే బాగా ఆడితే బాగుండేది అనిపిస్తుంది. అయితే ఇది నిరంతర ప్రక్రియ. కష్టపడటం కొనసాగించాలి. ఫలితాలు వాటంతట అవే వస్తాయి. కోచింగ్‌పై ప్రత్యేక ప్రణాళికలు: ఈ రోజు నేను ఈ స్థితిలో ఉన్నానంటే కోచ్ గోపీచంద్ కారణం. ఆయనకు నా కృతజ్ఞతలు. నేనే కాదు చాలా మంది ఇతర ప్లేయర్లకు కూడా గోపీ సర్ వల్లే గుర్తింపు దక్కింది. చిన్న చిన్న లోపాలు ఏవైనా ఉంటే సరిదిద్దుకోవడం తప్ప ఇప్పటి వరకైతే కోచింగ్ విషయంలో ప్రత్యేక ప్రణాళికలు ఏమీ లేవు. ఆయన నాకు అన్ని విధాలా అండగా నిలుస్తున్నారు. దీనిని కొనసాగిస్తే చాలు. వచ్చే ఏడాది టోర్నీలు: సరిగ్గా ఏయే టోర్నీల్లో బరిలోకి దిగుతానో ఇంకా నిర్ణయించలేదు. దానిని కోచ్ నిర్ణయిస్తారు. నేను నా ప్రాక్టీస్‌పైనే దృష్టి పెట్టాను. అయితే ఒలింపిక్ క్వాలిఫయింగ్ ఏడాది కూడా కాబట్టి కచ్చితంగా కీలక సంవత్సరంగా చెప్పగలను. రియోలో ఆడాలని లక్ష్యంగా పెట్టుకున్నా. మరిన్ని సూపర్ సిరీస్ టోర్నీలలో గెలవాలని కోరుకుంటున్నా. కానీ దాని కోసం ఒత్తిడి పెంచుకోను. నా వయసు ఇంకా 19 ఏళ్లే. ఇంకా సాధించాల్సింది చాలా ఉంది. అయితే కొత్త ఏడాదిలో నా ఆట ఇంకా మెరుగవుతుందని నమ్ముతున్నా. కొత్త పాయింట్ల పద్ధతి: ప్రస్తుతం దీనిని గ్రాండ్ ప్రి ఈవెంట్లలోనే అమలు చేస్తున్నారు. మేం ఇంకా ఆ పద్ధతిలో ఆడలేదు. అయితే ప్రత్యేకంగా ఇదీ కారణం అని చెప్పలేకపోయినా... నా దృష్టిలో 21 పాయింట్ల పద్ధతే బాగుంటుంది. భవిష్యత్తులో స్కోరింగ్ పద్ధతిలో ఇంకా ఏమైనా మార్పులు వస్తాయేమో చూడాలి. -
సైనా జట్టుకు రూ.40 లక్షలు
కోచ్ గోపీచంద్‌కు రూ. 10 లక్షలు ఉబెర్ కప్‌లో కాంస్యానికి ‘బాయ్’ నజరానా న్యూఢిల్లీ: ఉబెర్ కప్‌లో ఉత్తమ ప్రదర్శన కనబరిచిన మహిళల బ్యాడ్మింటన్ జట్టుకు భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) రూ.40 లక్షల నజరానా ప్రకటించింది. ఈ టోర్నీలో తొలిసారిగా సైనా బృందం కాంస్యం సాధించిన విషయం తెలిసిందే. ‘గత వారం ఉబెర్ కప్‌లో మహిళల జట్టు మా అందరినీ గర్వపడేలా చేసింది. అంతర్జాతీయ స్థాయిలో రాణించేందుకు ప్లేయర్లకు ‘బాయ్’ సకల సౌకర్యాలు ఏర్పాటు చేస్తోంది. నగదు బహుమతి అనేది ఆటగాళ్లపై మాకున్న కమిట్మెంట్కు నిదర్శనం. అలాగే ఇలాంటి రివార్డులతో వర్ధమాన క్రీడాకారులకు కూడా ప్రోత్సాహకరంగా ఉంటుం ది’ అని ‘బాయ్’ అధ్యక్షుడు అఖిలేష్ దాస్ గుప్తా తెలిపారు. సైనా నెహ్వాల్, పీవీ సింధు, గుత్తా జ్వాల, అశ్విని పొన్నప్పలు తలా ఐదు లక్షలు అందుకోనుండగా మిగతా మొత్తం ఇతర క్రీడాకారిణులకు, సిబ్బందికి పంపిణీ చేయనున్నారు. అలాగే కేంద్రం నుంచి ఇటీవల పద్మభూషణ్ అవార్డును స్వీకరించిన కోచ్ పుల్లెల గోపీచంద్‌కు రూ.10 లక్షలు ఇవ్వనున్నట్టు గుప్తా ప్రకటించారు. -
బ్యాడ్మింటన్‌లో మెరిసిన జయపురం అమ్మాయి
ఉబెర్ కప్ ప్రపంచ బ్యాడ్మింటన్ పోటీల్లో సిక్కిరెడ్డికి కాంస్యం న్యూస్‌లైన్, వరంగల్ స్పోర్ట్స్, ఉబెర్ కప్ ప్రపంచ బ్యాడ్మింటన్ టీమ్ చాంపియన్‌షిప్‌లో జిల్లా క్రీడాకారిణి సిక్కిరెడ్డి మెరిసింది. నర్సింహులపేట మండలం జయపురానికి చెందిన ఆమె న్యూఢిల్లీలో జరిగిన పోటీల్లో టీం విభాగంలో కాంస్య పతకం సాధించింది. శుక్రవారం టీం విభాగంలో జపాన్‌తో జరిగిన సెమీఫైనల్లో భారత జట్టు ఓటమి చెంది కాంస్యంతో సరిపెట్టుకుంది. తొలిసారిగా భారత మహిళా జట్టు ఉబెర్ కప్‌లో పతకం సాధించి చరిత్ర సృష్టిం చింది. సిక్కిరెడ్డి హైదరాబాద్‌లోని గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీలో శిక్షణ పొందుతోంది. -
చైనాదే ఉబెర్ కప్
రన్నరప్ జపాన్ న్యూఢిల్లీ: అంచనాలకు అనుగుణంగా రాణించిన చైనా జట్టు 13వసారి మహిళల ప్రపంచ టీమ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ ‘ఉబెర్ కప్’ను సొంతం చేసుకుంది. శనివారం జరిగిన ఫైనల్లో చైనా 3-1 తేడాతో జపాన్ను ఓడించింది. తొలి మ్యాచ్‌లో ప్రపంచ నంబర్‌వన్ జురుయ్ లీ 21-15, 21-5తో మినత్సు మితానిపై గెలిచింది. రెండో మ్యాచ్‌లో మిసాకి-అయాకా (జపాన్) జోడి 21-18, 21-9తో యిక్సిన్ బావో-జిన్హువా తాంగ్ జంటను ఓడించి స్కోరును సమం చేసింది. మూడో మ్యాచ్‌లో ఆల్ ఇంగ్లండ్ చాంపియన్ షిజియాన్ వాంగ్ 21-16, 21-12తో సయాకా తకహాషిపై నెగ్గి చైనాకు 2-1 ఆధిక్యాన్ని అందించింది. నాలుగో మ్యాచ్‌లో యున్లీ జావో-జియోలి వాంగ్ ద్వయం 21-13, 21-6తో మియుకి-రీకా జంటను ఓడించి చైనా విజయాన్ని ఖాయం చేసింది. ఫలితం తేలడంతో నామమాత్రమైన ఐదో మ్యాచ్‌ను నిర్వహించలేదు. సెమీఫైనల్స్‌లో ఓడిన భారత్, దక్షిణ కొరియా జట్లకు కాంస్య పతకాలు లభించాయి. ఆదివారం పురుషుల విభాగంలో ‘థామస్ కప్’ కోసం మలేసియా, జపాన్ జట్లు పోటీపడతాయి. -
డబుల్స్‌లో కోచ్‌లకు స్వేచ్ఛ లేదు!
కొత్త జోడీలను ప్రయత్నించలేకపోతున్నాం పుల్లెల గోపీచంద్ వ్యాఖ్య న్యూఢిల్లీ : బ్యాడ్మింటన్ డబుల్స్ విభాగంలో భారత్ మంచి ఫలితాలు సాధించాలంటే భవిష్యత్తులో చాలా శ్రమించాల్సి ఉందని జాతీయ జట్టు చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ అభిప్రాయ పడ్డారు. అందుకోసం కట్టుదిట్టమైన వ్యవస్థను రూపొందించాలని ఆయన సూచించారు. శుక్రవారం ఉబెర్ కప్ సెమీ ఫైనల్లో జపాన్ చేతిలో ఓటమి అనంతరం డబుల్స్‌కు సంబంధించి గోపీచంద్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. డబుల్స్‌లో ఆటగాళ్లను సానబెట్టేందుకు కావాల్సిన స్వేచ్ఛ కోచ్‌లకు లభించడం లేదని ఆయన అన్నారు. ‘డబుల్స్‌లో మనం చాలా దూరంలో ఉన్నాం. ఒక జంటను తీర్చి దిద్దేందుకు చాలా సమయం పడుతుంది. ఒక ప్లేయర్‌ను డబుల్స్ కోసం ఎంపిక చేస్తే ఆమె డబుల్స్ మాత్రమే ఆడాలి. ఈ రకంగా చూస్తే వేర్వేరు భాగస్వామ్యాలను ప్రయత్నించేందుకు విదేశీ కోచ్‌లకు లభిస్తున్న స్వేచ్ఛ, అధికారం భారత్‌లో లేదు’ అని ఘాటుగా వ్యాఖ్యానించారు. అయితే ఉబెర్ కప్‌లో భారత క్రీడాకారిణుల ప్రదర్శన పట్ల గోపీచంద్ సంతృప్తి వ్యక్తం చేశారు. తొలి సారి ఇలాంటి టోర్నీ ఆడే యువ షట్లర్లపై ఎంతో ఒత్తిడి ఉందని...ఇండోనేసియా, థాయిలాండ్‌లపై గెలవడం మంచి ప్రదర్శనగా ఆయన పేర్కొన్నారు. ‘సైనా, సింధు, జ్వాల, అశ్విని చాలా బాగా ఆడారు. జపాన్‌తో డబుల్స్ మ్యాచ్ సమయంలో పరిస్థితి సమంగా ఉంది. ఆ మ్యాచ్ ఓడాక మనం ముందుకు వెళ్లలేమనిపించింది’ అని కోచ్ విశ్లేషించారు. రెండో డబుల్స్‌లో సైనా-సింధు జోడిగా ఆడాల్సి వచ్చినా, అది సరైన వ్యూహం కాదని...ఇది వారి సింగిల్స్ ఆటపై ప్రభావం చూపించే ప్రమాదం ఉందని గోపీచంద్ అభిప్రాయం వ్యక్తం చేశారు. జపాన్ ఓపెన్‌కు సైనా, సింధు దూరం... ఉబెర్ కప్‌లో తీవ్రంగా శ్రమించిన భారత స్టార్ షట్లర్లు సైనా నెహ్వాల్, పీవీ సింధులు తర్వాతి టోర్నీ ఆడకుండా విశ్రాంతి ఇస్తున్నట్లు గోపీచంద్ ప్రకటించారు. దీంతో వచ్చే నెల 10 నుంచి 15 వరకు టోక్యోలో జరిగే జపాన్ ఓపెన్‌లో వీరిద్దరు పాల్గొనడం లేదు. ఆ తర్వాత జూన్ 17 నుంచి 22 వరకు జరిగే ఇండోనేసియా ఓపెన్ సూపర్ సిరీస్ ప్రీమియర్, 24-29 మధ్య జరిగే ఆస్ట్రేలియన్ ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నీలలో సైనా, సింధు ఆడతారు. -
మహిళల ‘మరో చరిత్ర’