ఉబెర్ కప్, థామస్ కప్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ‘డ్రా’ విడుదల
న్యూఢిల్లీ: ప్రపంచ టీమ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌గా పేరున్న థామస్ కప్, ఉబెర్ కప్ ‘డ్రా’ విడుదలైంది. థామస్ కప్‌లో పాల్గొనే భారత పురుషుల జట్టుకు క్లిష్టమైన ‘డ్రా’ ఎదురుకాగా... ఉబెర్ కప్‌లో బరిలోకి దిగే భారత మహిళల జట్టుకు కాస్త సులువైన ‘డ్రా’ పడింది. రెండేళ్లకోసారి జరిగే ఈ మెగా ఈవెంట్‌లో భారత పురుషుల జట్టు ఇప్పటివరకు ఎన్నడూ సెమీఫైనల్ దశకు చేరుకోలేకపోయింది. మరోవైపు 2014లో న్యూఢిల్లీలో జరిగిన ఉబెర్ కప్‌లో భారత మహిళల జట్టు సంచలనం సృష్టించింది. తొలిసారి సెమీఫైనల్‌కు చేరుకొని కాంస్య పతకాన్ని సాధించి కొత్త చరిత్ర లిఖించింది.
ఈసారి థామస్ కప్, ఉబెర్ కప్ పోటీలకు చైనాలోని కున్‌షాన్ పట్టణం మే 15 నుంచి 22 వరకు ఆతిథ్యం ఇవ్వనుంది. థామస్ కప్‌లో భాగంగా భారత పురుషుల జట్టుకు గ్రూప్ ‘బి’లో చోటు లభించింది. ఈ గ్రూప్‌లో భారత్‌తోపాటు ఇండోనేసియా, థాయ్‌లాండ్, హాంకాంగ్ జట్లున్నాయి. ఉబెర్ కప్‌లో భారత మహిళల జట్టుకు గ్రూప్ ‘డి’లో స్థానం దక్కింది. ఈ గ్రూప్‌లో భారత్‌తోపాటు జపాన్, ఆస్ట్రేలియా, జర్మనీ జట్లు ఉన్నాయి. ఆస్ట్రేలియా, జర్మనీలపై భారత్ కచ్చితమైన విజయావకాశాలు ఉండటంతో భారత్ క్వార్టర్ ఫైనల్ చేరుకోవచ్చు.
మహిళలకు సులువు... పురుషులకు క్లిష్టం
Published Tue, Mar 22 2016 12:43 AM | Last Updated on Sun, Sep 3 2017 8:16 PM
Advertisement
Advertisement