
న్యూఢిల్లీ: ఈ ఏడాది బర్మింగ్‌హమ్ కామన్వెల్త్ గేమ్స్‌లో... భారత స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ సైనా నెహ్వాల్ మహిళల సింగిల్స్ స్వర్ణ పతకాన్ని నిలబెట్టుకునే అవకాశం కనిపించడంలేదు. కామన్వెల్త్ గేమ్స్, ఆసియా క్రీడలు, థామస్ కప్ –ఉబెర్ కప్ టోర్నీలో పాల్గొనే భారత జట్లను ఎంపిక చేసేందుకు భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) నిర్వహించే సెలెక్షన్ ట్రయల్స్‌కు దూరంగా ఉండాలని 23వ ర్యాంకర్ సైనా నిర్ణయించుకుంది.
ఈ మేరకు ఈనెల 15న నుంచి 20 వరకు జరిగే ట్రయల్స్‌కు దూరంగా ఉంటున్నానని సైనా ‘బాయ్’కు లేఖ రాసింది. ప్రపంచ బ్యాడ్మింటన్ ర్యాంకింగ్స్‌లో టాప్–15 లో ఉన్నవారికి నేరుగా చోటు లభిస్తుందని... 16 నుంచి 50 ర్యాంకింగ్స్‌లో ఉన్న వారు ట్రయల్స్‌కు హాజరుకావాలని ‘బాయ్’ తెలిపింది.
చదవండి: IPL 2022: మొదట్లో కష్టాలు... తర్వాత చుక్కలు... సిక్సర్ల సునామీతో చెన్నై బోణీ
Comments
Please login to add a commentAdd a comment