Badminton team
-
Asian Games 2023: ఆసియా క్రీడలకు భారత బ్యాడ్మింటన్ జట్ల ప్రకటన
సాక్షి, హైదరాబాద్: ఈ ఏడాది సెప్టెంబర్–అక్టోబర్లలో చైనాలో జరిగే ఆసియా క్రీడల్లో పాల్గొనే భారత బ్యాడ్మింటన్ జట్లను ప్రకటించారు. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో టాప్–20లో ఉన్న వారిని నేరుగా ఎంపిక చేయగా... మిగతా బెర్త్‌లను ఆదివారం ముగిసిన సెలెక్షన్ ట్రయల్స్ టోర్నీ ద్వారా ఖరారు చేశారు. భారత పురుషుల జట్టు: ప్రణయ్, శ్రీకాంత్, లక్ష్య సేన్, మిథున్ మంజునాథ్, సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి, ధ్రువ్ కపిల–ఎంఆర్ అర్జున్, రోహన్ కపూర్, సాయిప్రతీక్. మహిళల జట్టు: పీవీ సింధు, అష్మిత, అనుపమ, మాళవిక, గాయత్రి గోపీచంద్–ట్రెసా జాలీ, అశ్విని పొన్నప్ప, తనీషా క్రాస్టో, సిక్కి రెడ్డి. -
బ్యాడ్మింటన్‌లో డబుల్ ధమాకా
పొఖార (నేపాల్): దక్షిణాసియా క్రీడల్లో తొలి రోజు భారత్‌కు ఐదు స్వర్ణాలు, ఎనిమిది రజతాలు, మూడు కాంస్య పతకాలు లభించాయి. బ్యాడ్మింటన్‌లో భారత పురుషుల, మహిళల జట్లు టీమ్ విభాగంలో విజేతగా నిలిచి పసిడి పతకాలను సొంతం చేసుకున్నాయి. పురుషుల టీమ్ ఫైనల్లో భారత్ 3–1తో శ్రీలంకపై... మహిళల టీమ్ ఫైనల్లో భారత్ 3–0తో శ్రీలంకపై నెగ్గాయి. భారత్ తరఫున రెండు సింగిల్స్‌లో శ్రీకాంత్, సిరిల్ వర్మ గెలిచారు. డబుల్స్ మ్యాచ్‌లో అరుణ్ జార్జి–సాన్యమ్ శుక్లా జంట ఓడిపోగా... మరో డబుల్స్ మ్యాచ్‌లో గారగ కృష్ణ ప్రసాద్–ధ్రువ్ కపిల జంట నెగ్గడంతో భారత్‌కు స్వర్ణం ఖాయమైంది. భారత మహిళల జట్టు తరఫున రెండు సింగిల్స్‌లలో తెలుగమ్మాయిలు చుక్కా సాయి ఉత్తేజిత రావు, పుల్లెల గాయత్రి గెలుపొందగా... డబుల్స్ మ్యాచ్‌లో సిక్కి రెడ్డి–మేఘన జంట నెగ్గి పసిడి పతకాన్ని అందించారు. మరోవైపు పురుషుల ట్రయాథ్లాన్ వ్యక్తిగత విభాగంలో ఆదర్శ సినిమోల్ స్వర్ణం సాధించాడు. తైక్వాండోలో పురుషుల అండర్–29 పోమ్సె పెయిర్ ఈవెంట్లో, అండర్–23 పోమ్సె టీమ్ ఈవెంట్లో భారత్‌కు స్వర్ణాలు లభించాయి. -
ఇది గర్వించాల్సిన సమయం
సాక్షి, హైదరాబాద్: కామన్వెల్త్ క్రీడల్లో మునుపెన్నడూ లేని విధంగా గోల్డ్‌కోస్ట్‌లో అద్భుత ప్రదర్శన కనబరిచిన భారత బ్యాడ్మింటన్ జట్టుపై జాతీయ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ ప్రశంసల జల్లు కురిపించారు. పటిష్టమైన మలేసియా జట్టును ఓడించి మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో విజేతగా నిలవడమే మన సత్తాను చాటుతోందని అన్నారు. విజయాల కోసం కేవలం ఒకరిద్దరిపై మాత్రమే ఆధారపడే స్థాయి నుంచి, ప్రతి ఒక్కరూ పతకాలు గెలిచే స్థాయికి భారత బ్యాడ్మింటన్ ఎదిగిందని హర్షం వ్యక్తం చేశారు. కామన్వెల్త్ క్రీడల బ్యాడ్మింటన్ ఈవెంట్లో భారత్ 6 పతకాలు సాధించింది. మహిళల సింగిల్స్‌లో సైనా (స్వర్ణం), సింధు (రజతం)... పురుషుల సింగిల్స్‌లో శ్రీకాంత్ (రజతం), డబుల్స్‌లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి జంట (రజతం), మహిళల డబుల్స్‌లో సిక్కి రెడ్డి–అశ్విని పొన్నప్ప (కాంస్యం) ద్వయంతో పాటు టీమ్ ఈవెంట్లోనూ మనోళ్లు స్వర్ణాన్ని కైవసం చేసుకున్నారు. ఆస్ట్రేలియా నుంచి భారత్‌కు తిరిగి వచ్చిన అనంతరం మంగళవారం గచ్చిబౌలిలోని గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో భారత బృందం పాల్గొంది. ఈ సందర్భంగా కోచ్ గోపీచంద్ మాట్లాడుతూ... ‘బ్యాడ్మింటన్‌లో టీమ్ ఈవెంట్ స్వర్ణాన్ని అందుకుంటామని నేనెప్పుడూ ఊహించలేదు. ఇది అందరి సమష్టి విజయం. గతంలో పతకం కోసం ఒక్కరో, ఇద్దరో ఆటగాళ్లపై మాత్రమే ఆధారపడేవాళ్లం. కానీ ఇప్పుడు ప్రతీ ఒక్కరూ తమ అత్యుత్తమ ఆటతో భారత్‌కు పతకాన్ని అందించారు. బ్యాడ్మింటన్‌లో మన దశ మారింది. ఒక మెగా ఈవెంట్ ఫైనల్లో ఇద్దరు భారతీయులే తలపడేంతగా మన ఆట మెరుగైంది. ఇది గర్వించాల్సిన అంశం. నేను బ్యాడ్మింటన్ ఆడిన కాలంతో పోలిస్తే ఇప్పుడున్న పోటీ, ఆటగాళ్లపై అంచనాలు, బాధ్యతలు చాలా ఎక్కువ. అయినప్పటికీ వీరంతా నన్ను ఎప్పుడో దాటేశారు. భవిష్యత్‌లో ఇంకా చాలా సాధిస్తారు. గోల్డ్‌కోస్ట్ ఘనతంతా డబుల్స్ క్రీడాకారిణి అశ్విని పొన్నప్పకే దక్కుతుంది. ఒకే రోజు వరుసగా ప్రాముఖ్యత కలిగిన 4 మ్యాచ్‌లాడి ఆమె మన పతకాల సంఖ్య పెరగడంలో కీలక పాత్ర పోషించింది. సాత్విక్, చిరాగ్, సిక్కి రెడ్డి కూడా అద్భుతంగా ఆడారు’ అని గోపీచంద్ విశ్లేషించారు. -
సెమీస్‌లో బ్యాడ్మింటన్ జట్టు
కామన్వెల్త్ గేమ్స్ మిక్స్డ్ టీమ్ బ్యాడ్మింటన్ క్వార్టర్ ఫైనల్లో భారత్ 3–0తో మారిషస్‌పై నెగ్గింది. సింగిల్స్‌లో శ్రీకాంత్ 21–12, 21–14తో జార్జెస్ పాల్‌పై గెలుపొందగా, పురుషుల డబుల్స్‌లో సాత్విక్ –చిరాగ్ షెట్టి 21–12, 21–3తో లుబా–క్రిస్టోఫర్ పాల్‌పై, మహిళల డబుల్స్‌లో సిక్కి రెడ్డి–అశ్విని పొన్నప్ప 21–8, 21–7తో ఎలీసా–నిక్కీ చాన్ లామ్పై నెగ్గారు. హుసాముద్దీన్ క్వార్టర్స్‌కు... వెటరన్ బాక్సర్లు సరితా దేవి (60 కేజీలు), మనోజ్ కుమార్ (69 కేజీలు)లతో పాటు తెలంగాణ బాక్సర్ హుసాముద్దీన్ (56కేజీలు) పతకానికి అడుగు దూ రంలో ఉన్నారు. ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో హుసాముద్దీన్ 5–0తో బోయె వరవర (వనుతు)పై, మనోజ్ 5–0తో ఎంబుడ్వికె (టాంజానియా)పై, సరిత 5–0తో కింబర్లీ గిటెన్స్ (బార్బడోస్)పై గెలిచారు. పాక్‌తో భారత్ హాకీ మ్యాచ్ డ్రా పురుషుల హాకీలో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో జరిగిన తొలి లీగ్ మ్యాచ్‌ను భారత్ 2–2తో ‘డ్రా’ చేసుకుంది. ఆరంభంలోనే రెండు గోల్స్ చేసి మ్యాచ్‌లో నిలిచిన భారత్ మధ్యలో పట్టు సడలించింది. చివరకు ఆలస్యంగా స్పందించినప్పటికీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఫలితం... గెలవాల్సిన మ్యాచ్‌లో డ్రాతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. భారత్ తరఫున దిల్‌ప్రీత్ సింగ్ (13వ ని.), హర్మన్‌ప్రీత్ సింగ్ (19వ ని.) చెరో గోల్ చేయగా, పాక్ జట్టులో ఇర్ఫాన్ (38వ ని.), ముబాషిర్ అలీ (59వ ని.) గోల్ చేశారు. రెండు జట్లూ సెమీస్‌కు... టేబుల్ టెన్నిస్ టీమ్ ఈవెంట్లో భారత పురుషుల, మహిళల జట్లు సెమీస్‌కు చేరాయి. క్వార్టర్ ఫైనల్స్‌లో భారత పురుషుల జట్టు 3–0తో మలేసియాపై... మహిళల జట్టు 3–0తో మలేసియాపైనే గెలిచాయి. అరుణకు నిరాశ ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్‌లో పురుషుల ఆల్ అరౌండ్ ఫైనల్స్‌లో పోటీపడిన యోగేశ్వర్ 14వ స్థానంలో... మహిళల ఆల్ అరౌండ్ ఫైనల్స్‌లో ప్రణతి దాస్ 16వ స్థానంలో, తెలంగాణ అమ్మాయి బుద్దా అరుణా రెడ్డి 14వ స్థానంలో నిలిచారు. వాస్తవానికి అరుణ ఆల్ అరౌండ్ ఫైనల్‌కు అర్హత పొందకపోయినా... ఫైనల్స్‌కు చేరిన మరో క్రీడాకారిణి చివరి నిమిషంలో తప్పుకోవడంతో ఆమెకు అవకాశం లభించింది. జోష్నా ఔట్ మహిళల స్క్వాష్ సింగిల్స్‌లో భారత స్టార్ జోష్నా చినప్ప పోరాటం ముగిసింది. క్వార్టర్ ఫైనల్లో జోష్నా 5–11, 6–11, 9–11తో జోలీ కింగ్ (న్యూజిలాండ్) చేతిలో ఓడిపోయింది. -
ఓయూ బ్యాడ్మింటన్ జట్ల ప్రకటన
సాక్షి, హైదరాబాద్: సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే ఉస్మానియా యూనివర్సిటీ పురుషుల, మహిళల జట్లను శుక్రవారం ప్రకటించారు. మదురై కామరాజ్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో అక్టోబర్ 3 నుంచి 8 వరకు శివకాశీలో ఈ టోర్నమెంట్ జరుగుతుంది. ఈ జట్లకు కోచ్‌గా వెంకటేశ్వరావు, మేనేజర్‌గా ప్రతాప్ వ్యవహరిస్తారు. పురుషుల జట్టు: సతీశ్ నాయుడు, గోపాలకృష్ణ రెడ్డి, కార్తీక్, సంతోష్, నిఖిల్ రెడ్డి, హర్ష్ వర్మ, అంకుర్. మహిళల జట్టు: కె. వైష్ణవి, వి. ప్రమద, కె. ప్రణవి, కె. ప్రణాళి, కె. మమిత. -
సైనా జట్టుకు రూ.40 లక్షలు
కోచ్ గోపీచంద్‌కు రూ. 10 లక్షలు ఉబెర్ కప్‌లో కాంస్యానికి ‘బాయ్’ నజరానా న్యూఢిల్లీ: ఉబెర్ కప్‌లో ఉత్తమ ప్రదర్శన కనబరిచిన మహిళల బ్యాడ్మింటన్ జట్టుకు భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) రూ.40 లక్షల నజరానా ప్రకటించింది. ఈ టోర్నీలో తొలిసారిగా సైనా బృందం కాంస్యం సాధించిన విషయం తెలిసిందే. ‘గత వారం ఉబెర్ కప్‌లో మహిళల జట్టు మా అందరినీ గర్వపడేలా చేసింది. అంతర్జాతీయ స్థాయిలో రాణించేందుకు ప్లేయర్లకు ‘బాయ్’ సకల సౌకర్యాలు ఏర్పాటు చేస్తోంది. నగదు బహుమతి అనేది ఆటగాళ్లపై మాకున్న కమిట్మెంట్కు నిదర్శనం. అలాగే ఇలాంటి రివార్డులతో వర్ధమాన క్రీడాకారులకు కూడా ప్రోత్సాహకరంగా ఉంటుం ది’ అని ‘బాయ్’ అధ్యక్షుడు అఖిలేష్ దాస్ గుప్తా తెలిపారు. సైనా నెహ్వాల్, పీవీ సింధు, గుత్తా జ్వాల, అశ్విని పొన్నప్పలు తలా ఐదు లక్షలు అందుకోనుండగా మిగతా మొత్తం ఇతర క్రీడాకారిణులకు, సిబ్బందికి పంపిణీ చేయనున్నారు. అలాగే కేంద్రం నుంచి ఇటీవల పద్మభూషణ్ అవార్డును స్వీకరించిన కోచ్ పుల్లెల గోపీచంద్‌కు రూ.10 లక్షలు ఇవ్వనున్నట్టు గుప్తా ప్రకటించారు. -
భారత్ ‘హ్యాట్రిక్’
చివరి మ్యాచ్‌లో 3-2తో థాయ్‌లాండ్‌పై గెలుపు గ్రూప్ ‘వై’లో అగ్రస్థానం ప్రపంచ చాంపియన్‌పై నెగ్గిన సైనా సింధు, జ్వాల-అశ్విని జోడి విజయం న్యూఢిల్లీ: సొంతగడ్డపై జోరు కొనసాగిస్తూ భారత మహిళల బ్యాడ్మింటన్ జట్టు వరుసగా మూడో విజయాన్ని నమోదు చేసుకుంది. ఉబెర్ కప్ ప్రపంచ టీమ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో గ్రూప్ ‘వై’లో అగ్రస్థానాన్ని దక్కించుకుంది. మంగళవారం జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో టీమిండియా 3-2తో థాయ్‌లాండ్‌ను ఓడించింది. గ్రూప్ ‘వై’లో టాప్‌గా నిలిచిన భారత్‌కు క్వార్టర్ ఫైనల్లో గ్రూప్ ‘డబ్ల్యూ’లో రెండో స్థానంలో నిలిచే అవకాశమున్న ఇంగ్లండ్ లేదా చైనీస్ తైపీ ఎదురవుతుంది. తొలి సింగిల్స్‌లో ప్రపంచ 8వ ర్యాంకర్ సైనా నెహ్వాల్ 22-20, 21-14తో ప్రస్తుత ప్రపంచ చాంపియన్, నాలుగో ర్యాంకర్ ఇంతనోన్ రత్చనోక్పై సంచలన విజయం సాధించింది. భారత్‌కు పి.వి.సింధు మరో విజయం అందించింది. ప్రపంచ 11వ ర్యాంకర్ సింధు 21-19, 21-14తో 9వ ర్యాంకర్ పోర్న్టిప్పై నెగ్గింది. ఆ తర్వాత డబుల్స్ మ్యాచ్‌లో గుత్తా జ్వాల-అశ్విని పొనప్ప ద్వయం 21-16, 21-13తో అరూన్కెసర్న్-సావిత్రి అమిత్రపాయ్ జోడిపై నెగ్గి భారత్‌కు 3-0తో స్పష్టమైన ఆధిక్యాన్ని అందించడంతోపాటు విజయాన్ని ఖాయం చేసింది. నాలుగో మ్యాచ్‌లో పి.సి.తులసీ 15-21, 10-21తో ప్రపంచ 17వ ర్యాంకర్ బుసానన్ ఒంగ్‌బుమ్‌రుంగ్‌పాన్ చేతిలో ఓడిపోయింది. ఐదో మ్యాచ్‌గా జరిగిన డబుల్స్‌లో సైనా-సింధు జోడి 12-21, 21-18, 15-21తో కున్చాలా-సప్సిరీ జంట చేతిలో ఓటమి పాలైంది.