నవంబర్‌లో చంద్రబాబు జపాన్ పర్యటన | Chandrababu Naidu to Japan tour on November | Sakshi
Sakshi News home page

నవంబర్‌లో చంద్రబాబు జపాన్ పర్యటన

Published Thu, Oct 23 2014 4:28 AM | Last Updated on Wed, Aug 29 2018 3:33 PM

నవంబర్‌లో చంద్రబాబు జపాన్ పర్యటన - Sakshi

నవంబర్‌లో చంద్రబాబు జపాన్ పర్యటన

సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నవంబర్ 24వ తేదీ నుంచి వారం రోజుల పాటు జపాన్ పర్యటనకు వెళ్లనున్నారు. ఈ పర్యటనలో ఆయనవెంట పారిశ్రామిక ప్రతినిధులు కూడా ఉంటారని అధికార వర్గాలు తెలిపాయి. జపాన్ దేశ ప్రతినిధి బృందం బుధవారం చంద్రబాబుతో సచివాలయంలో భేటీ అయింది.
 
 ఈ సందర్భంగా తన జపాన్ పర్యటన గురించి చంద్రబాబు వెల్లడించారు. విజయవాడ, గుంటూరు ప్రాంతాల్లో నిర్మించనున్న స్మార్ట్ క్యాపిటల్ సిటీకి తమ సాంకేతిక సహకారం ఉంటుందని జపాన్ బృందం తెలిపింది. విశాఖపట్నంలో నెలకోల్పే 4 వేల మెగావాట్ల విద్యుత్ ప్లాంటు, శ్రీకాకుళంలో నాలుగు వేల మెగావాట్లు, అనంతపురంలో రెండు వేల మెగావాట్ల సోలార్‌పవర్ ప్లాంట్ల ఏర్పాటుకు సహకరిస్తామని పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement