థామస్‌–ఉబెర్‌ కప్‌ టోర్నీ వాయిదా  | Thomas Cup And Uber Cup Are Postponed Due To Coronavirus | Sakshi
Sakshi News home page

థామస్‌–ఉబెర్‌ కప్‌ టోర్నీ వాయిదా 

Published Sun, Mar 22 2020 12:45 AM | Last Updated on Sun, Mar 22 2020 12:45 AM

Thomas Cup And Uber Cup Are Postponed Due To Coronavirus - Sakshi

కౌలాలంపూర్‌: ప్రతిష్టాత్మక థామస్‌ కప్, ఉబెర్‌ కప్‌ ప్రపంచ పురుషుల, మహిళల వరల్డ్‌ టీమ్‌ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌ టోర్నమెంట్‌ వాయిదా పడింది. ముందుగా ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం మే 16 నుంచి 24 వరకు డెన్మార్క్‌ వేదికగా ఈ మెగా ఈవెంట్‌ జరగాల్సింది. అయితే కోవిడ్‌–19 వైరస్‌ యూరోప్‌తోపాటు ప్రపంచ వ్యాప్తంగా విజృంభిస్తుండటంతో ప్రపంచ బ్యాడ్మింటన్‌ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్‌) థామస్‌ కప్, ఉబెర్‌ కప్‌ను వాయి దా వేస్తున్నట్లు ప్రకటించింది. తాజా షెడ్యూల్‌ ప్రకారం డెన్మార్క్‌ వేదికగానే ఈ ప్రతిష్టాత్మక టోర్నమెంట్‌ ఆగస్టు 15 నుంచి 23 వరకు జరుగుతుంది. తొమ్మిది రోజులపాటు జరిగే ఈ టోర్నీలో పురుషుల విభాగంలో 16 జట్లు... మహిళల విభాగంలో 16 జట్లు టైటిల్‌ కోసం తలపడతాయి. ఈ టోర్నీలో రెండు విభాగాల్లోనూ భారత జట్లు అర్హత పొందాయి.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement