కోచ్ గోపీచంద్‌కు రూ. 10 లక్షలు
ఉబెర్ కప్‌లో కాంస్యానికి ‘బాయ్’ నజరానా
న్యూఢిల్లీ: ఉబెర్ కప్‌లో ఉత్తమ ప్రదర్శన కనబరిచిన మహిళల బ్యాడ్మింటన్ జట్టుకు భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) రూ.40 లక్షల నజరానా ప్రకటించింది. ఈ టోర్నీలో తొలిసారిగా సైనా బృందం కాంస్యం సాధించిన విషయం తెలిసిందే. ‘గత వారం ఉబెర్ కప్‌లో మహిళల జట్టు మా అందరినీ గర్వపడేలా చేసింది. అంతర్జాతీయ స్థాయిలో రాణించేందుకు ప్లేయర్లకు ‘బాయ్’ సకల సౌకర్యాలు ఏర్పాటు చేస్తోంది. నగదు బహుమతి అనేది ఆటగాళ్లపై మాకున్న కమిట్‌మెంట్‌కు నిదర్శనం.
అలాగే ఇలాంటి రివార్డులతో వర్ధమాన క్రీడాకారులకు కూడా ప్రోత్సాహకరంగా ఉంటుం ది’ అని ‘బాయ్’ అధ్యక్షుడు అఖిలేష్ దాస్ గుప్తా తెలిపారు. సైనా నెహ్వాల్, పీవీ సింధు, గుత్తా జ్వాల, అశ్విని పొన్నప్పలు తలా ఐదు లక్షలు అందుకోనుండగా మిగతా మొత్తం ఇతర క్రీడాకారిణులకు, సిబ్బందికి పంపిణీ చేయనున్నారు. అలాగే కేంద్రం నుంచి ఇటీవల పద్మభూషణ్ అవార్డును స్వీకరించిన కోచ్ పుల్లెల గోపీచంద్‌కు రూ.10 లక్షలు ఇవ్వనున్నట్టు గుప్తా ప్రకటించారు.
సైనా జట్టుకు రూ.40 లక్షలు
Published Wed, May 28 2014 12:42 AM | Last Updated on Sat, Sep 2 2017 7:56 AM
Advertisement
Advertisement