Japan Tour
-
మంగోలియా, జపాన్లలో నేటి నుంచి రాజ్‌నాథ్ పర్యటన
న్యూఢిల్లీ: మంగోలియా, జపాన్లలో ఐదు రోజుల పర్యటనకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సోమవారం బయలుదేరి వెళ్లారు. మారుతున్న ప్రపంచ రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఈ రెండు దేశాలతో వ్యూహాత్మక, రక్షణ సంబంధాల బలోపేతమే లక్ష్యంగా పర్యటన సాగనుందని విదేశాంగ శాఖ వర్గాలు తెలిపాయి. 5 నుంచి 7 వరకు మంగోలియాలో ఆయన పర్యటన ఉంటుంది. భారత రక్షణ మంత్రి ఒకరు మంగోలియాలో పర్యటించడం ఇదే ప్రథమం. అనంతరం 8, 9 తేదీల్లో జపాన్ పర్యటన సందర్భంగా జరిగే 2+2 విదేశాంగ, రక్షణ మంత్రుల సమావేశాల్లో రాజ్‌నాథ్‌తోపాటు జై శంకర్ కూడా పాల్గొంటారు. -
భారత్ ‘భేష్’.. చైనా వల్ల కాలేదు
Joe Biden praised Prime Minister Narendra Modi.. క్వాడ్ సదస్సులో భాగంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ, అగ్ర రాజ్యం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ జపాన్ పర్యటనలో ఉన్నారు. ఈ సదస్సులో భాగంగా మంగళవారం మోదీతో జో బైడెన్ భేటీ అయ్యారు. ఈ క్రమంలో భారత్‌ను బైడెన్ ప్రశంసించారు. అదే సమయంలో చైనా విఫలమైందంటూ వ్యాఖ్యలు చేశారు. వివరాల ప్రకారం.. క్వాడ్ సమ్మిట్‌లో భాగంగా టోక్యోలో మంగళవారం క్లోజ్డ్ సెషన్లో ప్రధాని మోదీ, బైడెన్ భేటీ అయ్యారు. ఈ సందర్బంగా కోవిడ్ మహ్మారిని ఎదుర్కొవడంతో భారత్ సక్సెస్ అయిందని.. ప్రధాని నరేంద్ర మోదీని బైడెన్ ప్రశంసించారు. ఇదే సమయంలో కరోనాను ఎదుర్కోవడంలో చైనా పూర్తిగా విఫలమైందని వ్యాఖ్యానించారు. అలాగే, ప్రజలకు ప్రజాస్వామ దేశాలే అభివృద్ధిని అందించగలవని అన్నారు. చైనా, రష్యా వంటి దేశాలు నిరంకుశ దేశాలు అభివృద్ధిని అడ్డుకోవడమే కాకుండా ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక, జపాన్ పర్యటన సందర్భంగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇండో పసిఫిక్ ట్రేడ్ డీల్‌ను ప్రవేశపెట్టారు. ఇందులో అమెరికా, ఇతర క్వాడ్ దేశాలు(అమెరికా, ఆస్ట్రేలియా, ఇండియా, జపాన్) సహా 12 దేశాలు భాగమయ్యాయి. ఇండో-పసిఫిక్ ప్రాంతం ఆర్థికంగా బలోపేతం అవడంలో ఈ ఒప్పందం కీలక పాత్ర పోషిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: పుతిన్‌తో తప్ప మరే అధికారితో సమావేశం అవ్వం: జెలెన్స్కీ -
భారత్‌లో మరింత ఇన్వెస్ట్ చేయండి
టోక్యో: అపార వ్యాపార అవకాశాలు ఉన్న భారత్‌లో మరింతగా ఇన్వెస్ట్ చేయాలంటూ జపాన్ కార్పొరేట్లను ప్రధాని నరేంద్ర మోదీ ఆహ్వానించారు. భారతదేశ అభివృద్ధి ప్రస్థానంలో జపాన్‌ది చాలా కీలకపాత్ర అని ఆయన పేర్కొన్నారు. దీన్ని పురస్కరించుకుని ’జపాన్ వారోత్సవాల’ను నిర్వహించడంపై ప్రధాని ప్రతిపాదన చేశారు. జపాన్ పర్యటనలో భాగంగా వ్యాపార దిగ్గజాలతో నిర్వహించిన రౌండ్‌టేబుల్ సమావేశంలో ప్రధాని పాల్గొన్నారు. 34 సంస్థల సీఈవోలు, టాప్ ఎగ్జిక్యూటివ్‌లు దీనికి హాజరయ్యారు. ఆటోమొబైల్స్, ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్లు, ఉక్కు, టెక్నాలజీ, ట్రేడింగ్, బ్యాంకింగ్, ఫైనాన్స్ తదితర రంగాల కంపెనీల ప్రతినిధులు వీరిలో ఉన్నట్లు ప్రభుత్వం ఒక అధికారిక ప్రకటనలో తెలిపింది. జపాన్ కంపెనీలు భారత్‌లో మరింతగా ఇన్వెస్ట్ చేయాలని మోదీ ఈ సందర్భంగా ఆహ్వానించినట్లు వివరించింది. ‘టాప్ వ్యాపార సంస్థల సీఈవోలతో భేటీ అయ్యాను. భారత్‌లో పుష్కలంగా ఉన్న పెట్టుబడి అవకాశాల గురించి వివరించాను‘ అని ప్రధాని ఒక ట్వీట్లో పేర్కొన్నారు. హోండా, సుజుకీ, టయోటా వంటి ఆటోమొబైల్ సంస్థలు, సుమిటోమో కెమికల్, ఫ్యుజిత్సు, నిప్పన్ స్టీల్ కార్పొరేషన్, మిత్సుబిషి కార్పొరేషన్ తదితర సంస్థల ప్రతినిధులు ఈ భేటీలో పాల్గొన్నారు. చాలామటుకు కంపెనీలకు భారత్‌లో పెట్టుబడులు, కార్యకలాపాలు ఉన్నాయి. రికార్డు స్థాయిలో ఎఫ్‌డీఐలు.. భారత్, జపాన్ సహజమైన భాగస్వాములని సమావేశం సందర్భంగా ప్రధాని చెప్పారు. భారత్–జపాన్ సంబంధాలు బలోపేతం అయ్యేందుకు వ్యాపార వర్గాలు బ్రాండ్ అంబాసిడర్ల పాత్ర పోషిస్తున్నారని ఆయన ప్రశంసించారు. గత ఆర్థిక సంవత్సరంలో (2021–22) అంతర్జాతీయంగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) మందగించినా, భారత్‌లోకి రికార్డు స్థాయిలో 84 బిలియన్ డాలర్ల ఇన్వెస్ట్మెంట్లు వచ్చాయని ప్రధాని నరేంద్ర మోదీ ఈ సందర్భంగా చెప్పారు. భారత ఆర్థిక వృద్ధి సత్తాపై ఇన్వెస్టర్లకు ఉన్న ధీమాకు ఇది నిదర్శనమని ఆయన తెలిపారు. ఈ ఏడాది మార్చిలో జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా భారత పర్యటన సందర్భంగా ద్వైపాక్షిక పెట్టుబడులను వచ్చే అయిదేళ్లలో 5 లక్షల కోట్ల ఎన్ల స్థాయికి పెంచుకోవాలని ఇరు దేశాలు నిర్దేశించుకున్నాయని ప్రధాని చెప్పారు. ఇటీవలి కాలంలో ఇండియా–జపాన్ ఇండస్ట్రియల్ కాంపిటీటివ్నెస్ పార్ట్నర్షిప్ (ఐజేఐసీపీ), క్లీన్ ఎనర్జీ పార్ట్నర్షిప్ మొదలైన ఒప్పందాలు కుదిరాయని పేర్కొన్నారు. -
జపాన్‌లో ప్రధాని మోదీ: పెట్టుబడుల ఆకర్షణే ధ్యేయంగా..
Narendra Modi Japan Tour: భారతదేశాన్ని ఆధునికీరించే సంస్కరణలను ప్రధాని మోదీ తీసుకువస్తున్నారు. పిఎం మోదీ స్వయం-విశ్వాస దీక్షకు జపాన్ కంపెనీలు గట్టిగా మద్దతు ఇస్తున్నాయి అని సుజుకీ మోటర్ కార్పొరేషన్ చైర్మన్, ప్రెసిడెంట్ తోషిహిరో సుజుకీ పేర్కొన్నారు. క్వాడ్ సదస్సు, ద్వైపాక్షిక చర్చల్లో భాగంగా.. భారత ప్రధాని నరేంద్ర మోదీ జపాన్‌లో బిజీబిజీగా గడుపుతున్నారు. భారత కాలమానం ప్రకారం.. సోమవారం ఉదయం నుంచి వరుసభేటీలు అవుతున్నారు. ముందుగా నోబుహిరో ఎండోతో భేటీ అయ్యారు ప్రధాని మోదీ. జపానీస్ మల్టీనేషనల్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎలక్ట్రిక్ దిగ్గజం ఎన్ఈసీ కార్పొరేషన్‌కు హెడ్ ఆయన. భారతదేశ సంస్కరణల పథాన్ని హైలైట్ చేస్తూ.. డిజిటల్ లెర్నింగ్, ఫిన్‌టెక్, ఇన్ఫ్రా మరియు లాజిస్టిక్స్ నెట్‌వర్క్‌ల వంటి రంగాలలో అవకాశాల గురించి ఆయన మాట్లాడారు అంటూ ప్రధాని కార్యాలయం ట్విటర్ హ్యాండిల్ వివరాలను పోస్ట్ చేసింది. అదే విధంగా భారత్‌లో టెలికమ్యూనికేషన్ సెక్టార్లో ఎన్ఈసీ అందిస్తున్న సేవలకు.. ప్రత్యేకించి చెన్నై-అండమాన్ నికొబార్‌లో, కొచ్చి-లక్షద్వీప్ ప్రాజెక్టులపై ప్రధాని మోదీ ప్రశంసలు గుప్పించారు. "PM Narendra Modi met Chairman of NEC Corporation Dr. Nobuhiro Endo in Tokyo. Appreciated NEC’s role in India’s telecommunication sector and discussed opportunities in new and emerging technologies in India," tweets MEA Spokesperson Arindam Bagchi. pic.twitter.com/9D3DmMeQvC — ANI (@ANI) May 23, 2022 యునిక్లో చైర్మన్.. సీఈవో తడాషి యానైతోనూ మోదీ భేటీ అయ్యారు. టెక్స్టైల్స్ తయారీ కేంద్రంగా, ప్రత్యేకించి టెక్స్టైల్ తయారీలో సాంకేతికతలను ఉపయోగించుకునే దిశగా భారతదేశ ప్రయాణంలో మెరుగైన భాగస్వామ్యాన్ని ప్రధాని మోదీ ఆహ్వానించినట్లు తెలుస్తోంది. దానికి యునిక్లో సానుకూలంగా స్పందించింది. PM Modi interacts with Tadashi Yanai, Chairman, President and CEO of UNIQLO in Tokyo "Mr. Yanai appreciated the entrepreneurial zeal of the people of India. PM Modi asked Mr. Yanai to take part in the PM-Mitra scheme aimed at further strengthening the textiles sector," says PMO. pic.twitter.com/Xelu0qVN47 — ANI (@ANI) May 23, 2022 భారతదేశంలో ఉత్పత్తి & రిటైల్ పరిశ్రమలో ఎలా పెట్టుబడి పెట్టాలనే దాని గురించి మేము చర్చించాం. ప్లాంట్ నుండి డిజైన్ నుండి ఫాబ్రిక్ వరకు ఎండ్-టు-ఎండ్ ఉత్పత్తులపై దృష్టి సారించగలం. భారతదేశంలో భారత ఐటీ ప్రతిభ అద్భుతమైనది. కాబట్టి, సానుకూలంగానే మేం ప్రధాని మోదీకి సమ్మతిని తెలిపాం అని యునిక్లో చైర్మన్.. సీఈవో తడాషి యానై వెల్లడించారు. Tokyo | PM Modi is bringing reforms which are changing India into a modern landscape. The self-reliance initiative of PM Modi is being strongly supported by Japanese companies: Toshihiro Suzuki, Chairman & President, Suzuki Motor Corp pic.twitter.com/OK190xenHh — ANI (@ANI) May 23, 2022 #WATCH Prime Minister Narendra Modi meets Osamu Suzuki, Adviser, Suzuki Motor Corporation in Tokyo pic.twitter.com/kJsgkA0Eun — ANI (@ANI) May 23, 2022 -
‘బీ కేర్‌ఫుల్’.. చైనాకు జో బైడెన్ స్ట్రాంగ్ వార్నింగ్
Joe Biden Serious Warning to China on Taiwan: ఉక్రెయిన్‌లో రష్యా దాడులు కొనసాగుతున్న వేళ డ్రాగన్ కంట్రీ చైనాకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఒకవేళ తైవాన్ను చైనా ఆక్రమించుకోవాలని చూస్తే ‘ప్రమాదంతో ఆటలాడుకున్నట్టే’ అంటూ బైడెన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అయితే, ఆసియా దేశాల పర్యటనలో భాగంగా అగ్ర రాజ్యం అధ్యక్షుడు బైడెన్ సోమవారం జపాన్ రాజధాని టోక్యో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఓ సమావేశంలో బైడెన్ మాట్లాడుతూ.. వన్ చైనా పాలసీని తాము అంగీకరిస్తామని, ఆ ఒప్పందంపై సంతకం కూడా చేశామని చెప్పారు. ఈ క్రమంలోనే చైనా.. తైవాన్ను బలవంతంగా ఆక్రమించాలని చూస్తే.. తాము(అమెరికా) సైనికపరంగా చైనాను అడ్డుకుంటుదని హెచ్చరించారు. తైవాన్ను ఆక్రమించే న్యాయపరమైన హక్కు చైనాకు లేదని బైడెన్ తెలిపారు. ఇక, తైవాన్ విషయంలో చైనా ఏదైనా కవ్వింపు చర్యలకు పాల్పడితే ఉక్రెయిన్‌లో ఏం జరిగిందో తెలుసుకోవాలని బైడెన్ హితవు పలికారు. కఠిన చర్యలు తీసుకుంటామని స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. ఈ క్రమంలోనే ఉక్రెయిన్‌లో జరుగుతున్న అకృత్యాలకు పుతిన్ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. రష్యా సుదీర్ఘకాలం ఆ మూల్యాన్ని చెల్లించుకుంటుందని పేర్కొన్నారు. అయితే, ఉక్రెయిన్‌లో రష్యా దాడులు చేస్తున్న సమయంలో చైనాకు పుతిన్‌కు ప్రత్యక్షంగా సపోర్ట్ చేసిన విషయం తెలిసిందే. రష్యాకు ఆర్థికంగా, ఆయుధాలను కూడా అందించినట్టు అంతర్జాతీయ మీడియాలో వార్తలు కూడా చక్కర్లు కొట్టాయి. VIDEO: President Joe Biden says United States would defend Taiwan militarily if Beijing invaded the self-ruled island. "That's the commitment we made... We agreed with the One China policy, we signed on to it... but the idea that it can be taken by force is just not appropriate" pic.twitter.com/gWkmj2y7d9 — AFP News Agency (@AFP) May 23, 2022 ఇది కూడా చదవండి: భారత్ సహా 16 దేశాలపై ట్రావెల్ బ్యాన్, ఎందుకంటే.. -
మోదీని సర్ప్రైజ్ చేసిన బాలుడు.. ఫుల్ హ్యాపీ అయిన ప్రధాని
భారత ప్రధాని నరేంద్ర మోదీ.. జపాన్ చేరుకున్నారు. రేపు(మంగళవారం) జరగబోయే క్వాడ్ సదస్సుల్లో మోదీ పాల్గొననున్నారు. ఇదిలా ఉండగా సోమవారం ఉదయం టోక్యో చేరుకున్న మోదీకి ప్రవాస భారతీయులు ఘనస్వాగతం పలికారు. ‘మోదీ మోదీ’, ‘ వందేమాతరం’, ‘భారత్ మాతా కీ జై’ అని నినాదాలు చేస్తూ.. భారత జాతీయ జెండాలు ఊపుతూ ప్రధాని మోదీకి వెల్కమ్ చెప్పారు. ఈ నేపథ్యంలో మోదీ వారితో కాసేపు ముచ్చటించారు. ఈ సందర్బంగా ఓ జపాన్ బాలుడు మోదీతో హిందీలో మాట్లాడటంతో ఆయన ఆశ్చర్యపోయారు. "జపాన్‌కు స్వాగతం.. దయచేసి మీ ఆటోగ్రాఫ్ నాకు ఇవ్వండి", అని రిత్సుకీ కొబయాషి.. ప్రధాని మోదీని హిందీలో అడిగాడు. ఈ క్రమంలో మోదీ.. "వాహ్.. మీరు హిందీ ఎక్కడ నుండి నేర్చుకున్నారు?.. మీకు బాగా తెలుసా" అని ప్రశంసించారు. అనంతరం అక్కడున్న జపాన్ విద్యార్థులకు మోదీ ఆటోగ్రాఫ్ ఇచ్చారు. అనంతరం రిత్సుకీ మీడియాతో మాట్లాడుతూ..‘‘నేను హిందీ ఎక్కువగా మాట్లాడలేను.. కానీ, నాకు అర్థం అవుతుంది. ప్రధాని మోదీ నా సందేశాన్ని చదివారు. నాకు ఆటోగ్రాఫ్ కూడా ఇచ్చారు. దీనికి నేను సంతోషంగా ఉన్నాను’’ అని తెలిపాడు. ఇదిలా ఉండగా.. రిత్సుకీ కొబయాషి ఐదో స్టాండర్ట్ చదువుతున్నట్టు చెప్పాడు. #WATCH | "Waah! Where did you learn Hindi from?... You know it pretty well?," PM Modi to Japanese kids who were awaiting his autograph with Indian kids on his arrival at a hotel in Tokyo, Japan pic.twitter.com/xbNRlSUjik — ANI (@ANI) May 22, 2022 ఇది కూడా చదవండి: భారత్ సహా 16 దేశాలపై ట్రావెల్ బ్యాన్, ఎందుకంటే.. -
బైడెన్‌కు ఉత్తరకొరియా క్షిపణి భయం
వాషింగ్టన్: ఆసియాలో మొట్టమొదటి పర్యటనకు బయలుదేరిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు ఉత్తరకొరియా భయం పట్టుకుంది. అణు పాటవాన్ని చాటిచెప్పేందుకు ఉత్తరకొరియా ఇటీవల కాలంలో పలుమార్లు క్షిపణి పరీక్షలు జరిపిన విషయం తెలిసిందే. ఆసియా పర్యటన సమయంలోనూ ఆ దేశం బాలిస్టిక్ క్షిపణి ప్రయోగం లేదా అణు పరీక్ష జరిపేందుకు కచ్చితంగా అవకాశాలున్నట్లు తమకు సమాచారం ఉందని జాతీయభద్రతా సలహాదారు జేక్ సలివాన్ తెలిపారు. బైడెన్ దక్షిణ కొరియా, జపాన్లలో ఆరు రోజులు పర్యటిస్తారు. ఈ సందర్భంగా రెండు దేశాలతో మరింత చేరువ కావడంపై దృష్టిని కేంద్రీకరిస్తారు. దీంతోపాటు, ఉక్రెయిన్‌పై యుద్ధానికి దిగిన రష్యాకు మద్దతిస్తున్న చైనాకు గట్టి సందేశం పంపించడమే అధ్యక్షుడు బైడెన్ పర్యటన ప్రధానోద్దేశమని సలివాన్ తెలిపారు. మొదటగా ఆయన దక్షిణకొరియా అధ్యక్షుడిగా ఇటీవల ఎన్నికైన యూన్ సుక్ యోల్‌తోపాటు, జపాన్ ప్రధాని ఫుమియో కిషిడాతో భేటీ అవుతారు. వాణిజ్యం, ప్రపంచ సరఫరా వ్యవస్థ నిరాటంకంగా కొనసాగేలా చూడటం, ఉత్తరకొరియా అణు కార్యక్రమం, ఆ దేశంలో కరోనా విజృంభణ వంటి విషయాలపై చర్చలు జరుపుతారు. ఈ పర్యటన సమయంలోనే ఇండో–పసిఫిక్ వ్యూహాత్మక కూటమి క్వాడ్ దేశాల నేతలతో భేటీ అవుతారు. ఈ కూటమిలో అమెరికాతోపాటు ఆస్ట్రేలియా, భారత్, జపాన్ సభ్య దేశాలుగా ఉన్న విషయం తెలిసిందే. క్వాడ్ భేటీకి ప్రధాని మోదీ న్యూఢిల్లీ: ఈ నెల 24వ తేదీన జపాన్ రాజధాని టోక్యోలో జరగనున్న క్వాడ్ దేశాల మూడో భేటీకి ప్రధాని మోదీ హాజరుకానున్నారని విదేశాంగ శాఖ తెలిపింది. ఇండో–పసిఫిక్ ప్రాంతంలో పరిణామాలు, పరస్పర ఆసక్తి కలిగిన అంశాలపై ఆయన ఆయా దేశాల నేతలతో చర్చలు జరుపుతారు. ఇది కూడా చదవండి: మంకీపాక్స్ విజృంభణ.. శారీరకంగా కలవడం వల్లే కేసుల వ్యాప్తి! ఎందుకంటే.. -
ఐఓసీ చీఫ్ జపాన్ పర్యటన రద్దు
టోక్యో: కరోనా కేసులు పెరుగుతుండటంతో జపాన్ పర్యటనను అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) అధ్యక్షుడు థామస్ బాచ్ రద్దు చేసుకున్నారు. ఈ విషయాన్ని ఒలింపిక్ ఆర్గనైజింగ్ కమిటీ తమ ప్రకటనలో పేర్కొంది. వచ్చే సోమవారం టార్చ్ రిలే హిరోషిమా నగరానికి చేరుకోనుండగా... బాచ్ అందులో పాల్గొనాల్సి ఉంది. ప్రస్తుతానికైతే బాచ్ పర్యటన రద్దయిందని... త్వరలోనే ఆయన కొత్త పర్యటన తేదీలను ప్రకటిస్తామని ఒలింపిక్ ఆర్గనైజింగ్ కమిటీ తెలిపింది. ఒలింపిక్స్‌కు మరో 10 వారాల సమయం మాత్రమే ఉండగా... నిర్వాహకులు అనేక సమస్యలతో సతమతమవుతున్నారు. కరోనా వేళ ఒలింపిక్స్ ఏంటంటూ... వాటిని మరోసారి వాయిదా లేదా రద్దు చేయాలంటూ స్థానిక మీడియా నిర్వహించిన సర్వేల్లో తేలింది. ఈ సర్వేల్లో ఏకంగా 60 నుంచి 80 శాతం మంది ప్రజలు ఒలింపిక్స్ నిర్వహణపై తమ విముఖతను తెలియజేశారు. మరోవైపు ఇటీవలే టోక్యో ఒలింపిక్స్‌ను నిర్వహించకూడదంటూ ఆన్లైన్లో దాఖలు చేసిన పిటిషన్‌కు మద్దతుగా 3 లక్షల మందికి పైగా జపాన్‌వాసులు సంతకాలు చేశారు. ఇన్ని సమస్యల మధ్య కూడా అనుకున్న తేదీల్లోనే ఒలింపిక్స్‌ను నిర్వహిస్తామని ఐఓసీ పేర్కొనడం విశేషం. -
చిరు బ్రేక్
కొంతకాలంగా ‘సైరా: నరసింహారెడ్డి’ సినిమాతో బిజీ బిజీగా ఉన్న చిరంజీవి కాస్త విరామం కోసం తన సతీమణి సురేఖతో కలిసి జపాన్ రాజధాని టోక్యో వెళ్లారు. ఈ సందర్భంలోనిదే ఇక్కడున్న ఫొటో. ఈ ఫొటోను చిరంజీవి పెద్ద కుమార్తె సుష్మిత సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇక సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రామ్‌చరణ్ నిర్మాతగా స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవితం ఆధారంగా రూపొందుతున్న ‘సైరా: నరసింహారెడ్డి’ చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. దసరాకు విడుదల చేయాలనకుంటున్నారట. ఈ సినిమా తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా నటిస్తారు. -
త్వరలో జపాన్‌తో 2+2 చర్చలు
టోక్యో: భారత్, జపాన్ల విదేశాంగ, రక్షణ మంత్రులతో కూడిన 2+2 చర్చలు త్వరలో జరగనున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ జపాన్ పర్యటనలో ఈ మేరకు ఇరు దేశాలూ నిర్ణయం తీసుకున్నాయి. భారత్–జపాన్ 13వ ద్వైపాక్షిక సమావేశాల్లో భాగంగా సోమవారం టోక్యోలో జపాన్ ప్రధాని షింజో అబేతో మోదీ భేటీ అయ్యారు. ఆర్థిక, రక్షణ, ప్రాంతీయ భద్రత, ఉగ్రవాదం, జపాన్ ఆర్థిక సాయంతో నిర్మిస్తున్న ముంబై–అహ్మదాబాద్ హైస్పీడ్ రైలు ప్రాజెక్టు సహా పలు అంశాలపై వారు విస్తృత చర్చలు జరిపారు. పాకిస్తాన్ గురించి పరోక్షంగా ప్రస్తావిస్తూ.. ఇతర దేశాలపై దాడులు చేసేందుకు ఉగ్రవాదులు తమతమ దేశాలను వాడుకోకుండా అన్ని దేశాలూ చూసుకోవాలని విజ్ఞప్తి చేశారు. వివిధ రంగాలకు సంబంధించి ఇరు దేశాల మధ్య ఆరు ఒప్పందాలు కుదిరాయి. భేటీ అనంతరం మోదీ ‘షింజో అబేతో ఫలప్రదమైన, విస్తృత చర్చలు జరిపాను. మరింత మెరుగైన ఆర్థిక బంధాలు, రక్షణ–భద్రత రంగంలో బలమైన సహకారంపై ప్రధానంగా మేం మట్లాడాం’ అని ట్విట్టర్లో తెలిపారు. భారత్–జపాన్ల బంధం ప్రపంచంలోనే అత్యంత బలమైనదని అబే పేర్కొన్నారు. అణు సరఫరాదారుల బృందం (ఎన్ఎస్జీ)లో భారత సభ్యత్వానికి జపాన్ మద్దతు తెలిపింది. శాంతంగా పరిష్కరించుకోవాలి.. చర్చల అనంతరం ఇండియా–జపాన్ దార్శనిక ప్రకటనను ఇరువురు ప్రధానులు సంయుక్తంగా విడుదల చేశారు. ప్రపంచ దేశాలు సమస్యలను శాంతితో సామరస్యంగా పరిష్కరించుకోవాలే తప్ప బెదిరింపులకు, బలప్రయోగాలకు దిగకూడదని కోరారు. ఇరుదేశాల పరస్పర అభివృద్ధి కోసం అవరోధాల్లేని వాణిజ్యం, పౌరుల వలసలు, సాంకేతికతను పంచుకోవడం తదితరాలపై భారత్, జపాన్‌లు కలిసి పనిచేయాలని తాము నిర్ణయించామన్నారు. ‘అణ్వాయుధాలను పూర్తిగా నిర్మూలించేందుకు, అణ్వస్త్ర వ్యాప్తి, అణు ఉగ్రవాదం వంటి సవాళ్లను ఎదుర్కొనేందుకు అంతర్జాతీయ సహకారాన్ని మరింత పెంపొందించుకునేందుకు ఇద్దరం కట్టుబడి ఉన్నాం’ అని తెలిపారు. కూల్‌డ్రింక్ కన్నా జీబీ డేటా తక్కువ జపాన్‌లోని భారతీయులతోనూ మోదీ సమావేశమై అక్కడ ప్రసంగించారు. జపాన్‌లో స్థిరపడిన భారతీయులు స్వదేశంలో పెట్టుబడులు పెట్టి అభివృద్ధికి దోహదపడాలని కోరారు. దేశంలో డిజిటల్ మౌలిక వసతులు ఎంతగానో మెరుగుపడ్డాయనీ, ఇప్పుడు చిన్న కూల్‌డ్రింక్ బాటిల్ ఖరీదు కన్నా ఒక జీబీ డేటా ధర తక్కువగా ఉందన్నారు. అనంతరం మోదీ భారత్‌కు బయలుదేరారు. -
భాగస్వామ్యం బలోపేతం
యమనషి: భారత్–జపాన్ల భాగస్వామ్యం పూర్తిగా పరివర్తనం చెందిందనీ, ఇప్పుడు అది ‘ప్రత్యేక వ్యూహాత్మక, ప్రపంచ భాగస్వామ్యం’గా మారిందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ‘ఇరు దేశాల బంధంలో ప్రతికూలతలేవీ లేవు. ఉన్నవన్నీ అవకాశాలే’ అని జపాన్ మీడియాతో మోదీ అన్నారు. జపాన్–భారత్ 13వ వార్షిక సమావేశంలో పాల్గొనేందుకు మోదీ జపాన్‌కు వెళ్లిన సంగతి తెలిసిందే. ఆ దేశంలోని అత్యంత ఎత్తైన పర్వతం ఫుజి దగ్గర్లోని ఓ రిసార్ట్‌లో జపాన్ ప్రధాని షింజో అబేతో మోదీ అనధికారిక చర్చలు జరిపారు. ఆదివారం మొత్తంగా మోదీ–అబేలు 8 గంటలపాటు కలిసి గడిపారు. జపాన్–భారత్ సంబంధాల పురోగతిని సమీక్షించి, వ్యూహాత్మకంగా మరింత ముందుకు తీసుకెళ్లేందుకు వార్షిక సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ‘సుందరమైన యమనషి ప్రాంతంలో అబెను కలుసుకోవడం అమితానందంగా ఉంది’ అని మోదీ అన్నారు. ప్రత్యేక ఆతిథ్యానికి కృతజ్ఞతలు: మోదీ రోబో పరిశ్రమను సందర్శించిన అనంతరం కవగుచి సరస్సు సమీపంలోని తన సొంత ఇంటికి మోదీని అబే తీసుకెళ్లి విందు ఇచ్చారు. విదేశీ నేతను ఈ ఇంటికి అబే ఆహ్వానించడం ఇదే తొలిసారి. దీనిపై మోదీ ట్వీటర్లో స్పందిస్తూ ‘తన ఇంట్లో ప్రత్యేక ఆతిథ్యం ఇచ్చిన అబేకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. చాప్‌స్టిక్‌లను ఉపయోగించి జపాన్ విధానంలో ఆహారాన్ని ఎలా తినాలో కూడా అబే నాకు నేర్పించారు’ అని తెలిపారు. విందు తర్వాత ఇరువురు ప్రధానులు రైలులో టోక్యోకు చేరుకున్నారు. అక్కడే సోమవారం అధికారిక భేటీలో మోదీ, అబేలు పాల్గొంటారు. ద్వైపాక్షిక భద్రత, ఆర్థిక సహకారాలను బలపరిచే అంశంపై వీరిద్దరూ ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆయుష్మాన్ భారత్ పథకం తరహాలోనే జపాన్ కూడా ఓ పథకాన్ని అమలు చేస్తోంది. దీనిపై కూడా వారిద్దరూ చర్చించే అవకాశం ఉంది. తాను ప్రధాని అయ్యాక అబేను కలవడం ఇది 12వ సారని మోదీ చెప్పారు. భారత్‌కు జీవితకాల మిత్రుణ్ని: అబే భారత్‌కు తాను జీవితకాల మిత్రుడినని అబే తెలిపారు. తాను అత్యంత ఆధారపడదగ్గ, తనకున్న అత్యంత విలువైన స్నేహితుల్లో మోదీ ఒకరన్నారు. జపాన్ తొలి ప్రధాని, తన తాత నొబుసుకె కిషి 1957లో భారత్‌ను సందర్శించడాన్ని ఆయన గుర్తుచేసుకున్నారు. ‘జపాన్ ఇంత ధనిక దేశం కానప్పుడు నాటి భారత ప్రధాని జవహర్లాల్ నెహ్రూ కిషిని తీసుకెళ్లి జపాన్ ప్రధానిగా వేలాదిమందికి పరిచయం చేశారు. 1958 నుంచే భారత్‌కు జపాన్ రుణాలు ఇవ్వడం ప్రారంభమైంది’ అని అబే పేర్కొన్నారు. 2007లో తాను భారత్‌ను సందర్శించినప్పుడు ప్రపంచపు అతిపెద్ద ప్రజాస్వామ్య దేశపు పార్లమెంటులో ప్రసంగించేందుకు అవకాశం ఇవ్వడం ద్వారా తనకు భారత్ కల్పించిన గౌరవాన్ని ఆయన గుర్తుచేసుకున్నారు. అబేకి మోదీ బహుమతి హోటల్లో మోదీకి అబే అల్పాహారం విందు ఇచ్చారు. అనంతరం వారిద్దరూ అక్కడి ఉద్యానవనంలో తిరుగుతూ మాట్లాడుకున్నారు. చేతితో మలిచిన రెండు రాతిగిన్నెలను, రాజస్తాన్ పలుగురాళ్లు పొదిగిన దుప్పట్లను, జోధ్‌పూర్‌లో తయారైన చెక్కపెట్టెను మోదీ అబేకు బహుమతిగా ఇచ్చారు. వీటన్నింటినీ మోదీ జపాన్ పర్యటన కోసమే ప్రత్యేకంగా తయారు చేయించారు. తర్వాత ఇద్దరూ పారిశ్రామిక రోబోలను తయారుచేసే ఎఫ్ఏఎన్యూసీ పరిశ్రమను సందర్శించారు. ‘ఇరు దేశాల భాగస్వామ్యాన్ని ఆధునిక సాంకేతికత స్థాయికి తీసుకెళ్తున్నాం. మోదీ, అబే రోబోల తయారీలో ప్రపంచంలోనే అతిపెద్దదైన ఎఫ్ఏఎన్యూసీ పరిశ్రమను సందర్శించారు’ అని విదేశాంగ శాఖ తెలిపింది. రోబోలు ఎలా పనిచేస్తాయి, వాటి సామర్థ్యాలేంటనే విషయాలను పరిశ్రమ సిబ్బంది వారికి వివరించారు. -
భారత్–జపాన్.. గెలుపు జోడీ
న్యూఢిల్లీ: భారత్–జపాన్ ద్వైపాక్షిక వార్షిక సమావేశంలో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ శనివారం జపాన్ చేరుకున్నారు. అంతకుముందు, మోదీ మాట్లాడుతూ భారత్, జపాన్‌లది గెలుపు జోడీ అని అభివర్ణించారు. ఆర్థిక, సాంకేతికాభివృద్ధిలో భారత్‌కు జపాన్ విశ్వసనీయమైన భాగస్వామి అని అన్నారు. టోక్యో విమానాశ్రయంలో ఆయనకు ఘన స్వాగతం లభించింది. ఆదివారం, సోమవారం జపాన్ ప్రధాని షింజో అబేతో మోదీ భేటీ అవుతారు. 2014లో ప్రధాని అయ్యాక మోదీ అబేతో సమావేశమవడం ఇది 13వ సారి కావడం గమనార్హం. ఈ సందర్భంగా ఇద్దరు దేశాధినేతలు రక్షణ, ప్రాంతీయ అనుసంధానత సహా పలు అంశాలపై చర్చలు జరిపే అవకాశాలున్నాయి. ఇరు దేశాల సంబంధాల్లో పురోగతిని సమీక్షించి, వాటిని వ్యూహాత్మక కోణంలో బలోపేతం చేయడమే అజెండాగా ఈ సమావేశం జరుగుతుందని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రావీశ్ కుమార్ ట్వీట్ చేశారు. ఆదివారం నాటి షెడ్యూల్లో ఫ్యాక్టరీ ఆటోమేషన్‌లో అతిపెద్ద ఉత్పత్తిదారైన ఓ కంపెనీని మోదీ, అబే సందర్శిస్తారు. జపాన్ రాజధాని టోక్యోకు 110 కి.మీ.ల దూరంలోని యామాన్షి ప్రావిన్సులో ప్రకృతి సోయగాల మధ్య, ఆ దేశంలోనే అత్యంత ఎత్తయిన శిఖరం మౌంట్ ఫుజి ఆవరించి ఉన్న తన విడిది గృహంలో అబే ప్రధాని మోదీకి రాత్రి ప్రత్యేక విందు ఇవ్వనున్నారు. ఈ గౌరవం పొందబోతున్న తొలి విదేశీ నేత మోదీనే. విందు అనంతరం మోదీ, అబేలు రైలులో టోక్యో బయల్దేరుతారు. ఈ పర్యటనలో మోదీ టోక్యోలో అక్కడి భారత సంతతి ప్రజలతో ముచ్చటిస్తారు. కొన్ని వాణిజ్య వేదికలపై కూడా మోదీ ప్రసంగించనున్నారు. 6న కేదర్‌నాథ్‌కు.. వచ్చే నెల 6న మోదీ ఉత్తరాఖండ్‌లోని కేదర్నాథ్ ఆలయాన్ని సందర్శించి పూజలు నిర్వహించే అవకాశాలున్నాయి. అలాగే, కేదర్‌పురి ఆలయ పునర్నిర్మాణ పనులను కూడా సమీక్షించే వీలుంది. అయితే ప్రధాని పర్యటనపై ఇంకా పూర్తి స్పష్టత రావాల్సి ఉంది. కేదర్‌పురి ఆలయానికి మోదీ గతేడాది శంకుస్థాపన చేశారు. అప్పటి నుంచి నిర్మాణ పనులను తరచూ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షిస్తున్నారు. -
మోదీకి అరుదైన ఆతిథ్యం
న్యూఢిల్లీ: భారత ప్రధాని మోదీకి జపాన్ ప్రధాని షింజో అబే అరుదైన ఆతిథ్యం ఇవ్వనున్నారు. ఈ నెల 28, 29వ తేదీల్లో జపాన్‌లో పర్యటన సందర్భంగా ప్రధాని షింజో అబే తన విశ్రాంతి గృహానికి మోదీని ఆహ్వానించారు. యమనషి ప్రావిన్స్‌లో కొండల మధ్య ఉన్న సుందరమైన ఆ విశ్రాంతి గృహానికి ఒక విదేశీ నేతను అబే ఆహ్వానించటం ఇదే ప్రథమం. ఈ సందర్భంగా ఇద్దరు ప్రధానులు అక్కడి హోటల్లో మధ్యాహ్నం విందు చేయనున్నారు. -
13న కలెక్టర్ జపాన్ పర్యటన
నగరంపాలెం: జిల్లా కలెక్టర్, నగరపాలక సంస్థ ప్రత్యేక అధికారి కోన శశిధర్, అర్బన్ జిల్లా ఎస్పీ సీహెచ్ విజయారావు, నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా అనూరాధ ఫిబ్రవరి 13 నుంచి జపాన్ పర్యటనకు వెళ్లనున్నారు. సీఆర్డీఏ పరిధిలోని నగరాల్లో పబ్లిక్ రవాణా వ్యవస్థ ఏర్పాటుకు సంబంధించి సర్వే చేస్తున్న జపాన్ ఇంటర్నేషనల్ కార్పొరేషన్ ఏజెన్సీ (జైకా) సీఆర్డీఏ పరిధిలోని మున్సిపల్, పోలీస్ అధికారులను జపాన్ స్టడీ టూర్‌కు తీసుకెళ్తుంది. ఈ బృందం జపాన్‌లో అమలవుతున్న కాంప్రహెన్సివ్ ట్రాఫిక్, ట్రాన్స్‌పోర్టేషన్ (సీటీటీ)ను ఫిబ్రవరి 15–19 వరకు పరిశీలించనుంది. జపాన్ వెళ్లే బృందంలో కలెక్టర్, ఎస్పీ, కమిషనర్‌తో పాటు ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ దినేష్ కుమార్, మున్సిపల్ అర్బన్ డెవలప్మెంట్ (సీఆర్డీఏ) ప్రిన్సిపల్ సెక్రటరీ అజయ్‌జైన్, విజయవాడ పోలీస్ కమిషనర్ గౌతమ్ సవాంగ్, సీఆర్డీఏ కమిషనర్ డాక్టర్ చెరుకూరి శ్రీధర్, విజయవాడ మున్సిపల్ కమిషనర్ జె.నివాస్, సీఆర్డీఏ ప్రిన్సిపల్ ప్లానర్ ఎన్.అరవింద్ ఉన్నారు. వీరు 21న భారత్‌కు తిరిగి రానున్నారు. ఈ మేరకు జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ జపాన్ వెళ్లనున్న అధికారుల బాధ్యతలకు ఇన్చార్జులకు అప్పగిస్తూ గురువారం జీవో జారీ చేసింది. -
‘నగదు రహితం’లో రాష్ట్రమే టాప్
జపాన్ పర్యటనలో మంత్రి కేటీఆర్ సాఫ్ట్‌బ్యాంకు సీఈవో మయవోషిసన్‌తో మంత్రి భేటీ టీ–ఇన్నోవేషన్ ఫండ్‌లో భాగస్వామి కావాలని విజ్ఞప్తి ‘ఇన్వెస్ట్ తెలంగాణ’ సదస్సుకు హాజరు కావాలని ఆహ్వానం టోక్యో క్లీన్ అథారిటీ అధికారులతోనూ కేటీఆర్ భేటీ సాక్షి, హైదరాబాద్: నగదు రహిత చెల్లింపుల్లో భారత దేశంలోనే తెలంగాణ నంబర్ వన్ స్థానంలో ఉందని మంత్రి కె.తారకరామారావు పేర్కొన్నారు. జపాన్ పర్యటనలో ఉన్న ఆయన బుధవారం సాఫ్ట్ బ్యాంక్ సీఈవో, సీఎండీ మయవోషిసన్‌తో సమావేశమయ్యారు. సాఫ్ట్వేర్, డిజిటల్ రంగంలో తెలంగాణ సాధించిన పురోగతి, తీసుకుంటున్న చర్యలను వివరించారు. ఈ సందర్భంగా భారత్‌లో నోట్ల రద్దు తర్వాతి పరిస్థితులపై సాఫ్ట్‌బ్యాంక్ సీఈవో ఆరా తీశారు. డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను తెలుసుకుని, అభినందించారు. నూతన ఆవిష్కరణలకు టీ–హబ్ లాంటి ప్రాజెక్టులు ఎంతో మేలు చేస్తాయని ప్రశంసించారు. ఇక నవంబర్‌లో చేపట్టనున్న ‘ఇన్వెస్ట్ తెలంగాణ’ సదస్సుకు గౌరవ అతిథిగా హాజరుకావాలని సాఫ్ట్ బ్యాంక్ సీఈవోను మంత్రి కేటీఆర్ ఆహ్వానించారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న టీ–ఇన్నోవేషన్ ఫండ్‌లో ఆ సంస్థ భాగస్వామి కావాలని కోరారు. సాంకేతిక సహకారం అందించండి జపాన్ పర్యటనలో భాగంగా బుధవారం ఆ దేశ రాజధాని టోక్యోలో మంత్రి కేటీఆర్ విస్తృతంగా పర్యటించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో టోక్యో లాంటి విశాల నగరాన్ని నడిపిస్తున్న తీరుపై, ఘన వ్యర్థాల నిర్వహణ పద్ధతులపై అధ్యయనం జరిపారు. టోక్యో క్లీన్ అథారిటీ కార్యాలయాన్ని సందర్శించి అక్కడి అధికారులతో సమావేశమయ్యారు. వాయు కాలుష్యం, పారిశుద్ధ్య సమస్యలను ఎదుర్కొనేందుకు అవలంబిస్తున్న వ్యూహాన్ని అడిగి తెలుసుకున్నారు. హైదరాబాద్ మహానగరంలో పారిశుద్ధ్య నిర్వహణకు సాంకేతిక సహాయం అందించాలని టోక్యో క్లీన్ అథారిటీ అధికారులను కేటీఆర్ కోరారు. టోక్యోలో ప్రభుత్వం కల్పిస్తున్న మౌలిక సదుపాయాల పట్ల మంత్రి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. నగరం పట్ల అక్కడి పౌరుల బాధ్యత అద్భుతమని కొనియాడారు. ఏదో ఒక రోజు హైదరాబాద్ నగరం టోక్యో స్థాయికి చేరుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కొన్ని ప్రాంతాల్లో ఎక్కడికక్కడ చెత్తను రీసైక్లింగ్ చేసే ప్లాంట్లతో పాటు టోక్యో మెట్రోపాలిటన్ పరిధిలోని రెండు మున్సిపాలిటీల్లో చెత్త రీసైకిల్ ప్లాంట్లను మంత్రి పరిశీలించారు. టోక్యోలోని ఇండియన్ స్కూల్లో.. టోక్యోలో ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్‌ను కేటీఆర్ సందర్శించి, అక్కడి విద్యార్థులతో మాట్లాడారు. గణతంత్ర దినోత్సవం కోసం విద్యార్థులు చేస్తున్న రిహార్సల్స్‌ను తిలకిం చారు. టోక్యో లాంటి అంతర్జాతీయ నగరంలో భారతదేశ జాతీయ గీతాన్ని విన్నందుకు భారతీయుడిగా గర్వపడుతున్నానని ఈ సంద ర్భంగా వ్యాఖ్యానించారు. -
ముందుంది ముసళ్ల పండగ
నల్లధనం కక్కించేందుకు మరిన్ని చర్యలు • జపాన్ పర్యటనలో అక్కడి భారతీయులతో ప్రధాని మోదీ • నిజాయితీకి తగిన గౌరవం.. తప్పు చేస్తే తప్పదు మూల్యం • జపాన్ పర్యటనలో అక్కడి భారతీయులతో ప్రధాని మోదీ • 70 ఏళ్ల క్రితం దాచింది కూడా బయటకు రప్పిస్తా.. • ప్రజలు నోట్ల విషయంలో ఇబ్బందులు పడుతున్నా పెద్దనోట్ల రద్దు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు • జపాన్ పర్యటనలో అక్కడి భారతీయులతో ప్రధాని మోదీ కోబే: పాతనోట్ల రద్దుతో నల్లధనం బయటకు వస్తోందని.. పెద్దమొత్తంలో దాచిపెట్టిన బ్లాక్‌మనీని బయటకు తీసుకొచ్చేందుకు మరిన్ని చర్యలు చేపడుతున్నట్లు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. జపాన్ పర్యటనలోఉన్న మోదీ అక్కడి భారతీయులతో మాట్లాడారు. డిసెంబర్ 30 వరకు పాతనోట్లను జనాలు మార్చుకోవచ్చని.. ఆ తర్వాత బయటపడే మొత్తానికి తగిన మూల్యం చెల్లించక తప్పదన్నారు. నల్లధనం దాచుకున్న వారికి మరిన్ని కష్టాలు తప్పవనే సంకేతాలిచ్చిన ప్రధాని.. ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నా దేశ శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని సహకరిస్తున్నారన్నారు. ‘నిజారుుతీగా ఉన్న వారికి ఇబ్బందేం లేదు. ఎవరి అకౌంట్లలోనైనా లెక్కకు అందనివి ఏమైనా బయటపడితే.. స్వాతంత్య్రం వచ్చినప్పటినుంచి వారి లెక్కలను బయటకు తీస్తా. ఇందుకోసం అదనంగా ఉద్యోగులను పెట్టుకుంటాం. ఎవరినీ వదిలిపెట్టేది లేదు. నా గురించి తెలిసిన వాళ్లంతా చాలా తెలివైన వాళ్లే. అందుకే బ్యాంకుల్లో వేసే బదులు గంగలో వేద్దామని చూస్తున్నారు’ అని మోదీ తెలిపారు. పాతనోట్ల రద్దీని ‘స్వచ్ఛ అభియాన్’గా అభివర్ణించిన ప్రధాని మోదీ.. ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నా నవంబర్ 8 న ఇచ్చిన ప్రకటనకు సహకరిస్తున్నారన్నారు. ‘దేశ ప్రజలందరికీ నా సెల్యూట్. ప్రజలు నాలుగు, ఆరు గంటలపాటు క్యూలైన్లలో నిలబడుతున్నారు. కానీ జాతి శ్రేయస్సు కోసం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. ప్రజలకు కొన్ని రోజులు ఇబ్బందులు తప్పవనే విషయం ఊహించిందే. కానీ దీన్ని రహస్యంగా ఉంచాల్సిన అవసరముంది. అరుునా ప్రజలు వారి ఆశీర్వాదాలు అందిస్తూనే ఉన్నారు. 2011 సునామీ, భూకంపం విపత్తు తర్వాత జపాన్ ప్రజలు కూడా ఇలాగే ప్రభుత్వానికి సహకరించారు’ అని మోదీ తెలిపారు. ‘నిజారుుతీగా ఉండే వారిని కాపాడేందుకు ప్రతిక్షణం ప్రభుత్వం పనిచేస్తోంది. కానీ తప్పు చేసిన వారు తగిన మూల్యం చెల్లించక తప్పదు గుర్తుపెట్టుకోండి. నల్లధనం బయటపెట్టండని కావాల్సినంత సమయం ఇచ్చాం. ఇక మీ ఇష్టం. మీ కుటుంబం, పిల్లల గురించి ఆలోచించండి’ అని మోదీ తెలిపారు. ‘ప్రజలను అవాస్తవాలతో భయపెట్టిద్దామని ఓ వర్గం వీలైనంత ప్రయత్నం చేస్తోంది. ప్రభుత్వ తీరును వ్యతిరేకించేలా రెచ్చగొడుతోంది. అందరికీ ఒకే చట్టం వర్తిస్తుందనే విషయాన్ని గుర్తుంచుకోవాల’న్నారు. రెండేళ్లలో ప్రభుత్వం తీసుకున్న వివిధ చర్యల ద్వారా రూ.1.25 లక్షల కోట్ల నల్లధనం బయటకు వచ్చిందన్నారు. ఎఫ్‌డీఐల్లో పెరుగుదల..: భారతదేశ ఆర్థిక వ్యవస్థ వేగంగా ఎదుగుతోందనే విషయాన్ని ప్రపంచమంతా గుర్తిస్తోందని.. ఇందులో భాగంగానే దేశానికి పెద్దమొత్తంలో ఎఫ్‌డీఐలు వస్తున్నాయని మోదీ తెలిపారు. ‘అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్), ప్రపంచ బ్యాంకు భారత వృద్ధి గురించి ఒకే మాట చెబుతున్నారుు. భారత్ మెరుస్తున్న నక్షత్రమని ఐఎంఎఫ్ అంటోంది. ప్రపంచ ఆర్థిక వేత్తలు భారత్ చాలా వేగంగా వృద్ధి రేటు సాధిస్తోందంటున్నారు. ఎఫ్‌డీఐ విషయంలో నా దృష్టిలో రెండు నిర్వచనాలున్నారుు. మొదటిది ఫస్ట్ డెవలప్ ఇండియా, రెండోది ఫారిన్ డెరైక్ట్ ఇన్వెస్ట్మెంట్’ అని ప్రధాని అన్నారు. బుల్లెట్ రైలును నడిపిన మోదీ జపాన్‌తో పారిశ్రామిక భాగస్వామ్యాన్ని కోరుకుంటున్నామని వెల్లడి కోబే/ఒసాకో: జపాన్ ప్రధాని షింబో అబేతో కలసి మోదీ శనివారం టోక్యో నుంచి కొబేకు హైస్పీడ్ బుల్లెట్ రైల్లో ప్రయాణించారు. అబేతో కలసి డ్రైవర్ క్యాబిన్లోకి వెళ్లిన మోదీ కాసేపు డ్రైవర్ సీట్లో కూర్చుని ఆపరేట్ చేశారు. గంటకు 240 నుంచి 320 కిలో మీటర్ల వేగంతో దూసుకుపోయే ఇలాంటి రైలును ముంబై-అహ్మదాబాద్ మధ్య ప్రవేశపెట్టాలని యోచిస్తున్నారు. అనంతరం వ్యాపార, రాజకీయ ప్రముఖులతో ఇరువురు నేతలు భేటీ అయ్యారు. వీరి సమక్షంలో గుజరాత్, జపాన్ మధ్య ఒప్పందం కుదిరింది. జపాన్ పారిశ్రామిక రంగంతో భారత్ కీలక భాగస్వామ్యాన్ని కోరుకుంటోందని మోదీ అన్నారు. ఇది ఇరు దేశాలకు ఎంతో లాభ దాయకమని కోబేలో వ్యాపారవేత్తలతో మోదీ అన్నారు. అబేతో కలసి బుల్లెట్ రైలు నడిపిన చిత్రాలను మోదీ ట్విటర్లో పోస్టు చేశారు. స్వదేశానికి మోదీ..: మూడు రోజుల జపాన్ పర్యటన ముగించుకుని మోదీ శనివారం స్వదేశానికి తిరుగు ప్రయాణమయ్యారు. పౌర అణు ఇంధనంపై ఇరు దేశాలు సంతకాలు చేయడంతో పాటు మరో 9 ఒప్పందాలు ఈ పర్యటనలో జరిగారుు. మోదీ పర్యటనతో ద్వైపాక్షిక సంబంధాలు బలపడ్డాయని భారత్ పేర్కొంది. -
పన్నులు ఎగ్గొట్టేవారిని వదిలిపెట్టేది లేదు
-
పన్నులు ఎగ్గొట్టేవారిని వదిలిపెట్టేది లేదు: మోదీ
ఇన్నాళ్లుగా దోపిడీ చేసిన సొమ్మును ఇప్పుడు తిరిగి రాబడుతున్నామని, ఇప్పటివరకు రూ. 45 వేల కోట్ల నగదు డిపాజిట్ అయిందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. జపాన్‌లోని కోబె నగరంలో ప్రవాస భారతీయులతో ఆయన మాట్లాడారు. నోట్ల రద్దును స్వాగతిస్తున్నవారందరికీ సెల్యూట్ అని చెప్పారు. ఇది ఎవరినో ఇబ్బందిపెట్టడానికి తీసుకున్న నిర్ణయం కాదని, ఇబ్బందులు ఎదురైనా ప్రజలు మాత్రం సహకరిస్తున్నారని తెలిపారు. నోట్ల రద్దు అంశాన్ని చాలా రహస్యంగా ఉంచామన్నారు. పన్ను ఎగ్గొట్టేవారిని వదిలిపెట్టేది లేదని, నిజాయితీపరులను రక్షించడం మాత్రం తమ ప్రభుత్వ ప్రథమ కర్తవ్యమని అన్నారు. ఇన్నాళ్లూ గంగానదితో పుణ్యానికి ఒక్క రూపాయి కూడా వేయనివాళ్లు సైతం ఇప్పుడు వెయ్యి, 500 రూపాయల నోట్లు విసిరేస్తున్నారంటూ చమత్కరించారు. ఇన్నాళ్లూ బ్యాంకుల ముఖం చూడనివాళ్లు కూడా ఇప్పుడు బ్యాంకులకు వెళ్తున్నారని చెప్పారు. భారత ఆర్థిక వ్యవస్థ వేగంగా వృద్ధి చెందుతోందని, గత ఏడాది అధ్యధికంగా ఎఫ్‌డీఐలు వచ్చాయని మోదీ అన్నారు. గుజరాత్లో భూకంపం వచ్చినప్పుడు కోబె నగరం ఆదుకుందని, ఈ నగరంతో భారతదేశానికి చాలా కాలంగా సత్సంబంధాలు ఉన్నాయని చెప్పారు. తమ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్ లాంటి సంస్థలు ప్రశంసిస్తున్నాయని అన్నారు. జనధన యోజన కింద పేదలందరికీ అకౌంట్లు తెరిచామని, పేదరిక నిర్మూలనకు ప్రభుత్వం తీసుకున్న చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయని తెలిపారు. అవినీతిని నిర్మూలించడమే అసలైన స్వచ్ఛభారత్ అని, నియమ నిబంధనలు అందరికీ సమానమేనని చెప్పారు. -
బుల్లెట్ రైలు నడిపిన ప్రధాని మోదీ
టోక్యో: జపాన్ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీ కీలక ఒప్పందాలు చేసుకున్నారు. జపాన్ పారిశ్రామిక రంగంలో భారత్ కీలక భాగస్వామ్యం కోరుకుంటోందని, దీనివల్ల ఇరు దేశాలకు లాభదాయకమని మోదీ చెప్పారు. శనివారం కొబెలో మోదీ జపాన్ వ్యాపారవేత్తలతో సమావేశమయ్యారు. 2007, 2012లో ఇక్కడ పర్యటించానని ఈ సందర్భంగా మోదీ గుర్తు చేసుకున్నారు. జపాన్ ప్రధాని షింజో అబెతో కలిసి మోదీ టోక్యో నుంచి కొబెకు హై స్పీడ్ రైల్లో ప్రయాణించారు. రైల్లో మోదీ, అబె ఇద్దరూ కలసి డ్రైవర్ క్యాబిన్లోకి వెళ్లారు. మోదీ కాసేపు డ్రైవర్ సీట్లో కూర్చుని ఆపరేట్ చేశారు. కొబెలో ప్రధాని మోదీ వ్యాపారవేత్తలు, రాజకీయ ప్రముఖులతో భేటీ అయ్యారు. మోదీ, అబె సమక్షంలో గుజరాత్, హ్యోగో ప్రభుత్వాలు పలు ఒప్పందాలపై సంతకాలు చేశాయి. -
జపాన్‌తో అణు ఒప్పందం!
ఆ దేశ ప్రధానితో నేడు మోదీ భేటీ కీలక అంశాలపై చర్చలు.. ఒప్పందాలు టోక్యో/బ్యాంకాక్: ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం జపాన్ ప్రధాని షింజో అబెతో భేటీ కానున్నారు. ఈ సమావేశంలో ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాల గురించి చర్చించనున్నారు. అనంతరం ఇరు దేశాలు 12 ద్వైపాక్షిక ఒప్పందాలు కుదుర్చుకోనున్నాయి. అలాగే కీలకమైన పౌర అణు ఒప్పందం కూడా జరగనున్నట్లు తెలిసింది. దీనిపై ఇరు దేశాల మధ్య చర్చలు ఇప్పటికే చివరి దశకు వచ్చాయి. మోదీ, అబెలు భౌగోళిక ప్రాంతాలు, రక్షణ, వాణిజ్య, పెట్టుబడులు, నైపుణ్యాభివృద్ధి, మౌలికవసతుల అభివృద్ధి వంటి అంశాలపై చర్చించనున్నారు. రెండు రోజుల జపాన్ పర్యటనలో భాగంగా శుక్రవారం టోక్యోలో, శనివారం కోబేలో జపాన్ వ్యాపారవేత్తలనుద్దేశించి మోదీ ప్రసంగించనున్నారు. ‘భారత్, జపాన్‌కు చెందిన అత్యున్నత వ్యాపారవేత్తలతో పూర్తి స్థాయి చర్చల్లో పాల్గొనబోతున్నా. దీని ద్వారా వాణిజ్య, పెట్టుబడుల్లో మా బంధం మరింత బలోపేతమవుతుందని ఆశిస్తున్నా’’ అని మోదీ ట్వీట్ చేశారు. జపాన్ చక్రవర్తి అకిహిటోతో కూడా ప్రధాని మోదీ భేటీ కానున్నారు. ఆ దేశ ప్రతిపక్ష పార్టీల నాయకులతో సమావేశం కానున్నారు. థాయ్‌లో ఆకస్మిక పర్యటన: థాయ్‌లాండ్ దివంగత రాజు భుమిబోల్ అదుల్యాదేజ్కు ప్రధాని మోదీ నివాళులర్పించారు. జపాన్ పర్యటనకు బయలుదేరిన మోదీ మర్గమధ్యలో థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్‌లో ఆకస్మికంగా దిగి, గ్రాండ్ ప్యాలెస్ కాంప్లెక్స్‌లో దివంగత రాజుకు శ్రద్ధాంజలి ఘటించారు. వృద్ధాప్యం వల్ల గత నెలలో రాజు మృతి చెందారు. -
మెదక్‌లో ఉద్రిక్తత: మంత్రి హరీశ్ జపాన్ పర్యటన రద్దు
హైదరాబాద్: నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్ రావు జపాన్ పర్యటన అర్ధాంతరంగా రద్దయింది. మరి కొద్ది సేపట్లో విమానాశ్రయానికి బయలుదేరుతారనగా మంత్రిగారు నిర్ణయం మార్చుకున్నారు. పలువురు ఉన్నతాధికారులతో కలిసి ఆదివారం రాత్రి జపాన్ వెళ్లాల్సిన ఆయన.. మెదక్ జిల్లాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పర్యటన వాయిదా వేసుకున్నారు. (మల్లన్న సాగర్ ముంపు గ్రామాల్లో తీవ్ర ఉద్రిక్తత) మల్లన్నసాగర్ ప్రాజెక్టు వ్యతిరేకంగా నిరసన తెలిపేందుకు వెళుతోన్న మహిళలను పోలీసులు అడ్డుకొని పాశవికంగా కొట్టడం, లాఠీచార్జ్ చేయడంతో జిల్లా మొత్తం ఒక్కసారిగా వేడెక్కింది. మహిళలపై పోలీసుల లాఠీచార్జ్ ను నిరసిస్తూ అఖిలపక్షం సోమవారం మెదక్ జిల్లా బంద్ కు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో తాను విదేశీ పర్యటనకు వెళ్లడం సమంజసం కాదనే ఉద్దేశంతోనే మంత్రి హరీశ్ రావు పర్యటన రద్దు నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలిసింది. (మల్లన్న సాగర్ కట్టితీరుతాం) షెడ్యూల్ ప్రకారం మంత్రి హరీశ్, ఇతర ఉన్నతాధికారులు.. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి కీలకమైన పంపులు, పరికరాలను పరిశీలించేందుకు జపాన్ వెళ్లాల్సిఉంది. ఈ నెల 31 వరకు జపాన్‌లోను ఉండి, తర్వాత ఆస్ట్రియాకు వెళతారు. ఆగస్టు 6న తిరిగి రాష్ట్రానికి తిరిగి రావాల్సిఉంది. ఆయన వెంట నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్కె జోషితో పాటు కాళేశ్వరం ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్ ఎన్. వెంకటేశ్వర్లు, సర్కిల్-2 ఎస్ఈ పి. వెంకట రాములు, సిరిసిల్ల ఈఈ ఎస్.ప్రభాకర్, టీఎస్ జెన్కో ఎస్ఈ కే శ్రీనివాసరెడ్డిలు మంత్రి వెంట జపాన్ బయలుదేరారు. ఆస్ట్రియా వెళ్ళే బృందంలో తెలంగాణ నీటిపారుదల శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ మురళీధర్ రావు , చీఫ్ ఇంజనీర్ హరిరామ్, ఎస్ఈ కేఎస్ఎస్ చంద్రశేఖర్, సిద్దిపేట ఈఈ కేఎన్ ఆనంద్, జెన్కో డివిజనల్ ఇంజనీర్ జే శ్రీనివాస్‌లు ఉన్నారు. -
జపాన్‌కు బయల్దేరిన హరీష్ రావు
హైదరాబాద్: తెలంగాణ సాగునీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు జపాన్ పర్యటనకు పయనమయ్యారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి కీలకమైన పంపులు, పరికరాలను పరిశీలించేందుకు వెళ్లారు. ఈ నెల 31 వరకు జపాన్‌లో పర్యటించి, ఆ తర్వాత ఆస్ట్రియాకు వెళతారు. ఆగస్టు 6న తిరిగి రాష్ట్రానికి రానున్నారు. ఆదివారం అర్ధరాత్రి హరీష్ రావు అధికారుల బృందంతో కలిసి విదేశీ పర్యటనకు బయలుదేరారు. కాళేశ్వరం ప్రాజెక్టు 9వ ప్యాకేజీలో అమర్చే పంపుల మోడల్ విట్నెస్ టెస్ట్‌ను జపాన్ ఒసాకాలోని మితుబుషి హెవీ ఇండస్ట్రీస్ నిర్వహిస్తోంది. ఈ పంపుల విట్నెస్ పరీక్షకు తెలంగాణ ప్రభుత్వం తరఫున మంత్రి హరీష్‌రావును, అధికారుల బృందాన్ని ఆహ్వానించింది. తెలంగాణ నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్కె జోషితో పాటు కాళేశ్వరం ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్ ఎన్. వెంకటేశ్వర్లు, సర్కిల్-2 ఎస్ఈ పి. వెంకట రాములు, సిరిసిల్ల ఈఈ ఎస్.ప్రభాకర్, టీఎస్ జెన్కో ఎస్ఈ కే శ్రీనివాసరెడ్డిలు మంత్రి వెంట జపాన్ బయలుదేరారు. జపాన్ పర్యటన సందర్భంగా అక్కడి సాగునీటి వనరులను వినియోగించే పద్దతులను, ప్రాజెక్టులలో వినియోగిస్తున్న అధునాతన టెక్నాలజీని మంత్రి తెలుసుకోనున్నారు. జపాన్ పర్యటన ముగియగానే మంత్రి హరీష్ రావు ఆస్ట్రియాకు వెళతారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ళ సుజల స్రవంతి పథకం 12వ ప్యాకేజీలో భాగంగా ఏర్పాటుచేయనున్న పంప్‌లకు సంబంధించి విట్నెస్ టెస్ట్ ఆస్ట్రియాలోని ఆండ్రిడ్జ్‌లో జరగనుంది. దీనిని పరిశీలించేందుకు మంత్రి హరీష్ రావు నేతృత్వంలోని అధికారుల బృందం వెళ్ళనుంది. ఆస్ట్రియా వెళ్ళే బృందంలో తెలంగాణ నీటిపారుదల శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ మురళీధర్ రావు , చీఫ్ ఇంజనీర్ హరిరామ్, ఎస్ఈ కేఎస్ఎస్ చంద్రశేఖర్, సిద్దిపేట ఈఈ కేఎన్ ఆనంద్, జెన్కో డివిజనల్ ఇంజనీర్ జే శ్రీనివాస్‌లు ఉన్నారు. -
'పెట్టుబడుల అవకాశాలు వివరించా'
-
పెట్టుబడుల అవకాశాలు వివరించా: చంద్రబాబు
ఢిల్లీ: రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను జపాన్‌లో వివరించామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు శ్రద్ధ చూపారని తెలిపారు. జపాన్ పర్యటనకు వెళ్లొచ్చిన చంద్రబాబు శుక్రవారం ఢిల్లీలో విలేకరులతో మాట్లాడారు. అమరావతిలో మిజహో బ్రాంచి పెట్టాలని వారిని కోరినట్లు చెప్పారు. ఫిజి ఎలక్ట్రికల్ ను కలిసి రాష్ట్రంలో పరిశ్రమ ఏర్పాటుచేసే అంశంపై చర్చించినట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో సోలార్ పానెల్ ఏర్పాటుకు రావాలని కోరినట్లు వివరించారు. జైకా, జెబిక్ వంటి ప్రభుత్వ సంస్థల ప్రతినిధులతో చర్చలు జరిపామని చెప్పారు. శ్రీకాకుళంలో జెబిక్ పవర్ ప్రాజెక్టు పనులకు వారు ఆసక్తి చూపినట్లు తెలిపారు. సేఫ్ సిటీగా తిరుపతిని తయారుచేసేందుకు ఎన్ఏసీ ముందుకొచ్చిందని చంద్రబాబునాయుడు వివరించారు. -
ముగిసిన చంద్రబాబు జపాన్ పర్యటన
-
పుజి, మిత్సుబిషిలతో చంద్రబాబు బృందం భేటీ
టోక్యో: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి బృందం పర్యటన రెండో రోజూ జపాన్‌లో కొనసాగుతోంది. సోమవారం ఉదయం జపాన్ రాజధాని టోక్యోలో పుజి ఎలక్ట్రిక్ సంస్థ, మిత్సుబిషి కార్పొరేషన్ ప్రతినిధులతో చంద్రబాబు బృందం సమావేశమైంది. ఏపీలో పెట్టుబడులు పెట్టాలని ఆ సంస్థలను చంద్రబాబు ఆహ్వానించారు. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు కావాల్సిన అన్ని సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటికే పుజి సంస్థ విజయవాడలో పైలట్ ప్రాజెక్టు కింద స్మార్ట్ గ్రిడ్ నిర్మాణం చేపట్టింది. ఏపీ రాజధాని అమరావతి ప్రాంతంలోనూ పుజి సంస్థ ప్రాజెక్టు చేపట్టనుంది. ఇక మిత్సుబిషి కార్పొరేషన్ విశాఖలో సమాచార అధ్యయన కేంద్రం నెలకొల్పనుంది. కృష్ణపట్నం క్లస్టర్ ఏర్పాటుకు మిత్సుబిషి సానుకూలత వ్యక్తం చేసింది. స్మార్ట్ విలేజ్, స్మార్ట్ వార్డుల కార్యక్రమానికి సహకరించాలని చంద్రబాబు మిత్సుబిషి కంపెనీని కోరారు. సీఎం వెంట మంత్రులు యనమల రామకృష్ణుడు, పి.నారాయణ, ప్రభుత్వ కమ్యూనికేషన్స్ సలహాదారు పరకాల ప్రభాకర్, ఢిల్లీలో రాష్ట్రప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి కంభంపాటి రామ్మోహనరావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐ.వై.ఆర్. కృష్ణారావు, సీఎం కార్యాలయ ముఖ్యకార్యదర్శి సతీష్‌చంద్ర, మున్సిపల్, ఆర్థిక, పరిశ్రమల శాఖల ముఖ్యకార్యదర్శులు ఎ.గిరిధర్, పీవీ రమేశ్, ఎస్.ఎస్.రావత్, పరిశ్రమల మౌలిక వసతుల కల్పనశాఖ కార్యదర్శి అజయ్‌జైన్, సీఆర్డీఏ కమిషనర్ ఎన్.శ్రీకాంత్ ఉన్నారు. 8వ తేదీ వరకు బాబు బృందం జపాన్‌లోనే పర్యటిస్తుంది. అనంతరం 9, 10 తేదీల్లో హాంకాంగ్‌లో పర్యటిస్తుంది. 10వ తేదీ రాత్రి అక్కడ్నుంచీ బయల్దేరి హైదరాబాద్‌కు తిరిగి రానుంది. -
జపాన్ టూర్లో చంద్రబాబు బృందం
-
రేపు రాత్రి జపాన్ పర్యటనకు చంద్రబాబు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం శనివారం ఉదయం 10 గంటలకు జరగనుంది. హౌసింగ్ పాలసీపై మంత్రివర్గ ఉపసంఘం సిఫారసు, నిత్యవసర వస్తువుల ధరల నియంత్రణ, బైరటిస్, ఎర్రచందనం అంశాలపై చర్చించనున్నారు. రేపు అర్ధ రాత్రి చంద్రబాబు జపాన్ పర్యటనకు బయల్దేరి వెళ్లనున్నారు. ఈ నెల 7న సాఫ్ట్ బ్యాంక్ చైర్మన్‌తో చంద్రబాబు సమావేవంకానున్నారు. అక్టోబర్‌లో జరిగే రాజధాని శంకుస్థాపనకు రావాలని జపాన్ ప్రధానిని చంద్రబాబు ఆహ్వనిస్తారు. -
సైన్స్ విజన్
జపాన్ టూర్‌పై విద్యార్థుల ఆనందం సాక్షి, సిటీబ్యూరో: మానవాళి మనుగడ, అభివృధ్ధిలో సైన్స్ ప్రాధాన్యత... అది విద్యార్థులకు కెరీర్ పరంగా అందించే విజయాలు... జపాన్ పర్యటన తె లియజెప్పిందని నగరానికి చెందిన పాఠశాల విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు. జపాన్ సైన్స్ టెక్నాలజీ ఏజెన్సీ ‘సకురా సైన్స్ ప్రోగ్రామ్’లో భాగంగా లిటిల్ ఫ్లవర్ స్కూల్ విద్యార్థులు 25 మంది జపాన్‌లో పర్యటించారు. నగరానికి తిరిగి వచ్చిన సందర్భంగా వారు అక్కడి విశేషాలను పంచుకున్నారు. ఉన్నత పాఠశాలలు, విశ్వవిద్యాలయాలు, ప్రయోగశాలలు, క్యోటో యూనివర్సిటీ సందర్శన, టోక్యోకు బుల్లెట్ రైలు ప్రయాణం, జపాన్ ఏరోస్పేస్ ఎక్స్‌ప్లోరేషన్ ఏజెన్సీ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ ఇండస్ట్రియల్ సైన్స్ అండ్ టె క్నాలజీ, టోక్యో ఎమెర్జింగ్ సైన్స్ అండ్ ఇన్నోవేషన్ మ్యూజియం... వంటివి సందర్శించడం మరిచిపోలేని అనుభూతిని అందించిందని వివరించారు. ఇదొక విజ్ఞాన, వినోదాల మేలు కలయికగా సాగిన పర్యటన అని పేర్కొన్నారు. ఈ పర్యటనలో పాల్గొన్న స్కూల్ ప్రిన్సిపల్ బ్రదర్ ఆంటోనిరెడ్డి, టీచర్ మేరియాన్లు కూడా తమ అనుభవాలను పంచుకున్నారు. -
ఎన్ని వేల కోట్ల పెట్టుబడులు వస్తాయి?
సాక్షి, హైదరాబాద్: తన జపాన్ పర్యటన విజయవంతమైందని చంకలు గుద్దుకుంటున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వచ్చే నాలుగేళ్లలో జపాన్, సింగపూర్ దేశాల నుంచి ఎన్ని వేల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తాయో వివరిస్తూ ఒక శ్వేతపత్రం విడుదల చేయాలని వైఎస్సార్సీపీ శాసనసభాపక్షం సమన్వయకర్త ఆదిమూలపు సురేష్ డిమాండ్ చేశారు. ఆయన సోమవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... చంద్రబాబు జపాన్ పర్యటన కొండను తవ్వి ఎలుకను పట్టినట్లుగా ఉందని వ్యాఖ్యానించారు. విశాఖపట్నం, శ్రీకాకుళం, అనంతపురంలో నిర్మించాలని తలపెట్టిన మొత్తం పదివేల మెగావాట్ల విద్యుత్ కేంద్రాలకు సంబంధించి కుదుర్చుకున్న ఒప్పందాలు (ఎంఓయూలు) ఏమైనా ఉంటే వాటిని, జపాన్ ప్రధానమంత్రి ఏవైనా స్పష్టమైన హామీలు ఇచ్చి ఉంటే వాటిని ప్రజలకు వెల్లడించాలని కోరారు. గతంలో చంద్రబాబు పర్యటనలతో ఎన్ని పెట్టుబడులు వచ్చాయో ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు. -
జపాన్‌తో బంధానికి ఇది ఆరంభమే
పర్యటనతో పెట్టుబడులెన్ని వచ్చాయో ఇప్పుడే చెప్పలేం: సీఎం చంద్రబాబు వచ్చే ఏడాది రాష్ట్రానికి జపాన్ ప్రధాని విదేశీ పర్యటనలు కొనసాగుతాయి.. సాక్షి, హైదరాబాద్: తన జపాన్ పర్యటన వల్ల తక్షణం ఎన్ని పెట్టుబడులు వచ్చాయనే విషయా న్ని ఇప్పటికిప్పుడు లెక్కలేసుకొని చెప్పలేమని, దీర్ఘకాలిక ప్రణాళికల రూపకల్పనకు ఈ పర్యటన దోహదం చేస్తుందని ఏపీ సీఎం చంద్రబాబు చెప్పారు. జపాన్‌తో సుదీర్ఘ బంధానికి ఇది ఆరంభంగా పేర్కొన్నారు. సోమవారం సచివాల యంలో సమావేశంలో ఆయన మాట్లాడారు. జపాన్ పర్యటన విశేషాలను వెల్లడించారు. జపాన్ పర్యటన వల్ల రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులపై విలేకరుల ప్రశ్నలకు ఆయన సూటిగా సమాధానమివ్వలేదు. తన పర్యటన వల్ల వారిలో నమ్మ కం కలిగిందని వివరించారు. వచ్చే ఏడాది జపాన్ ప్రధాని భారత్ పర్యటనకు వచ్చినప్పుడు ఏపీని సందర్శిస్తానన్నారని చెప్పారు. రాష్ట్రంలో 10 వేల మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టు ఏర్పాటుకు సాఫ్ట్ బ్యాంక్ చైర్మన్ ముం దుకొచ్చారని చెప్పారు. పట్టణాభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన, ఉత్పత్తి, వ్యవసాయం, ఆహార శుద్ధి, ఐటీ తదితర రంగాల్లో జపాన్ సంస్థలు పెట్టుబడులు పెట్టడానికి వీలుగా ‘మినిస్ట్రీ ఆఫ్ ఎకానమీ, ట్రేడ్, ఇండస్ట్రీ (ఎంఇటీఐ)తో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నట్లు చెప్పారు. ఇంధన రంగంలో పరస్పర సహకారానికి ‘న్యూ ఎనర్జీ అండ్ ఇండస్ట్రియల్ టెక్నాలజీ డెవలెప్మెంట్ ఆర్గనైజేషన్’తో మరో ఒప్పందం కుదుర్చుకున్నామన్నారు. పెట్టుబడులను ఆకర్షించడానికి విదేశీ పర్యటనలు కొనసాగిస్తానని తెలిపారు. తన తదుపరి పర్యటన జర్మనీ లేదా దక్షిణ కొరియాలో ఉంటుందన్నారు. రాజధాని మాస్టర్ ప్లాన్ సిద్ధమైన తర్వాత నిర్మాణంలో జపాన్ సహకారం ఉంటుందని తెలిపారు. మా స్టర్ ప్లాన్‌పై చర్చించడానికి సింగపూర్ మంత్రి ఈశ్వరన్ ఈ నెల 8న హైదరాబాద్‌కు వచ్చే అవకాశం ఉందని చెప్పారు. అభివృద్ధి జరిగితే జనాభా నియంత్రణ జరుగుతుందన్నారు. -
జపాన్ అనుభవాలు మీడియాతో పంచుకున్న బాబు
-
''జపాన్ లో పలు సంస్థల కార్యకలాపాల అధ్యయనం''
-
ఉద్యోగాలు చేసి పిల్లల్ని కనడం మానేస్తారేమో:బాబు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే అంశంపై తాను జపాన్ పర్యటనకు వెళ్లినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. సోమవారం ఆయన జపాన్ పర్యటన వివరాలను మీడియాకు వెల్లడించారు. ఆ దేశంలో పలు ప్రైవేటు కంపెనీ ప్రతినిధులతో సమావేశమయ్యానని తెలిపారు. జపాన్ లో ఆర్థికంగా పుంజుకుంటున్న ప్రాంతాల్లో తమ బృందం పర్యటించిందని ఆయన అన్నారు. వ్యవసాయ ఆధారిత పరిశ్రమల కోసం ఒప్పందం చేసుకున్నామని ఈ సందర్బంగా బాబు తెలిపారు. దీంతోపాటుగా జపాన్ లో పలు సంస్థల కార్యకలాపాలను అధ్యయనం చేశామన్నారు. అనేక అవాంతరాలను, అడ్డంకులను జపాన్ అధిగమించిందని ఆయన అన్నారు. క్రమశిక్షణ, నిరంతర శ్రమతో జపాన్ గణనీయ అభివృద్ధిని సాధించిందన్నారు. నమ్మకం పెరిగితే జపనీయులు అందిస్తారన్నారు. కొత్త రాజధాని నిర్మాణంలో భాగస్వామ్యములు అవుతామని జపాన్ కంపెనీలు చెప్పాయన్నారు. అయితే అనేక అంశాల్లో అభివృద్ధి సాధించిన జపాన్ క్రమబద్దీకరణలో మాత్రం విఫలమైందన్నారు. అభివృద్ధితో మహిళలకు ఉద్యోగాలు వస్తాయని బాబు అన్నారు. మహిళలకు ఉద్యోగాలు వస్తే.. ఇగో ప్రాబ్లెల్స్ కూడా వస్తాయన్నారు. అక్కడ నుంచి పెళ్లిళ్లు చేసుకోవడం మానేసి పిల్లల్ని కనడం మానేస్తారని బాబు చమత్కరించారు. తాను గతంలో కుటుంబ నియంత్రణను బాగా ప్రోత్సహించానని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. కొత్త రాజధాని నిర్మాణంలో భాగస్వాములు అవుతాయని జపాన్ కంపెనీలు చెప్పాయని బాబు తెలిపారు. నాలుగువేల మెగావాట్ల విద్యుత్ కేంద్రంపై ఎంఓయూ జరిగిందని.. 10 వేల మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తికి సాఫ్ట్ బ్యాంక్ ముందుకొచ్చిందన్నారు. భారత్ చాలా అనుకూలమైన దేశమని ఆ బ్యాంకు అధిపతి తనతో చెప్పినట్లు ఆయన తెలిపారు. తీరప్రాంతాన్ని లాజిస్టిక్ హబ్ గా తయారుచేస్తామన్నారు. మూడు యూనివర్శిటీల్లో జపనీస్ భాషను ప్రవేశపెడతామన్నారు. తన జపాన్ పర్యటన విజయవంతమైందని బాబు తెలిపారు. -
'జపాన్ పర్యటనకు వెళ్లి బాబు ఏం తెచ్చారో చెప్పాలి'
-
'జపాన్ పర్యటనకు వెళ్లి బాబు ఏం తెచ్చారో చెప్పాలి'
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో నంబరు 398 తేవడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. భూముల రిజిస్ట్రేషన్లపై ఆంక్షలు విధిస్తూ ఈ జీవోను విడుదల చేయడంపై వైఎస్సార్ సీపీ నేత అంబటి రాంబాబు మండిపడ్డారు. ఆ జీవోను వెంటనే రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. పాకిస్థాన్ లాంటి నిరంకుశపాలనలో కూడా ఇలాంటి జీవోలు ఇవ్వరని అంబటి ఎద్దేవా చేశారు. ప్రభుత్వం శుక్రవారం విడుదల చేసిన 398 జీవోతో ఏపీలో భూ కుంభకోణాలకు దారి తీసే ప్రమాదం ఉందన్నారు. చంద్రబాబు వ్యతిరేకి అని చెప్పడానికి ఈ జీవోనే తాజా తార్కాణమని ఆయన విమర్శించారు. తన తాబేదారులకు మేలు చేయడానికే చంద్రబాబు జీవో తెచ్చారన్నారు. జపాన్ పర్యటనకు వెళ్లి బాబు ఏం తెచ్చారో చెప్పాలని అంబటి ప్రశ్నించారు. ఆయనతో జపాన్ కు వెళ్లిన నాయకులందరికీ అక్కడ వ్యాపారులున్నాయన్నారు. చంద్రబాబు విదేశీ టూర్ల ప్రచారం బారెడు- పని జానెడులా ఉందని విమర్శించారు. ఆయన విదేశీ టూర్లు ఆపి రాష్ట్ర ప్రయోజనాల గురించి ఆలోచించాలని హితవు పలికారు. భూములు ఇవ్వకపోతే రాజధాని తరలిపోతుందనడం కేంద్రమంత్రి వెంకయ్య నాయుడుకు తగదని అంబటి తెలిపారు. -
బాబు గారి జపాన్ పర్యటన ముగిసింది!
-
నేడు హైదరాబాద్ రానున్న చంద్రబాబు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జపాన్ పర్యటన ముగిసింది. శనివారం అర్ధరాత్రి చంద్రబాబు హైదరాబాద్ రానున్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి జపాన్ సానుకూలంగా ఉందని ముఖ్యమంత్రి కార్యాలయం పేర్కొంది. ఈ నెల 24న 19 మంది ప్రతినిధి బృందంతో చంద్రబాబు జపాన్ వెళ్లారు. చంద్రబాబు జపాన్‌లో పలువురు పారిశ్రమికవేత్తలను కలిశారు. -
ఐసేకీ, టోయోడా ప్రతినిధులతో చంద్రబాబు భేటీ
హైదరాబాద్: జపాన్‌లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 5వ రోజు పర్యటన కొనసాగుతోంది. ఈ పర్యటనలో భాగంగా ఐసేకీ, టోయోడా ప్రతినిధులతో చంద్రబాబు శుక్రవారం భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చే పరిశ్రమలపై తమకు ఆసక్తి ఉందని ఐసేకీ, టొయోడా ప్రతినిధులు తెలిపారు. ఇప్పటికే చైనాలో రెండు పెద్ద పరిశ్రమలు స్థాపించామని చెప్పారు. ఈ విషయమై భారత్‌లో కూడా రెండేళ్ల కిందట సర్వే చేశామని ఐసేకీ, టొయోడా ప్రతినిధులు గుర్తుచేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. తమ ప్రాంతంలో వ్యవసాయ దిగుబడి చాలా తక్కువగా ఉందని చెప్పారు. తాము అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలకు తీసుకెళ్లాలనుకుంటున్నామని ఆయన తెలిపారు. రైతులు కొత్త టెక్నాలజీ అనుసంధానం చేసుకోవడంలో చొరవ చూపిస్తున్నారని సీఎం చంద్రబాబు తెలిపారు. కాగా, చంద్రబాబు నాయుడు నవంబర్ 24వ తేదీ నుంచి వారం రోజుల పాటు జపాన్ పర్యటనకు వెళ్లగా, ఆయనవెంట పారిశ్రామిక ప్రతినిధులు కూడా వెళ్లిన సంగతి తెలిసిందే. -
‘సుమితొమొ’తో 4 ఒప్పందాలు
జపాన్ కంపెనీలతో చంద్రబాబు మంతనాలు ⇒ విద్యుత్ ఉత్పత్తి, రాజధానిలో మౌలిక సదుపాయాలు, ఫుడ్ ప్రాసెసింగ్, వ్యవసాయ యాంత్రీకరణ రంగాల్లో సుమిటోమీ సంస్థతో ఒప్పందాలు ⇒ యొకోహోమా పోర్టు సందర్శన..రాష్ట్రంలో పోర్టుల అభివృద్ధిపై అధ్యయనం ⇒ నేడు జపాన్ ప్రధానితో చంద్రబాబు భేటీ.. రేపు రాష్ట్రానికి తిరుగుముఖం సాక్షి, హైదరాబాద్: జపాన్ దేశ పర్యటనలో ఉన్న ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఆ దేశానికి చెందిన ‘సుమితొమొ’తో సంస్థతో గురువారం నాలుగు ఒప్పందాలు కుదుర్చుకున్నారు. విద్యుత్ ఉత్పత్తి, కొత్త రాజధానిలో మౌలిక సదుపాయాలు, ఫుడ్ ప్రాసెసింగ్, వ్యవసాయ యాంత్రీకరణ అంశాలపై ఈ ఒప్పందాలు జరిగాయి. వాటిపై రాష్ట్ర ప్రభుత్వం తరఫున మునిసిపల్, పరిశ్రమలు, ఇంధన శాఖల ముఖ్య కార్యదర్శులు, సుమితొమొ సంస్థ అధికారులు సంతకాలు చేశారు. చంద్రబాబు నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ బృందం గత నాలుగు రోజులుగా జపాన్‌లో పర్యటిస్తోంది. ఈ బృందం గురువారం నాడు సుమిటోమో సంస్థను సందర్శించినట్టు ప్రభుత్వం అధికారిక ప్రకటనలో తెలిపింది. శ్రీకాకుళం జిల్లా బారువలో 4,000 మెగావాట్ల అల్ట్రా సూపర్ క్రిటికల్ థర్మల్ విద్యుత్ కేంద్రం నిర్మాణం వల్ల రాష్ట్రం సంపూర్ణంగా మిగులు విద్యుత్ ఉండే రాష్ట్రంగా మారుతుందని.. ‘సుమితమొ’ సంస్థ సహకారంతో ఈ విద్యుత్ కేంద్రం నిర్మాణానికి జైకా, నెడో, జేబీఐసీ ఆర్థిక సాయం అందిస్తున్నాయని సీఎం అధికారిక ప్రకటనలో తెలిపారు. ‘కొత్త రాజధాని నగరంలో రవాణా, తాగునీటి సరఫరా, ఘన వ్యర్థాల నిర్వహణ, గృహావసరాలకు సహజ వాయు సరఫరా తదితర సౌకర్యాల కల్పనకు ‘సుమితొమొ’ సహకరిస్తుంది. చిన్న కమతాల సాగుకు పనికొచ్చే ఆధునిక యంత్రసామగ్రి సరఫరా, ఎరువులు, రసాయనాల వినియోగం, వ్యవసాయం యాంత్రీకరణ కేంద్రాల ఏర్పాటు, ఆధునిక సాగు విధానాలను అందించేందుకు ఆ సంస్థ ముందుకు వచ్చిందని పేర్కొన్నారు. తమ సంస్థకు ఏపీ కీలకమైన రాష్ట్రమని, విజ్జేశ్వరం పవర్ ప్లాంట్ ఏర్పాటులో భాగస్వామ్యం కూడా ఉందని ఆ సంస్థ చైర్మన్ కజువా ఓహ్మోరి చెప్పినట్లు ప్రకటనలో తెలిపారు. వ్యవసాయ యాంత్రీకరణలో పేరెన్నికగన్న వరి ఉత్పత్తి కంపెనీ క్యుబోటో కార్పొరేషన్‌ను చంద్రబాబు బృందం సందర్శించింది. కంపెనీ డెరైక్టర్ యూచీ కిటావో తమ సంస్థ ఉత్పత్తుల గురించి వివరించారు. ఏపీలో ఆధునిక సాగు విధానాలు ప్రవేశపెట్టేందుకు, నైపుణ్యాభివృద్ధిలో శిక్షణ ఇచ్చేందుకు సహకరించాలని బాబు ఆ సంస్థను కోరారు. యొకోహోమా పోర్టు సందర్శన.. జపాన్‌లో యొకోహోమా పోర్టును చంద్రబాబు బృందం సందర్శించింది. జపాన్‌లో తయారైన ఆటోమొబైల్ పరికరాలను ఈ పోర్టు నుంచే విదేశాలకు ఎగుమతి చేస్తారు. జపాన్‌లో అనుసరిస్తున్న పన్ను విధానం, ఓడరేవుల ద్వారా జరుగుతున్న ఎగుమతి, దిగుమతుల గురించి చంద్రబాబు బృందానికి టకాషీ వివరించారు. హుద్‌హుద్ తుపాను వల్ల తీవ్రంగా దెబ్బతిన్న విశాఖ పోర్టు కంటెయినర్ టెర్మినల్ పునర్నిర్మాణంపై అక్కడి అధికారులతో బాబు చర్చించారు. జైకా ప్రతినిధులతో భేటీ జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ (జైకా) ప్రతినిధులతో చంద్రబాబు బృందం భేటీ అయ్యింది. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ.. భారతదేశంతో జపాన్ సంబంధాలు గతంలో భిన్నంగా ఉన్నప్పటికీ భవిష్యత్తులో మాత్రం ఉజ్వలంగా ఉంటాయన్నారు. తమది కొత్త రాష్ట్రమని, అందులో కొత్త రాజధాని నిర్మాణంతో పాటు పెట్టుబడులకు అనేక నూతన అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. పెట్టుబడుల గమ్యస్థానంగా ఏపీని తీర్చిదిద్దేందుకు మాస్టర్ ప్లాన్ తయారీలో సహకరించాలని కోరారు. ఏపీలో ప్రత్యేకంగా జైకా కార్యాలయాన్ని నెలకొల్పాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో జపనీస్ ఇండస్ట్రియల్ పార్కుకు ఒక స్పెషల్ అథారిటీని ఏర్పాటు చేస్తానని సీఎం తెలిపారు. రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లో వాటర్ ట్రీట్మెంట్కు సహకరిస్తామని జపాన్ బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ కో-ఆపరేషన్ (జేబీఐసీ) సీఈఓ వటానబే చెప్పారు. కొత్త రాజధాని నిర్మాణంలో, ఎయిర్‌పోర్టులు, పోర్టుల అభివృద్ధిలో జపాన్ కంపెనీలు భాగస్వాములు కావటానికి కావల్సిన పరపతి సౌకర్యాలను కల్పించాలని ఆయనను చంద్రబాబు కోరారు. ఆయన శుక్రవారం నాడు జపాన్ ప్రధానమంత్రి షింజో అబేతో భేటీ కానున్నారు. శనివారం రాష్ట్రానికి తిరుగుప్రయాణం కానున్నారు. ఈ పర్యటనలో చంద్రబాబు వెంట మంత్రులు యనమల రామకృష్ణుడు, పొంగూరి నారాయణ, ఎంపీలు గల్లా జయదేవ్, సి.ఎం.రమేష్, ప్రభుత్వ ప్రతినిధి కంభంపాటి రామ్మోహనరావు, ప్రభుత్వ సలహాదారులు పరకాల ప్రభాకర్, లక్ష్మీనారాయణ, సీఎం ముఖ్య కార్యదర్శి సతీష్‌చంద్ర, సీనియనిర్ ఐఏఎస్ అధికారులు ఎస్.పి.టక్కర్, జె.ఎస్.పి.ప్రసాద్, ఇంటెలిజెన్స్ డీజీపీ అనురాధ ఉన్నారు. -
జపాన్ వెళుతూ సీఎం సంతకం.. జీవోల జారీ
-
బాదుడే బాదుడు
ఏపీ సర్కారుకు ఏడాదికి రూ.1200 కోట్ల రాబడి జపాన్ వెళుతూ సీఎం సంతకం.. జీవోల జారీ సాక్షి, హైదరాబాద్: సీఎం చంద్రబాబుఒకే ఒక్క సంతకంతో ఏడాదికి అదనంగా రూ.1,200 కోట్లు ఖజానాకు ఆదాయం వచ్చే నిర్ణయం తీసుకున్నారు. భూములు, స్థలాల క్రయవిక్రయాలకు సంబంధించిన స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు, కుటుంబాల మధ్య సెటిల్మెంట్, గిఫ్ట్ (భూ కానుక) డీడ్ల ఫీజులను పెంచే ఫైలుపై సీఎం జపాన్ పర్యటనకు వెళ్లే ముందు సంతకం చేశారు. ఆ మేరకు రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్.పి.సింగ్ బుధవారం మూడు జీవోలను జారీ చేశారు. ఈ పెంపు వెంటనే (బుధవారం నుంచే) అమల్లోకి వస్తున్నట్లు స్పష్టం చేశారు. దీంతో భూములు, స్థలాలు క్రయ విక్రయదారులపై ఏడాదికి సుమారు రూ.1200 కోట్ల మేర అదనపు భారం పడుతుందని అంచనా. జీవోల ప్రకారం.. స్టాంపు డ్యూటీ ప్రస్తుతం ఉన్న 4 శాతం నుంచి 5 శాతానికి పెరిగింది. రిజిస్ట్రేషన్ ఫీజు 0.5 శాతం నుంచి 1 శాతానికి పెరిగింది. కుటుంబాల మధ్య జరిగే సెటిల్మెంట్ డీడ్లు, గిఫ్ట్ డీడ్లపై ప్రస్తుతం ఉన్న ఒక శాతం స్టాంపు డ్యూటీని రెండు శాతానికి పెంచుతూ జీవో జారీ అయ్యింది. విభజిత ఆంధ్రప్రదేశ్‌లో స్టాంపులు, రిజస్ట్రేషన్ల ద్వారా వచ్చే ఆదాయం ఇప్పటికే బాగా పెరిగింది. నూతన రాజధాని నిర్మాణం జరిగే కృష్ణా, గుంటూరు జిల్లాల్లో భూముల క్రయ విక్రయాలు బాగా పెరగడంతో ఆదాయం కూడా భారీగా పెరిగింది. ఆదాయం పెంపుపై దృష్టిసారించిన ప్రభుత్వం.. వస్తున్న చోటే మరింత ఆదాయం పొందాలన్నట్టుగా స్టాంపులు, రిజిస్ట్రేషన్ల ఫీజులను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. గతంలో సెటిల్మెంట్, గిఫ్ట్ డీడ్లపై స్టాంపు డ్యూటీని కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం తగ్గించింది. కానీ చంద్రబాబు ప్రభుత్వం వాటిపై కూడా స్టాంపు డ్యూటీని పెంచింది. పెంపు వివరాలు.. (శాతాల్లో) రంగం ఇప్పటివరకు ఇకపై స్టాంపు డ్యూటీ 4 5 రిజిస్ట్రేషన్ ఫీజు 0.5 1 కుటుంబసభ్యుల మధ్య ఒప్పందం 1 2 ఇతరుల మధ్య ఒప్పందం 2 3 రక్త సబంధీకులకు కానుకలు 1 2 ఇతరుల మధ్య కానుకలు 4 5 భాగస్వామ్య ఒప్పందాలు(కుటుంబసభ్యులు) 0.5 1 ఇతరుల మధ్య భాగస్వామ్య ఒప్పందాలు 1 2 -
అద్భుతాలు సాధించవచ్చు:చంద్రబాబు
-
అద్భుతాలు సాధించవచ్చు:చంద్రబాబు
హైదరాబాద్: భారతీయ మార్కెట్లకు జపాన్ పెట్టుబడులు తోడైతే అద్భుతాలు సాధించవచ్చని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఏపీలో స్మార్ట్ సిటీల నిర్మాణం, ఆధునిక వ్యవసాయం, సాంకేతిక అంశాలలో జపాన్ పెట్టుబడిదారుల సహకారాన్ని ఆయన కోరారు. మూడో రోజు జపాన్ పర్యటనలో ఉన్న చంద్రబాబు శాన్ నో స్టార్మ్ రిజర్వాయర్‌ను సందర్శించారు. ప్లడ్ మేనేజ్మెంట్ విధానాలను పరిశీలించారు. అంతేకాకుండా, నకాటా వేస్ట్ మేనేజ్మెంట్ సైట్‌ను సందర్శించారు. 12 లక్షల జనాభా ఉన్న ప్యుకోకా నగరంలో ఘన వ్యర్ధాల నిర్వహణకు తీసుకుంటున్న చర్యల గురించి అధికారులు బాబుకు వివరించారు. నకాటా వేస్ట్ మేనేజ్మెంట్ విధానం పర్యావరణ పరిరక్షణకు ఎంతో దోహదపడుతుందని ఈ సందర్భంగా చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఏపీ కొత్త రాజధానిలో, 13 స్మార్ట్ సిటీలలో వేస్ట్ మేనేజ్మెంట్ను అమలు చేస్తామని ఆయన చెప్పారు. వేస్ట్ మేనేజ్మెంట్లో జపాన్ అనుసరించిన విధానం ప్రపంచానికే ఆదర్శమని చంద్రబాబు అన్నారు. ఏపీ రాజధాని నిర్మాణంలో తాముకూడా పాలుపంచుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్యుకోకా నగర డిప్యూటీ మేయర్ అత్సుహితో చెప్పారు. ** -
వారంలోనే అనుమతులన్నీ
-
వీక్ పాయింట్... వారంలోనే ఓకే
* ఏడు రోజుల్లోనే పరిశ్రమలకు అనుమతులన్నీ ఇచ్చేస్తాం * ఎనిమిదో రోజు నుంచే పనులు ప్రారంభించొచ్చు * జపాన్ కంపెనీకి సీఎం చంద్రబాబు హామీ * మోటార్ల తయారీ సంస్థ ఎన్ఐడీఈసీ చైర్మన్‌తో భేటీ * రాష్ట్రంలో పరిశ్రమ ఏర్పాటు చేయాల్సిందిగా విజ్ఞప్తి *ఏపీలో వ్యాపారానికి ఉన్న సానుకూలతలపై వివరణ సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో పరిశ్రమ ఏర్పాటుకు ముందుకు వస్తే అందుకు సంబంధించిన అనుమతులన్నీ వారం రోజుల్లోనే మం జూరు చేస్తామని, ఎనిమిదో రోజు నుంచే పనులు ప్రారంభించ వచ్చని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జపాన్‌లోని ప్రముఖ మోటార్ల తయారీ కంపెనీ ఎన్ఐడీఈసీ చైర్మన్ షిహెనోబు నాగమోరికి హామీ ఇచ్చారు. ప్రపంచంలోనే భారతదేశం వేగంగా అభివృద్ధి చెందుతోందని, అందులో పెట్టుబడులకు ఆకర్షణీయమైన గమ్యస్థానం తమ రాష్ట్రమని సీఎం వివరించారు. జపాన్ పర్యటనకు వెళ్లిన చంద్రబాబు నేతృత్వంలోని బృందం.. భార త కాలమానం ప్రకారం సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు ఒసాకా నగరంలోని కన్సాయ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంది. జపాన్‌లో సోమవారం జాతీయ సెలవుదినం అయినప్పటికీ అక్కడి ప్రభుత్వ అధికారులు, వివిధ సంస్థల ప్రతి నిధులు చంద్రబాబు బృందానికి ఘన స్వాగతం పలికినట్లు.. హైదరాబాద్‌లో ప్రభుత్వ సమాచార సలహాదారు కార్యాలయం సోమవారం జారీ చేసిన ప్రకటనలో తెలిపింది. ఆ ప్రకటనలోని సమాచారం మేరకు.. చంద్రబాబు బృందం ఎన్ఐడీఈసీ చైర్మన్ షిహెనోబు నగమొరితో భేటీ అయ్యింది. ఈ సందర్భంగా.. తమ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సుహృద్భావ సంబంధాలు కలిగి ఉండటమే కాకుండా అభివృద్ధి విషయంలో చిత్తశుద్ధితో ఉన్నాయని చంద్రబాబు చెప్పారు. అయి తే తాము కొన్నేళ్ల క్రితం భారతదేశంలో వ్యాపారం, వాణిజ్యం కోసం ప్రయత్నించామని, కానీ అనుమతుల మంజూరులో జాప్యం, అవినీతి వల్ల తమ కార్యకలాపాలను విస్తరించలేకపోయామని నాగమోరి అన్నారు. దేశంలో ప్రస్తుతం అలాంటి పరిస్థితులు లేవని చెప్పిన చంద్రబాబు.. కేంద్రం, రాష్ర్టంలో సుస్థిర ప్రభుత్వాలున్నాయని, అవి పారదర్శక విధానాలు అవలంబిస్తున్నాయని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవలి జపాన్ పర్యటన సందర్భంగా మిమ్మల్ని కలిశారంటూ బాబు గుర్తుచేశారు. తాము నిరంతర విద్యుత్ సరఫరా చేస్తున్నామని, రోడ్డు, జల మార్గాలు అందుబాటులో ఉన్నాయని, ఎగుమతులు, దిగుమతులతో పాటు వర్తక, వాణిజ్యాలకు రాష్ట్రం ఎంతో అనువుగా ఉంటుందని చెప్పారు. ఈ మేరకు జపనీస్ భాషలో రూపొం దించిన బ్రోచర్లను అందచేయటంతో పాటు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇచ్చారు. ఒక డాక్యుమెంటరీని సైతం ప్రదర్శించారు. జపాన్‌లో ప్రసిద్ధి గాంచిన ఇకెబానా ఆర్ట్‌తో ప్రారంభమైన డాక్యుమెంటరీ, ఆంధ్రప్రదేశ్‌కు స్వాగతమంటూ చంద్రబాబు జపనీస్‌లో చేసిన వ్యాఖ్యతో ముగి యటం జపాన్ అధికారులను, ఆ కంపెనీ ప్రతి నిధులను విశేషంగా ఆకట్టుకుందని సమాచార సలహాదారు కార్యాలయం పేర్కొంది. ఎన్మార్ కూ బాబు ఆహ్వానం అంతకుముందు ఎన్మార్ వ్యవసాయ యంత్రాలు, పనిముట్ల తయారీ సంస్థను చంద్రబాబు బృందం సందర్శించింది. ఏపీలో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు చేపట్టాల్సిన యాంత్రీకరణ విధానాలను బృందం అక్కడ పరిశీలించింది. జపాన్‌లో వ్యవసాయ ఆధునీకరణపై సంస్థ ఎండీ నొకి కొబాయెషి వివరించారు. యాంత్రీకరణ వల్ల తమ దేశంలో వ్యవసాయం సులభతరమైందని ఆయన చెప్పారు. భారతదేశంలోని మురుగప్పన్ సంస్థతో తమకు ఇప్పటికే ఒప్పందం ఉందని తెలిపారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ దేశంలోనే పొడవైన సముద్ర తీరం ఉన్న తమ రాష్ర్టంలో ఎన్మార్ కంపెనీ యంత్రాల తయారీ పరిశ్రమను ప్రారంభిస్తే ఆసియా దేశాలతో వర్తక, వాణిజ్యాలు విస్తరిస్తాయని చెప్పారు. తొలిరోజు పర్యటనలో చంద్రబాబు వెంట మంత్రులు యనమల రామకృష్ణుడు, పొంగూరి నారాయణ, ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి కంభంపాటి రామ్మోహనరావు, ప్రభుత్వ సమాచార సలహాదారు డాక్టర్ పరకాల ప్రభాకర్, ఐటీ సలహాదారు జె.సత్యనారాయణ, ఎంపీలు గల్లా జయదేవ్, సీఎం రమేష్, సీఎం కార్యాలయ ముఖ్య కార్యదర్శి సతీష్ చంద్ర, సీనియర్ అధికారులు ఎస్పీ టక్కర్, జేఎస్వీ ప్రసాద్, ఏఆర్ అనూరాధ ఉన్నారు. భారత్‌లోనూ కార్యకలాపాలు: నగమొరి నగమొరి మాట్లాడుతూ ప్రపంచంలో 53 శాతం విద్యుత్‌ను మోటార్లే వినియోగిస్తున్నాయని, వాటి పనితీరును మెరుగుపరిస్తే విద్యుత్ గణనీయంగా ఆదా చేయవచ్చని చెప్పారు. తాము ఈ అంశంపైనే ప్రధానంగా దృష్టి సారించామని తెలిపారు. చిన్న, పెద్ద మోటార్ల తయారీ మార్కెట్లో ప్రపంచంలో 60 శాతం వాటా తమదేనని, గత 30 సంవత్సరాలుగా చైనాలో తాము వ్యాపారం నిర్వహిస్తున్నామని చెప్పారు. భారత్‌లో కూడా తమ కార్యకలాపాలు ప్రారంభించి జపాన్‌కు విదేశీ మారకద్ర వ్యం సమకూరుస్తామని నాగమోరి పేర్కొన్నారు. -
జపాన్ పర్యటనకు బయలుదేరిన బాబు
-
ఇది పెట్టుబడుల బాట
సీఎం జపాన్ పర్యటనపై రాష్ట్ర ప్రభుత్వ ప్రకటన నేటి నుంచి 29వ తేదీ వరకు జపాన్‌లో చంద్రబాబు బృందం పర్యటన వివిధ సంస్థల సీఈవోలతో భేటీ ‘సన్‌రైజ్ స్టేట్ ఆఫ్ ఏపీ’ పేరుతో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్న సీఎం 10 లక్షల ఎకరాల ల్యాండ్ బ్యాంక్ ఉందని చెప్పబోతున్న ముఖ్యమంత్రి అది ప్రభుత్వ భూమా? ప్రైవేటు భూమా? వెల్లడించని వైనం పెట్టుబడులకున్న అవకాశాలపై లఘు చిత్రాన్ని రూపొందించిన సర్కారు సాక్షి, హైదరాబాద్: రాజధాని నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న భూ సమీకరణను రైతులు ఒకపక్క వ్యతిరేకిస్తున్నా.. రాష్ట్రంలో 10 లక్షల ఎకరాల ల్యాండ్ బ్యాంక్ ఉంది.. పెట్టుబడులు పెట్టండంటూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మరోపక్క విదేశీ పెట్టుబడిదారులను ఆహ్వానిస్తున్నారు. ఆ విధంగా పెట్టుబడులు పెట్టేవారికి భూ కేటాయింపుతో పాటు అనేక రాయితీలు, ప్రోత్సాహకాలు ఇస్తామని, మౌలికసదుపాయాలు ఏర్పాటు చేస్తామని జపాన్‌కు బంపర్ ఆఫర్ ఇవ్వబోతున్నారు. ఆదివారం అర్ధరాత్రి ఆయన ప్రభుత్వ ప్రతినిధులు, పారిశ్రామిక వేత్తల బృందంతో జపాన్ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. సీఎం చంద్రబాబునాయుడు రాష్ట్రంలో పెట్టుబడులకున్న సానుకూలాంశాలను అక్కడి ప్రభుత్వానికి, వివిధ కంపెనీలు, వాణిజ్య సంస్థల ప్రతినిధులకు వివరిస్తారని రాష్ట్ర ప్రభుత్వ సమాచార సలహాదారు పరకాల ప్రభాకర్ వెల్లడించారు. జపాన్ పెట్టుబడి దారులకు వివరించేందుకు ప్రత్యేక పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌ను కూడా రూపొందించారు. అందులో పేర్కొన్న పది లక్షల ఎకరాలూ ప్రభుత్వ భూమా? లేక ప్రైవేటు భూమా? అనేది ఎక్కడా స్పష్టం చేయకపోవడం గమనార్హం. ‘సన్‌రైజ్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్’ పేరిట రూపొందించిన ఈ ప్రజెంటేషన్‌లో రాష్ట్రంలోని 13 జిల్లాల్లో ఉన్న అన్ని ప్రత్యేకాంశాలను పొందుపరిచారు. దేశంలో ఆంధ్రప్రదేశ్.. తూర్పు, ఆగ్నేయ దేశాలైన జపాన్, చైనా, థాయ్‌లాండ్, మలేసియా, సింగపూర్, శ్రీలంకలకు వ్యూహాత్మక ప్రాంతంగా ఉందని, పారిశ్రామిక, వ్యాపారానుకూల వాతావరణం రాష్ట్రంలో ఉందని అందులో వివరించారు. ‘దేశంలో మొట్టమొదటి తీరప్రాంత పారిశ్రామిక కారిడార్‌గా విశాఖపట్నం-చెన్నై రూపొందుతోంది. ఇది గేట్ వే టూ ఈస్ట్‌గా మారుతుంది. కొల్కతా నుంచి చెన్నై వరకు ఉన్న కారిడార్‌లో ఏపీ లోని తొమ్మిది జిల్లాల్లో ఉన్న తీరప్రాంతమే కీలకం..’ అని పేర్కొన్నారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌తో పాటు ఈ మేరకు ఒక లఘు చిత్రాన్ని కూడా రూపొందించి బాబు బృందం జపాన్‌కు తీసుకువెళ్లారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌లోని వివరాలు.. 10 లక్షల ఎకరాలతో ల్యాండ్ బ్యాంక్ ‘రాష్ట్రంలో పారదర్శకమైన భూకేటాయింపు విధానం అమలుచేస్తున్నాం. 10 లక్షల ఎకరాల ల్యాండ్ బ్యాంకు ఉంది. (ప్రభుత్వ భూమా, ప్రైవేటు భూమా ?అన్నది వివరించలేదు.) ఈ భూముల ధరలూ అందుబాటులో ఉన్నాయి. అమ్మకానికి లేదా దీర్ఘకాలిక లీజుకు వీలుగా కేటాయింపు విధానం ఉంటుంది. పెట్టుబడులు పెట్టేవారు కొనే భూములకు స్టాంప్ డ్యూటీ పూర్తిగా వెనక్కి తిరిగి చెల్లిస్తాం. అందుబాటులో ఉన్న భూమి వివరాలను ఏపీ గవర్నమెంట్ పోర్టల్‌లో చూసుకోవచ్చు..’ అని పేర్కొన్నారు. విశాఖలో 20 వేల ఎకరాలు, కాకినాడలో 10 వేలు, మచిలీపట్నంలో 5 వేలు, దొనకొండలో 40 వేలు, ఓర్వకల్లులో 32 వేలు, నాయుడుపేటలో 2,500, కష్ణపట్నం సెజ్‌లో 2 వేలు, హిందూపూర్‌లో 10 వేలు, కడపలో 20 వేలు, చిత్తూరులోని శ్రీసిటీ సెజ్‌లో వెయ్యి ఎకరాల భూమి ఉందని తెలిపారు. (ఇవన్నీ కలిపితే 1.37 లక్షల ఎకరాలు మాత్రమే కాగా మిగతా భూమి ఎక్కడుంది? ప్రభుత్వానిదా? ప్రైవేటుదా? అనే వివరాలు లేవు) ‘ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలో ఇండస్ట్రియల్ పార్కులు ఏర్పాటు చేయనున్నాం. ప్రైవేటు పారిశ్రామికపార్కులు, టౌన్‌షిప్పుల ఏర్పాటుకు ప్రోత్సాహం అందిస్తాం. పెట్టుబడులను ప్రోత్సహించేలా అనేక రాయితీలతో కూడిన పారిశ్రామిక, పోర్టుల విధానం ఉంటుంది. మౌలిక సదుపాయాలు, రాయితీల కల్పనతో ఐటీ విధానం ఉంటుంది. ఈఎస్డీఎం ఎకో సిస్టమ్‌తో ఎలక్ట్రానిక్ పాలసీ ద్వారా ఆయా పరిశ్రమల అభివద్ధికి మార్గాలు వేస్తాం. ప్రపంచస్థాయి రాజధాని నిర్మిస్తాం. 14 స్మార్ట్ సిటీలు, 3 మెగాసిటీలు, టూరిజమ్ సర్క్యూట్, 2 ఎల్ఎన్జీ సర్క్యూట్లు, 3 అంతర్జాతీయ విమానాశ్రయాలు, 8 డొమెస్టిక్ విమానాశ్రయాలు, 3 మెట్రో రైలు ప్రాజెక్టులు, కొత్త పోర్టులు, సౌర, పవన విద్యుదుత్పత్తి ప్రాజెక్టులకు వీలుగా ప్రణాళికలు ఉన్నాయి. మచిలీపట్నంలో పెట్రో కెమికల్ ప్రాజెక్టు, ఏర్పేడు, కందుకూరు, దొనకొండ, నాయుడుపేట, కర్నూలుల్లో పారిశ్రామిక టౌన్‌షిప్పులు, విశాఖపట్నం, కాకినాడ, హిందూపూర్లలో ఎలక్ట్రానిక్ క్లస్టర్లు, గుంటూరు, అనంతపురం, కర్నూలుల్లో ఇంటిగ్రేటెడ్ టైక్స్‌టైల్ పార్కులు, అన్ని జిల్లా కేంద్రాల్లో మెగా ఫుడ్ పార్కులు, విశాఖపట్నంలో ఐటీ హబ్, మధ్య కోస్తా జిల్లాల్లో మెరైన్ హబ్, చిత్తూరు, నెల్లూరులతో ఆటో హబ్ ఏర్పాటు చేస్తాం. లోహ పరిశ్రమలు, ఉద్యాన పంటలు, రక్షణ, ఏరోస్పేస్‌లకు ఆలవాలంగా రాయలసీమ ప్రాంతాలు ఉండనుంది..’ అని వివరించారు. 2022 నాటికి దేశంలో మూడో స్థానం ‘2022 నాటికి ఏపీని దేశంలోనే మూడో స్థానానికి, 2029 నాటికి అన్నిటికన్నా అగ్రస్థానంలోకి తీసుకువెళ్లనున్నాం. ఇందుకోసం ప్రాథమిక, పట్టణ, పారిశ్రామిక, మౌలిక సదుపాయాలు, సేవలు, నైపుణ్యాల అభివృద్ధి, సామాజిక సాధికారత మిషన్లను, నీరు, గ్యాస్, రోడ్, పవర్, ఫైబర్ గ్రిడ్లను ఏర్పాటుచేశాం. బడి పిలుస్తోంది, నీరు..చెట్టు, పేదరికంపై గెలుపు, పొలం పిలుస్తోంది, పరిశుభ్రత-ఆరోగ్యం అనే ప్రచారోద్యమాలు చేపట్టాం. దేశంలోని సగానికి పైగా నౌకా ఎగుమతులు ఏపీనుంచే సాగుతున్నాయి. బెరైటీస్, మైకా, సున్నపురాయి నిక్షేపాలకు నిలయం. 2,950 సంస్థల ద్వారా 3.45 లక్షల మంది నైపుణ్యంకల యువకులు, విద్యార్థులు అందుబాటులో ఉన్నారు. ఫుడ్ ప్రాసెసింగ్, గనులు, ఫార్మా, ఆటోమొబైల్, ఇంజనీరింగ్ రంగాల్లో అత్యధిక అభివృద్ధికి అవకాశాలున్నాయి. పర్యాటక పరిశ్రమది రాష్ట్ర ఆదాయంలో కీలకపాత్ర. విశాఖపట్నం, గంగవరం, కష్ణపట్నం డీప్ సీ పోర్టులు, రానున్న ఐదేళ్లలో 17 వేల మెగావాట్ల ఉత్పత్తి ద్వారా జరగనున్న 24 గంటల నిరంతర విద్యుత్ సరఫరా, కృష్ణా, గోదావరి, తుంగభద్ర, పెన్నా నదులతో పుష్కలంగా ఉన్న నీటివనరులు, 1.20 లక్షల కిలోమీటర్ల విస్తారమైన రోడ్లు రాష్ట్రాభివృద్ధికి మూలకాలు. దేశంలోనే అభివృద్ది చెందుతున్న విశాఖపట్నం నగరం మొట్టమొదటి స్మార్ట్‌సిటీగా రూపొందబోతోంది. అత్యుత్తమ విద్యాసంస్థలు, వైద్యసంస్థలు, పర్యాటక ప్రాంతాలుండడంతోపాటు కొత్తగా మెట్రోరైళ్ల వ్యవస్థ ఏర్పాటుకాబోతోంది..’’ అని పవర్‌పాయింట్ ప్రజెంటేషన్‌లో పేర్కొన్నారు. -
ఒప్పందాలే ప్రధాన లక్ష్యం
బాబు బృందం జపాన్ పర్యటన వివరాలు వెల్లడించిన పరకాల ప్రభాకర్ హైదరాబాద్: కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడులను రాబట్టడమే సీఎం చంద్రబాబు జపాన్ పర్యటన లక్ష్యమని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్ అన్నా రు. చంద్రబాబు ఆధ్వర్యంలోని ప్రభుత్వ ప్రతి నిధి బృందం ఈ నెల 24వ తేదీ నుంచి 29వ తేదీ వరకు జపాన్‌లో పర్యటించనుందని తెలిపారు. ఈ సందర్భంగా పలు అవగాహనా ఒప్పందాలు చేసుకోనుందని చెప్పారు. జపాన్ పర్యటన బృం దంలో 18 మంది ప్రభుత్వ ప్రతినిధులు, మరో 35 నుంచి 40 మంది వివిధ పారిశ్రామికవర్గాల వారు ఉన్నారన్నారు. ఆదివారం సచివాల యంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో పరకాల మాట్లాడారు. సీఎం నేతృత్వంలో జపాన్ ప్రభుత్వంతో పాటు పలు సంస్థలతో.. ఆధునిక వ్యవసాయ యంత్రాల పనితీరు, విద్యుత్, పట్టణ మౌలిక వసతులు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, వ్యర్థాల నిర్వహణ తదితర అంశాలపై విస్తృతస్థాయి చర్చలు, అవగాహనా ఒప్పందాలు జరుగుతాయని చెప్పారు. పారిశ్రామిక, వాణిజ్య సంస్థల ప్రతినిధులతో పాటు బ్యాంకింగ్ రంగ ప్రముఖులతోనూ ప్రత్యేక సమావేశం ఉంటుందన్నారు. ముఖ్యంగా స్మార్ట్ గ్రిడ్‌ను ఎలా అభివృద్ధి చేయాలి, గ్యాస్ ఎనర్జీ మేనేజ్మెంట్ తదితర అంశాలపై ప్రముఖ సంస్థలైన జైకా, జెట్రో, జేపీఐసీ, జేపీసీసీ, నెడ్కో వంటి సంస్థలతో చర్చలు, అవగాహనా ఒప్పం దాలు ఉంటాయన్నారు. భారత్‌కు చెందిన ఐటీ ఫోరంతో, జపాన్ మేయర్లతో, వ్యాపార..వాణిజ్య మంత్రిత్వ శాఖతో ఏపీ ప్రతినిధులు సమావేశమవుతారని తెలిపారు. పరిశ్రమల మంత్రి మియజావాతోనూ భేటీ ఉంటుందన్నారు. సుమిటోమోతో నాలుగు ఒప్పందాలు జపాన్‌లోని ప్రముఖ సంస్థ సుమిటోమో కార్పొరేషన్‌తో ప్రధానమైన నాలుగు ఒప్పందాలు చేసుకోనున్నట్టు పరకాల చెప్పారు. అవి ఇలా.. ►అత్యాధునిక వ్యవసాయ పనిముట్లు, దిగుబడిని పెంచే వ్యవసాయ పద్ధతులు, సాంకేతిక అభివృద్ధి ►శ్రీకాకుళంలో నిర్మించతలపెట్టిన 4 వేల మెగావాట్ల థర్మల్ పవర్ ప్లాంటు ఏర్పాటు, నిధుల సమీకరణ, సాంకేతిక సహకారం ►రాజధాని నిర్మాణంలో స్మార్ట్ సిటీకి అవసరమయ్యే అత్యాధునిక రవాణా వ్యవస్థ, గ్యాస్ యుటిలైజేషన్, వ్యర్థాల వినియోగం, పట్టణ ప్రాంతానికి ఉండాల్సిన ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన సహకారం ►ఫుడ్ ప్రాసెసింగ్ అభివృద్ధి బాబు ప్రసంగాలన్నీ జపనీస్‌లోకి.. సీఎం చంద్రబాబు ప్రసంగాలన్నీ జపనీస్ భాషలోకి అనువదించేందుకు ఒక దుబాసీ (ట్రాన్స్‌లేటర్)ని ఏర్పాటు చేసినట్టు పరకాల తెలిపారు. వివిధ అంశాలతో సీడీలు, బ్రోచర్లను ఇంగ్లిష్తో పాటు, జపనీస్ భాషలో రూపొందించినట్టు చెప్పారు. పలు అంశాలపై బాబు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తారన్నారు. -
జపాన్ పర్యటనకు బయలుదేరిన చంద్రబాబు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జపాన్ పర్యటనకు బయలుదేరారు. ఆయన శంషాబాద్ విమానాశ్రయానికి బయలుదేరారు. 19 మంది ప్రతినిధి బృందం ఆయన వెంట వెళుతోంది. సిఐఐ తరపున మరో బృందం కూడా జపాన్ బయలుదేరింది. ఈ రెండు బృందాలు ఈ నెల 29 వరకు జపాన్‌లో పర్యటిస్తాయి. ఈ పర్యటనలో చంద్రబాబు జపాన్ ప్రధాన మంద్రితోపాటు పలువురు పారిశ్రామికవేత్తలను కలుస్తారు. పలు సంస్థలతో ఆయన అక్కడ ఆరు ఒప్పందాలు చేసుకునే అవకాశం ఉంది. ** -
జపాన్ బృందంతో కంభంపాటి భేటీ
సాక్షి, న్యూఢిల్లీ: ఏపీ సీఎం చంద్రబాబు త్వరలో జపాన్‌లో పర్యటించనున్న నేపథ్యంలో అక్కడ చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చించేందుకు ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రతినిధి కంభంపాటి రామ్మోహన్రావు గురువారం ఆ దేశానికి చెందిన ప్రతినిధులతో సమావేశమయ్యారు. భారత్‌లో జపాన్ రాయబారి టకేషీయోగీ నిర్వహించిన జపాన్ ఇండియా బిజినెస్ కోఆర్డినేషన్ కమిటీ(జేఐబీసీసీ) సమావేశంలో కంభంపాటితోపాటు ఏపీ పరిశ్రమలశాఖ ప్రధాన కార్యదర్శి ప్రసాద్, పట్టణాభివృద్ధిశాఖ ప్ర ధాన కార్యదర్శి సాంబశివరావు, పరిశ్రమలశాఖకార్యదర్శి అజయ్‌జైన్ పాల్గొన్నారు. ఎన్టీఆర్ పేరు పెట్టడం హర్షణీయం: హైదరాబాద్‌లోని శంషాబాద్ విమానాశ్రయంలోని డొమెస్టిక్ టెర్మినల్‌కు ఎన్టీఆర్ పేరు పెడుతూ పౌరవిమానయాన శాఖ ఉత్తర్వులు జారీ చేయటంపై కంభంపాటి హర్షం వ్యక్తం చేశారు. -
నవంబర్‌లో చంద్రబాబు జపాన్ పర్యటన
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నవంబర్ 24వ తేదీ నుంచి వారం రోజుల పాటు జపాన్ పర్యటనకు వెళ్లనున్నారు. ఈ పర్యటనలో ఆయనవెంట పారిశ్రామిక ప్రతినిధులు కూడా ఉంటారని అధికార వర్గాలు తెలిపాయి. జపాన్ దేశ ప్రతినిధి బృందం బుధవారం చంద్రబాబుతో సచివాలయంలో భేటీ అయింది. ఈ సందర్భంగా తన జపాన్ పర్యటన గురించి చంద్రబాబు వెల్లడించారు. విజయవాడ, గుంటూరు ప్రాంతాల్లో నిర్మించనున్న స్మార్ట్ క్యాపిటల్ సిటీకి తమ సాంకేతిక సహకారం ఉంటుందని జపాన్ బృందం తెలిపింది. విశాఖపట్నంలో నెలకోల్పే 4 వేల మెగావాట్ల విద్యుత్ ప్లాంటు, శ్రీకాకుళంలో నాలుగు వేల మెగావాట్లు, అనంతపురంలో రెండు వేల మెగావాట్ల సోలార్‌పవర్ ప్లాంట్ల ఏర్పాటుకు సహకరిస్తామని పేర్కొంది. -
ముగిసిన మోడీ జపాన్ పర్యటన
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ ఐదు రోజుల జపాన్ పర్యటనను విజయవంతంగా ముగించుకుని బుధవారం స్వదేశానికి చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వచ్చిన ఆయనకు విమానాశ్రయంలో విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ పుష్పగుచ్ఛమిచ్చి స్వాగతం పలికారు. పర్యటన విజయవంతమైనందుకు ఆయనను అభినందించారు. ఆమె మోడీకి ఏదో చెప్పడం, ఇద్దరూ నవ్వుకోవడం కనిపించింది. ప్రధాని పర్యటన దిగ్విజయంగా ముగియడంపై హర్షం వెలిబుచ్చడానికి సుష్మ స్వయంగా ఆయనను స్వాగతించడానికి వెళ్లారని సమాచారం. విదేశీ పర్యటన నుంచి వచ్చిన ప్రధానిని ఒక మంత్రి స్వాగతించడం చాలా ఏళ్లుగా జరగడం లేదు. కాగా, బుధవారం ఉదయం మోడీకి ఆయన బసచేసిన టోక్యోలోని ఇంపీరియల్ హోటల్ సిబ్బంది ఆత్మీయంగా వీడ్కోలు పలికారు. హోటల్ చెఫ్‌లతో మోడీ కరచాలనం చేశారు. జపాన్ తనపై ఎంతో ఆదరం చూపి, అద్భుతమైన ఆతిథ్యమిచ్చిందని మోడీ ఆ దేశ ప్రజలకు ఢిల్లీ వచ్చాక ట్విట్టర్లో కృతజ్ఞతలు తెలిపారు. ఈమేరకు జపాన్ భాషలోనూ ట్వీట్ చేశారు. జపాన్‌తో అనుబంధాలకు సంబంధించి తన పర్యటన భారత్‌లో సానుకూలత, ఆశావాదాన్ని సృష్టించిందని సుష్మ అన్నారని వెల్లడించారు. మోడీ పర్యటనలో జపాన్ మన దేశానికి మౌలిక వసతుల కల్పనకు రూ.2 లక్షల కోట్ల సాయం ప్రకటించడం, రక్షణ, ఇంధనం తదితర రంగాల్లో ఐదు ఒప్పందాలను కుదుర్చుకోవడం తెలిసిందే. 1998 నాటి భారత్ అణుపరీక్షల నేపథ్యంలో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్‌పై విధించిన నిషేధాన్ని జపాన్ ఎత్తేసింది. -
మా డీఎన్ఏలోనే శాంతి, అహింస
-
మా డీఎన్ఏలోనే శాంతి, అహింస
టోక్యో: జపాన్ పర్యటనను అత్యంత విజయవంతమైన పర్యటనగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ అభివర్ణించారు. జపాన్ హామీ ఇచ్చిన 3.5 ట్రిలియన్ డాలర్ల( రూ. 2.12 లక్షల కోట్లు)సాయంతో భారత్‌లో మౌలిక వసతుల కల్పన మెరగుపడుతుందని, దేశాన్ని పరిశుభ్ర భారత్‌గా మార్చడం సాధ్యమవుతుందని అన్నారు. రానున్న ఐదేళ్లలో ప్రభుత్వ, ప్రైవేటు నిధుల ద్వారా ఈ సాయం భారత్‌కు అందనుందని తెలిపారు. స్మార్ట్ సిటీల నిర్మాణం, గంగానదిని శుద్ధి చేయడం సహా పలు కార్యక్రమాల అమలుకు ఆ మొత్తాన్ని ఉపయోగిస్తామన్నారు. పర్యటనలో నాలుగో రోజు మంగళవారం ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. చివరగా జపాన్‌లోని భారతీయులు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కడ చేసిన ప్రసంగంలో.. హెచ్ఏఎల్ సహా ఆరు భారతీయ కంపెనీలపై జపాన్ నిషేధం ఎత్తివేయడాన్ని ప్రస్తావస్తూ.. ‘జపాన్ మనపై విశ్వాసముంచడం నన్నెంతో సంతోషపరుస్తోంది’ అన్నారు. జపాన్‌తో బంధం ధృఢమైనదని పేర్కొంటూ.. ‘ఇది ఫెవికాల్ బంధం కన్నా ధృఢమైనది’ అని చమత్కరించారు. శాంతి, అహింసలు భారతీయుల డీఎన్ఏలోనే ఉన్నాయని మోడీ స్పష్టం చేశారు. అది ఏ అంతర్జాతీయ ఒప్పందంకన్నా ఎక్కువేనన్నారు. సేక్రెడ్ హార్ట్స్ వర్సిటీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అణ్వస్త్ర నిరోధక ఒప్పందంపై భారత్ సంతకం చేయకపోవడంపై వివరణ ఇస్తూ మోడీ పై వ్యాఖ్యలు చేశారు. ప్రపంచమంతా ఒక కుటంబమనే ‘వసుధైక కుటుంబం’ భావనను భారత్ విశ్వసిస్తుందన్నారు. మోడీ కార్యక్రమాల విశేషాలు, వ్యాఖ్యలు.. జపాన్‌లోని స్మార్ట్ సిటీ క్యోటోకు, మన వారణాసికి చాలా పోలికలున్నాయి. రెండూ చిన్న పట్టణాలే. రెండు పట్టణాల్లోనే పెద్ద సంఖ్యలో దేవాలయాలున్నాయి. క్యోటో తరహాలో కాశిని కూడా స్మార్ట్ సిటీగా తయారు చేస్తాం. పరిశుభ్రత మహాత్మాగాంధీకి చాలా ఇష్టమైన విషయం. అందుకే ఆయన 150వ జయంతి(2019) నాటికి దేశాన్ని పరిశుభ్ర భారత్‌గా మార్చాలని ప్రతినబూనాం. అదే ఆయనకు మనమిచ్చే నివాళి. పాములోళ్ల దేశంగా భారత్‌ను కొందరు భావిస్తారు. అందుకే ‘గతంలో పాములతో ఆడుకున్నాం.. ఇప్పుడు మౌజ్(భారతీయుల ఐటీ సామర్ధ్యాన్ని అన్యాపదేశంగా ప్రస్తావిస్తూ)లతో ఆడుకుంటున్నాం’ అని నేను ఒకరితో చెప్పాను. 21వ శతాబ్దం భారత్కో, చైనాకో, జపాన్‌కో చెందదు. అది ఆసియాకు చెందుతుంది. దేశాల మధ్య సంబంధాలు పెరగాలంటే.. ప్రజల మధ్య అనుబంధం పెరగాలి. ఇరుదేశాలు యువ ఎంపీల పార్లమెంటరీ సంఘాలను ఏర్పాటు చేయాలి. అలాగే, జపాన్ నుంచి వచ్చే పార్లమెంటేరియన్లు భారత్‌లో కేవలం ఢిల్లీలోనే కాకుండా ఇతర ప్రాంతాల్లోనూ పర్యటించాలి. భారతీయ ఎంబసీలో వివేకానంద సెంటర్‌ను ప్రారంభించిన అనంతరం బయటకు వచ్చిన మోడీకి భారీగా గుమికూడిన భారతీయ అభిమానులు స్వాగతం పలికారు. దాంతో భద్రత సిబ్బందిని కాదని మోడీ వారితో మమేకమయ్యారు. వారితో కరచాలనాలు చేసి, ఫోటోలు దిగారు. జపాన్ చక్రవర్తి అకిహితోతో భేటీ సందర్భంగా ఆయనకు భగవద్గీతను బహుమతిగా ఇచ్చారు. భగవద్గీతను బహుమతిగా ఇవ్వడంపై భారత్‌లోని లౌకికవాద మిత్రులు తుపాను సృష్టిస్తారని, మీడియాలో చర్చలు ప్రారంభమవుతాయని హాస్యంగా వ్యాఖ్యానించారు. డ్రమ్మర్ మోడీ: జపాన్‌లో మోడీలోకి కొత్త కళ ఆవిష్కృతమైంది. డ్రమ్మర్‌గా కొత్త అవతారమెత్తి.. జపాన్ సంప్రదాయ డ్రమ్మర్లతో కలసి ‘జుగల్బందీ’ చేశారు. అక్కడ నిపుణులైన వాయిద్యకారులకు గట్టి పోటీనిచ్చారు. ‘టీసీఎస్ జపాన్ టెక్నాలజీ అండ్ కల్చరల్ అకాడెమీ’ ప్రారంభోత్సవం సందర్భంగా ఈ అరుదైన ఘటన చోటు చేసుకుంది. -
శత దిన సంరంభం!
సంపాదకీయం: అయిదేళ్ల కాలానికి ఎన్నికై గద్దెనెక్కిన ప్రభుత్వం గురించి వంద రోజులకే మదింపు వేయడం న్యాయమూ కాదు... అదంత సులభమూ కాదు. కేవలం మూడునెలల పదిరోజుల వ్యవధిలోనే ఏ ప్రభుత్వమైనా ఏదైనా సాధించగలదనుకోవడం అత్యాశే. అయితే, ఈ వంద రోజుల్లోనూ ఆ ప్రభుత్వం నడక, నడత ఎలా ఉన్నాయి... అది ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నది, దాని నిర్వహణ ఎలా సాగుతున్నదనే అంశాలనుబట్టి ఆ ప్రభుత్వ పోకడల గురించి ఒక అభిప్రాయానికి రావొచ్చు. అది ఆశాజనకంగా కనబడుతున్నదా... పాత వాసనలతో, పాత బాణీలో కొట్టుకుపోతున్నదా అనే అంశాలు స్థూలంగా తెలిసే అవకాశం ఉంటుంది. ఎందుకొచ్చిందోగానీ ‘వంద’కు మన సంప్రదాయంలో ఎనలేని ప్రాముఖ్యం ఉన్నది. దీవించేటపుడు ‘శతమానం భవతి...’ అనడం మన దగ్గర సర్వసాధారణం. గతంలో సినిమాలకు శత దినోత్సవాలుండేవి. 2009 నాటి ఎన్నికల్లో అప్పటి యూపీఏ సర్కారు ఈ ‘వంద’కు తెగ ప్రచారం చేసిపెట్టింది. వందరోజుల్లో ఇవి చేస్తాం...అవి చేస్తామంటూ జనాన్ని ఊరించింది. అందులో మహిళా రిజర్వేషన్లు మొదలుకొని స్విస్ బ్యాంకుల్లో ఉన్న నల్లధనం తీసుకురావడం వరకూ ఎన్నో ఉన్నాయి. ఆ తర్వాత మరికొన్ని వందల రోజులు గడిచినా అందులో ఏ ఒక్కటీ సాధించలేక ఆ సర్కారు చతికిలబడింది. ముందు జాగ్రత్తనో ఏమోగానీ బీజేపీ ఎక్కడా వందరోజుల లక్ష్యం గురించి హోరెత్తించలేదు. ప్రధానిగా నరేంద్ర మోడీ ప్రమాణస్వీకారం చేసే రోజున సార్క్ దేశాల అధినేతలంతా హాజరుకావడం...సరిగ్గా వందరోజుల పాలనను పూర్తిచేసుకున్న సందర్భంలో ఆయన జపాన్ పర్యటనలో ఉండటం యాదృచ్ఛికం కాదు. ఆయన కావాలని నిర్ణయించుకున్న సందర్భాలవి. జపాన్ పర్యటనకు ముందు ఆయన ప్రత్యేకించి ఎంచుకుని ఇరుగు పొరుగు దేశాలైన భూటాన్, నేపాల్ వెళ్లడం...మధ్యలో బ్రెజిల్లో జరిగిన బ్రిక్స్ దేశాధినేతల సదస్సుకు హాజరై ఎన్నాళ్లనుంచో ప్రతిపాదన రూపంలోనే ఉండిపోయిన బ్రిక్స్ బ్యాంకును సాకారం చేయడంలో కీలకపాత్ర పోషించడం గమనిస్తే ప్రపంచ దేశాల్లో... ముఖ్యంగా ఇరుగుపొరుగులో మన పలుకుబడీ, ప్రతిష్టా పెరగడానికి మోడీ ప్రత్యేక శ్రద్ధవహించడాన్ని గుర్తించగలుగుతాము. ప్రమాణ స్వీకారం సమయంలో పాకిస్థాన్‌కు స్నేహహస్తం చాచినా, మన అభీష్టానికి భిన్నంగా కాశ్మీర్ వేర్పాటువాదులతో ఆ దేశ హైకమిషనర్ సమావేశం కావడాన్ని నిరసిస్తూ ఇరుదేశాల విదేశాంగ శాఖ కార్యదర్శుల స్థాయి చర్చలకు ఆయన నిర్మొహమాటంగా తలుపులు మూశారు. ఈ వంద రోజుల్లోనూ ఆయన ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్లో కొన్ని అత్యంత కీలకమైనవి. రక్షణ, రైల్వే రంగాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడు (ఎఫ్‌డీఐ)లను అనుమతించడం, న్యాయమూర్తుల నియామకాలకు సంబంధించి ఇప్పుడున్న కొలీజియం వ్యవస్థకు మంగళం పాడటం, బీమా రంగంలో 49 శాతం ఎఫ్‌డీఐలకు వీలుకల్పిస్తూ బిల్లు రూపొందించడం, నల్లధనంపై ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) ఏర్పాటు, జన్‌ధన్ యోజన పథకాన్ని ప్రారంభించిన రోజే బ్యాంకుల్లో కోటిన్నర ఖాతాలు ప్రారంభమయ్యేలా చూడటం, కాంగ్రెస్ గవర్నర్లను వదుల్చుకోవడం అందులో ప్రధానమైనవి. ‘ప్రధాని అంటే తొలి ప్రజా సేవకుడ’న్న జవహర్లాల్ నెహ్రూ మాటను స్వీకరించినా, ఆయన మానసపుత్రిక ప్రణాళికా సంఘానికి వీడ్కోలు పలకాలని నిర్ణయించడం కూడా అత్యంత ముఖ్యమైనది. ఈ వందరోజుల్లో నిజమో, కాదో తెలియని కొన్ని వదంతులు కూడా మోడీపై బాగా ప్రచారంలోకొచ్చాయి. ఒక కేంద్ర కేబినెట్ మంత్రి ప్రముఖ పారిశ్రామికవేత్త ఇంటికి భోజనానికి వెళ్లగా ‘ఇలాంటివి సరి కాద’ంటూ ఆయన సెల్‌కు సందేశం వెళ్లడం, అత్యవసర పనుందంటూ ఆయన కాస్తా వెనుదిరగడం అందులో ఒకటి. మరో కేంద్రమంత్రి గౌహతి విమానాశ్రయంలో దిగిన కొద్దిసేపటికే ‘ప్రధాని కార్యాలయానికి వర్తమానం లేకుండా ఇకపై ఇలా చేయొద్ద’ంటూ తాఖీదు...కేంద్రమంత్రి నితిన్ గడ్కారీ కార్యాలయంలో బగ్గింగ్ పరికరాలు బయటపడటం, కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్, ఆయన కుమారుణ్ణి పిలిచి ఒక అంశంలో మందలించడం వంటివి మరికొన్ని వదంతులు. వీటికి రుజువులూ, సాక్ష్యాలూ లేవు. కానీ, మంత్రులస్థాయి వ్యక్తులపై కూడా నిఘా ఉన్నదన్న అభిప్రాయాన్ని ఈ వదంతులన్నీ కలగజేశాయి. వీటి సంగతలా ఉంచి పీఎంఓలో మోడీ వచ్చే సమయానికే సిబ్బందంతా పనిపట్ల భయభక్తులతో హాజరవుతుండటం మాత్రం వాస్తవం. జీడీపీ వృద్ధి రేటు మెరుగుపడి 5.7 శాతానికి చేరుకోవడం రెండున్నరేళ్ల తర్వాత ఈ త్రైమాసికంలో మాత్రమే సాధ్యపడింది. పారిశ్రామిక ఉత్పాదకత విషయంలోనూ ఈ ధోరణే కనబడింది. అయితే ద్రవ్యోల్బణం ఇంకా లొంగి రాలేదు. నిత్యావసరాలు, కూరగాయల ధరలకు కళ్లెం పడలేదు. ప్రధాని అయినా, కేంద్రమంత్రులైనా పత్రికా ప్రకటనలు జారీచేయడం... పత్రికలనూ, చానళ్లనూ కాదని ట్విటర్, ఫేస్బుక్, ఎస్సెమ్మెస్వంటి ఇతరేతర మాధ్యమాలను ఎంచుకోవడం కొత్త పోకడ. ఈ వంద రోజుల్లోనూ ప్రత్యర్థి కాంగ్రెస్ మాటేమోగానీ... పరస్పరం బద్ధ శత్రువులైన జేడీ(యూ), ఆర్జేడీవంటి పార్టీలు మోడీ భయానికి దగ్గరయ్యాయి. సీపీఎంతో కలవడానికి సిద్ధమేనని బెంగాల్ సీఎం, తృణమూల్ అధినేత మమతా బెనర్జీ ప్రకటించారు. ఏదేమైనా జనం మార్పును కోరుకుని బీజేపీని గెలిపించారు. ఈ వందరోజుల్లోనూ ఆ మార్పులు కొట్టొచ్చినట్టు కనబడుతూనే ఉన్నాయి. ఈ సర్కారు పనితీరుపై భిన్నాభిప్రాయాలు ఎన్నయినా ఉండొచ్చుగానీ... దీనికి చలనశీలత దండిగా ఉన్నదని అందరూ అంగీకరిస్తారు. అది రాగల రోజుల్లో సుఫలాలను అందించే దిశగా సాగాలని ఆశిస్తారు. -
జపాన్ నుంచి పెట్టుబడుల వెల్లువ: చందా కొచర్
జపనీస్ పెట్టుబడులకు అనుమతులను వేగంగా ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటామని మోడీ హామీ ఇచ్చిన నేపథ్యంలో కోట్లాది డాలర్ల నిధులు భారత్‌లోకి వెల్లువెత్తనున్నాయని ఐసీఐసీఐ బ్యాంక్ సీఈఓ, ఎండీ చందా కొచర్ పేర్కొన్నారు. మోడీతో పాటు జపాన్ పర్యటనలో పాల్గొంటున్న కొచర్ పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు. రైల్వేలు, స్మార్ట్‌సిటీ ప్రాజెక్టులు, బయోటెక్నాలజీ, పునరుత్పాదక ఇంధన రంగం, ఎలక్ట్రానిక్స్‌తో పాటు మౌలిక సదుపాయాల రంగంలో భారీగా జపాన్ పెట్టుబడులను ఆకర్షించే అవకాశం ఉందన్నారు. ఈ నిధుల కల్పనలో తమ బ్యాంక్ కూడా కీలక పాత్ర పోషించనుందని ఆమె చెప్పారు. ఈ దిశగా జపనీస్ బ్యాంక్ ఆఫ్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్‌తో ఎక్స్పోర్ట్ క్రెడిట్ గ్యారెంటీలు ఇతరత్రా అంశాలపై ఇప్పటికే కసరత్తు కూడా చేస్తున్నట్లు కొచర్ వెల్లడించారు. -
'ప్రియాంక కంటే మోడీ ఎక్కువ డ్రస్సులు మార్చారు'
న్యూఢిల్లీ: జపాన్ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్రమోడీపై ప్రముఖ రచయిత్రి శోభా డే వ్యంగ్యాస్త్రాన్ని సంధించారు. జపాన్ పర్యటనలో నరేంద్రమోడీ మార్చిన దుస్తులపై శోభా డే వ్యాఖ్యలు చేశారు. ఫ్యాషన్ చిత్రంలో ప్రియాంక చోప్రా మార్చిన దుస్తుల కంటే మోడీ ఎక్కువ డ్రస్సులు మార్చారని సోషల్ మీడియా వెబ్ సైట్ ట్విటర్ లో శోభా డే ఓ సందేశాన్ని పోస్ట్ చేశారు. ఇటీవలకాలంలో ప్రధాని నరేంద్రమోడీ ధరించే దస్తులు అందర్ని ఆకర్షిస్తున్న సంగతి తెలిసిందే. ఓ ప్రత్యేకత ఉట్టిపడేలా ప్రధాని దుస్తుల ఎంపికపై కూడా పలు పత్రికల్లో చర్చనీయాంశమయ్యాయి. Narendra Modi has changed more outfits in Japan than Priyanka Chopra in ''Fashion''.— Shobhaa De (@DeShobhaa) September 1, 2014 -
భారత్‌లో 2.11 లక్షల కోట్ల పెట్టుబడులు
-
భారత్‌లో 2.11 లక్షల కోట్ల పెట్టుబడులు
రాబోయే ఐదేళ్లలో భారతదేశంలో దాదాపు 2.11 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టేందుకు జపాన్ ముందుకొచ్చింది. ప్రధానంగా మౌలిక సదుపాయాలు, స్మార్ట్ సిటీల నిర్మాణానికి ఈ మొత్తాన్ని అందిస్తామని తెలిపింది. అలాగే భారతదేశంలో బుల్లెట్ రైళ్లను ప్రవేశపెట్టడానికి కావల్సిన ఆర్థిక, సాంకేతిక సాయం మొత్తాన్ని అందించేందుకు తాము సిద్ధమని జపాన్ సంసిద్ధత వ్యక్తం చేసింది. అలాగే, ఇంతకుముందు జపాన్‌లో ఇంతకుముందు ఆరు భారతీయ అంతరిక్ష, రక్షణ సంస్థలపై ఉన్న నిషేధాన్ని కూడా ఎత్తేయడానికి అంగీకరించింది. భారత్, జపాన్ దేశాల మధ్య సంబంధాలు కేవలం ఆర్థిక సంబంధాలు మాత్రమే కాదని, రాజకీయ బంధాలను తాను సరికొత్త ఎత్తులకు తీసుకెళ్తానని ప్రధానమంత్రి నరేంద్రమోడీ చెప్పారు. జపాన్ పర్యటనలో భాగంగా ఆయన అక్కడి ప్రధాని షింజో అబెతో కలిసి సంయుక్తంగా విలేకరుల సమావేశం ఏర్పాటుచేశారు. ఆయనేమన్నారంటే.. ''గంగానది ప్రక్షాళన గురించి నేను మాట్లాడగానే ఏం సాయం కావాలో అడగాలని కోరారు. మా దేశ అభివృద్ధిలో పాలుపంచుకున్నందువల్ల జపాన్‌కు కూడా లాభమే జరుగుతుంది. అక్కడి ప్రజలు అభివృద్ధి చెందడంతో పాటు జపాన్ కూడా ముందంజ వేస్తుంది. మన బంధాలు కేవలం ఆర్థిక సంబంధాలు కావు. ఇందులో ఇంకా చాలా కోణాలు ఇమిడి ఉన్నాయి. రాజకీయ సంబంధాలను సరికొత్త ఎత్తులకు తీసుకెళ్లాలనే యోచనలో మేమున్నాం'' అని జపాన్ ప్రధానమంత్రితో కలిసి సంయుక్తంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో నరేంద్రమోడీ చెప్పారు. కొసమెరుపు: జపాన్ పర్యటనలో కూడా నరేంద్రమోడీ హిందీలోనే మాట్లాడారు. అక్కడ ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన అనువాదకుడు ఆయన ప్రసంగాన్ని జపనీస్ భాషలోకి అనువదించారు. -
'గుజరాతీని.. వాణిజ్యం నా రక్తంలోనే ఉంది'
తన ప్రభుత్వంలోను, తన కార్యాలయంలోను కూడా జపాన్ తరహా సమర్ధతను తీసుకురావడానికి కట్టుబడి ఉన్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. జపాన్ పర్యటనలో ఉన్న ఆయన అక్కడి వ్యాపారవేత్తలను, ప్రభుత్వాధికారులను, నాయకులను.. అందరినీ ఆకట్టుకునేలా మాట్లాడారు. * ''నేను గుజరాతీని.. వాణిజ్యం నా రక్తంలోనే ఉంది. వాణిజ్యవేత్తలకు రాయితీలు అవసరం లేదు. వాళ్లకు ఎదగడానికి మంచి వాతావరణం మాత్రమే అవసరం'' అని మోడీ అన్నారు. * జపాన్ నుంచి వచ్చే ప్రతిపాదనలను పరిశీలించడానికి తన కార్యాలయంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటుచేస్తానని మోడీ చెప్పారు. అలాగే, ఈ బృందంలో జపాన్ ఎంపిక చేసే ఇద్దరు వ్యక్తుల కోసం కార్యాలయం కూడా ఇస్తామన్నారు. * ''ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలోనే 5.7 వృద్ధిరేటు నమోదైంది. ఇది చాలా పెద్ద ముందడుగు. ఆశలు మళ్లీ చిగురిస్తున్నాయి'' అంటూ తన విజయాన్ని చెప్పకనే చెప్పారు. * ఇంతకాలం ఉన్న నిరుత్సాహకరమైన వాతావరణం ఇక ముగిసిపోయిందని, జపాన్ పెట్టుబడిదారులు భారత్‌కు వస్తే, వాళ్లకు చకచకా అనుమతులు లభిస్తాయని పారిశ్రామికవేత్తలకు చెప్పారు. * చైనా పేరు ఎత్తకుండానే ఆ దేశం మీద తీవ్రస్థాయిలో మండిపడ్డారు. విదేశీ విధానంలో అభివృద్ధి వాదమే కావాలి తప్ప విస్తరణ వాదం కాదన్నారు. 18వ శతాబ్దం నాటి ఆలోచనల్లో మగ్గిపోయేవాళ్లు ఇతరుల జలాల్లోకి ప్రవేశించి, ఆక్రమణలకు పాల్పడతారని చెప్పారు. జపాన్‌కు కూడా చైనాతో విరోధం ఉన్నమాట తెలిసిందే. -
టీచర్ అవతారమెత్తిన నరేంద్ర మోడీ
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉన్నట్టుండి ఉపాధ్యాయుడి అవతారం ఎత్తారు. జపాన్ పర్యటన ఆయనలోని ఈ కళను కూడా బయటకు తీసింది. నాలుగు రోజుల పర్యటన కోసం జపాన్ వెళ్లిన నరేంద్రమోడీ, అక్కడి అత్యంత పురాతన పాఠశాలలు కొన్నింటిని సందర్శించారు. స్కూలు పిల్లలు జపాన్, భారతదేశ పతాకాలను చేతబట్టి, మోడీని సాదరంగా స్వాగతించారు. అక్కడ ఒకచోట సంగీతం క్లాసులు జరుగుతుండగా ఆయన ఉపాధ్యాయుడిలా కాసేపు వాళ్లకు పాఠాలు బోధించారు. స్వయంగా భారతదేశ ప్రధానమంత్రే తమకు క్లాసు చెబుతుండటంతో పిల్లలు ఉప్పొంగిపోయారు. అనంతరం క్యోటోలోని కిన్కాను జి, టో జి (స్వర్ణ దేవాలయం) ఆలయాల్లో మోడీ కాసేపు ప్రార్థనలు జరిపారు. ఈ రెండూ జపాన్‌లో అత్యంత ప్రముఖ దేవాలయాలు. -
స్మార్ట్ సిటీగా వారణాసి అభివృద్ధి
* అవగాహన ఒప్పందంపై భారత్-జపాన్ సంతకాలు * కీలక ఘట్టంతో మొదలైన ప్రధాని మోడీ జపాన్ పర్యటన క్యోటో: భారత ప్రధాని నరేంద్ర మోడీ తన ఐదు రోజుల జపాన్ పర్యటనను కీలక ఘట్టంతో ప్రారంభించారు. దేశంలో 100 స్మార్ట్ సిటీలను ఏర్పాటు చేయాలన్న బృహత్తర కార్యాచరణకు తన నియోజకవర్గమైన వారణాసితో శ్రీకారం చుట్టారు. ఈ పర్యటనలో భాగంగా శనివారం క్యోటో చేరుకున్న మోడీ... వారణాసిని క్యోటో తరహాలో స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దేలా ఆ దేశంతో అవగాహన ఒప్పందం (క్యోటో పార్ట్నర్ సిటీ అగ్రిమెంట్) కుదుర్చుకున్నారు. సంస్కృతీ సంప్రదాయాలు, ఆధునిక హంగుల కలబోతగా ఉన్న క్యోటో నగరం.... వారణాసిని స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దేందుకు సహాయ సహకారాలు అందించనుంది. ఈ ఒప్పందంపై జపాన్‌లోని భారత రాయబారి దీపా వాధ్వా, క్యోటో నగర మేయర్ దైసాకు కదోకవాలు సంతకాలు చేశారు. మోడీని కలిసేందుకు ప్రత్యేకంగా క్యోటోకు వచ్చిన జపాన్ ప్రధాని షింజో అబే...ఆయనతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సుమారు 2 వేల ఆలయాలతో జపాన్ సాంస్కృతిక రాజధానిగా దాదాపు 1,000 ఏళ్లపాటు విరాజిల్లిన క్యోటో నగరం దాన్ని కాపాడుకుంటూనే ఆధునిక నగరంగా ఎలా ఎదిగిందో క్యోటో మేయర్ దైసాకు ఆదివారం మోడీకి ప్రత్యేకంగా వివరించనున్నారు. అంతకుముందు ఒసాకా అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగి అక్కడి నుంచి క్యోటో చేరుకున్న మోడీని షింజో అబే గెస్ట్‌హౌస్‌లో కలిశారు. ఈ సందర్భంగా అబేకు మోడీ స్వామి వివేకానంద పుస్తకాలను, భగవద్గీత ప్రతిని అందజేశారు. ఎప్పుడూ కుర్తా పైజామాలో కనిపించే మోడీ నల్లటి బంధ్గాలా సూట్లో దర్శనమిచ్చి చూపరులను ఆకట్టుకున్నారు. అవగాహన ఒప్పందం కుదిరిన అనంతరం మోడీ గౌరవార్థం షింజో అబే విందు ఇచ్చారు. ఈ సందర్భంగా ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం గురించి వారు చర్చించారు. విందుకు ముందు వారిద్దరూ ఓ చెరువు వద్దకు వెళ్లి చేపలకు ఆహారం అందించే సంప్రదాయ వేడుకలో పాల్గొన్నారు. సోమవారం టోక్యోలో జరగనున్న ఇరు దేశాల సదస్సులో మోడీ, అబేలు మళ్లీ భేటీకానున్నారు. మోడీ కోసం అబే సోమవారం ప్రత్యేకంగా తేనీరు (టీ) అందించనున్నారు. కాగా, మోడీ వెంట జపాన్ పర్యటనలో పాల్గొనాల్సిన భారత పారిశ్రామిక బృందం నుంచి ముకేశ్ అంబానీ తప్పుకున్నారు. దీనికి కారణం తెలియరాలేదు. -
ఇద్దరు మిత్రులు.. రెండు దేశాలు!!
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి.. జపాన్ ప్రధాని షింజో అబెకు మధ్య చాలా పోలికలున్నాయి. షింజో అబె ట్విట్టర్లో కేవలం ముగ్గురినే ఫాలో అవుతారు. వాళ్లలో ఒకరు ఆయన భార్య, మరొకరు జపాన్ దేశానికి చెందిన ఓ రాజకీయ నాయకుడు, ఆ మూడో వ్యక్తి.. భారత ప్రధాని నరేంద్ర మోడీ!! ఇద్దరూ కూడా రైట్ వింగ్ జాతీయవాదులే. ఇద్దరూ తమ దేశ ఆర్థిక వ్యవస్థను మారుస్తామని చెప్పి అధికారంలోకి వచ్చినవాళ్లే. ప్రాంతీయంగా చుట్టుపక్కల దేశాలతో మంచి సంబంధాలు ఏర్పరుచుకోవాలి అనుకుంటూనే చైనాతో మాత్రం కయ్యానికి కాలు దువ్వుతున్నవాళ్లే. ఇద్దరూ కూడా తమ తమ దేశాల్లో చాలా బలమైన నాయకులుగా పేరుపొందారు. తమ దేశ ఆర్థిక వ్యవస్థలను పునరుద్ధరించడానికి రీరెగ్యులేషన్ మంత్రాన్ని ఇద్దరూ జపిస్తున్నారు. ఇద్దరి మధ్య చాలా మంచి అనుబంధం ఉంది. మోడీ జపాన్ చేరుకున్న తర్వాత ఇద్దరు ముందు ఆ దేశ రాజధాని నగరమైన టోక్యోలో అధికారికంగా కాకుండా.. ముందు వ్యక్తిగతంగా ట్యోకో నగరంలో కలుస్తున్నారు. అక్కడ ఒక విందులో పాల్గొన్న తర్వాతే అధికారిక చర్చలు ప్రారంభం అవుతాయి. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉండగానే మోడీ రెండుసార్లు జపాన్ వెళ్లారు. ఆ రెండు సార్లూ ఆయన షింజో అబెను కలిశారు. ఇప్పుడు జపాన్ వెళ్లడానికి ముందు జపనీస్ భాషలో ట్వీట్ చేశారు. (ఇంగ్లీషు కథనం ఇక్కడ చదవండి) -
జపాన్ పర్యటనకు బయల్దేరిన మోడీ
ప్రధానమంత్రి నరేంద్రమోడీ జపాన్ పర్యటనకు బయల్దేరారు. భారత ఉపఖండం వెలుపల ఆయన తొలి విదేశీ పర్యటన ఇదే మొదటిది. ముందుగా ఆయన క్యోటో విమానాశ్రయంలో దిగుతారు. అక్కడ జపాన్ ప్రధానమంత్రి షింజో అబె ఆయనకు స్వాగతం పలుకుతారు. ప్రధాని మోడీ గౌరవార్థం అబె ఒక విందు కూడా శనివారమే ఏర్పాటుచేయనున్నారు. ఈ పర్యటనలో మోడీ వెంట ప్రముఖ పారిశ్రామికవేత్తలు ముఖేష్ అంబానీ, అజీమ్ ప్రేమ్‌జీ తదితరులు కూడా ఉన్నారు. ప్రధానంగా స్మార్ట్ సిటీ అయిన క్యోటోను మోడీ క్షుణ్ణంగా పరిశీలించనున్నారు. దేశంలో వంద స్మార్ట్ సిటీలను ఏర్పాటుచేస్తామని ఇంతకుముందే ఆయన హామీ ఇవ్వడంతో ఆ తరహా నిర్మాణాల కోసం అక్కడ పరిశీలిస్తారు. అలాగే జపాన్ బుల్లెట్ రైళ్లను కూడా మోడీ చూస్తారు. దేశంలో ప్రవేశపెట్టబోయే బుల్లెట్ రైళ్లను తమవద్దనుంచే కొనుగోలు చేయాలని జపాన్ భారతదేశాన్ని కోరుతున్న విషయం తెలిసిందే. నరేంద్రమోడీ ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఇది మూడో విదేశీ పర్యటన. బ్రిక్స్ సదస్సుకు వెళ్లడం, నేపాల్‌లో పర్యటించడం తర్వాత ఆయన జపాన్ వైపు మొగ్గుచూపారు. -
చైనాకు నరేంద్రమోడీ హెచ్చరిక?
దౌత్య నీతి విషయంలో ప్రధాని నరేంద్రమోడీ కాస్త దూకుడుగానే వ్యవహరిస్తున్నారు. పొరుగునున్న ప్రత్యర్థి దేశాలకు తన పనితీరుతో హెచ్చరికలు చేస్తున్నారు. పదే పదే భారత భూభాగంలోకి చొచ్చుకొస్తూ.. చిరాకు పెడుతున్న చైనాకు చెక్ పెట్టడానికి ఆయన సరికొత్త వ్యూహం అమలు చేస్తున్నారు. జపాన్ పర్యటనను ఆయన ఒకరోజు పొడిగించుకున్నారు. భారతదేశానికి జపాన్ అత్యంత సన్నిహిత దేశమని, చైనా కంటే అదే తమకు ముఖ్యమని చెప్పకనే చెప్పారు. వాస్తవానికి ఆయన ఈనెల 31వ తేదీన బయల్దేరి టోక్యో వెళ్తారని ఇంతకుముందు ప్రభుత్వం ప్రకటించగా, 30వ తేదీనే బయల్దేరాలని నిర్ణయించుకున్నారు. ఇది చైనాకు ఒకరకంగా దుర్వార్తే అవుతుంది. సెప్టెంబర్ 4వ తేదీన ఆయన తిరిగి వస్తారు. ఇంతవరకు జపాన్‌లో ఇంతలా ఐదు రోజులు పర్యటించిన భారత ప్రధాని ఎవరూ లేరు. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉండగా కూడా మోడీకి జపాన్‌లో అభిమానులు ఎక్కువగానే ఉండేవారు. వాళ్లందరికీ ఇది కొంత శుభవార్తే అవుతుంది. అయితే.. చైనాకు మాత్రం కొంత దుర్వార్త అవ్వక తప్పదు. ప్రత్యర్థి శిబిరానికి చెందిన జపాన్ పర్యటన విషయంలో భారత ప్రధాని అంత ఎక్కువ ఆసక్తి చూపించడం సహజంగానే చైనాకు చేదుమాత్రలా అనిపిస్తుంది. తమను కాదని జపాన్‌కు నరేంద్రమోడీ ప్రాధాన్యం ఇవ్వడాన్ని చైనా ఇప్పటికే జీర్ణించుకోలేకపోతోంది. ఎవరిని దగ్గరకు తీసుకోవాలో, ఎవరిని దూరం పెట్టాలోనన్న దౌత్య నీతి విషయంలో మోడీ అనుసరిస్తున్న వైఖరిని ఉన్నతాధికారులు కూడా మెచ్చుకుంటున్నారు. -
జపాన్‌లో నాలుగు రోజుల పాటు మోడీ పర్యటన
ప్రధానమంత్రి నరేంద్రమోడీ జపాన్‌లో పర్యటించనున్నారు. ఆగస్టు 31వ తేదీ నుంచి సెప్టెంబర్ 3వ తేదీ వరకు అంటే నాలుగు రోజుల పాటు ఆయన జపాన్‌లో పర్యటిస్తారని ప్రధానమంత్రి కార్యాలయ వర్గాలు శుక్రవారం తెలిపాయి. ఈ పర్యటన సందర్భంగా జపాన్ రాజుతో పాటు ప్రధానమంత్రి షింజో అబిని కూడా ఆయన కలుస్తారు. మోడీ పర్యటన వల్ల ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత బలోపేతం అవుతాయని ఆశిస్తున్నట్లు జపాన్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది.