బ్యాడ్మింటన్‌లో మెరిసిన జయపురం అమ్మాయి
ఉబెర్ కప్ ప్రపంచ బ్యాడ్మింటన్ పోటీల్లో సిక్కిరెడ్డికి కాంస్యం
న్యూస్‌లైన్, వరంగల్ స్పోర్ట్స్, ఉబెర్ కప్ ప్రపంచ బ్యాడ్మింటన్ టీమ్ చాంపియన్‌షిప్‌లో జిల్లా క్రీడాకారిణి సిక్కిరెడ్డి మెరిసింది. నర్సింహులపేట మండలం జయపురానికి చెందిన ఆమె న్యూఢిల్లీలో జరిగిన పోటీల్లో టీం విభాగంలో కాంస్య పతకం సాధించింది. శుక్రవారం టీం విభాగంలో జపాన్‌తో జరిగిన సెమీఫైనల్‌లో భారత జట్టు ఓటమి చెంది కాంస్యంతో సరిపెట్టుకుంది. తొలిసారిగా భారత మహిళా జట్టు ఉబెర్ కప్‌లో పతకం సాధించి చరిత్ర సృష్టిం చింది. సిక్కిరెడ్డి హైదరాబాద్‌లోని గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీలో శిక్షణ పొందుతోంది.