పెట్టుబడుల అవకాశాలు వివరించా: చంద్రబాబు | we explained the chances of investments in ap: cm chandrababu naidu | Sakshi
Sakshi News home page

పెట్టుబడుల అవకాశాలు వివరించా: చంద్రబాబు

Published Fri, Jul 10 2015 4:29 PM | Last Updated on Tue, Aug 14 2018 11:26 AM

పెట్టుబడుల అవకాశాలు వివరించా: చంద్రబాబు - Sakshi

పెట్టుబడుల అవకాశాలు వివరించా: చంద్రబాబు

ఢిల్లీ: రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను జపాన్లో వివరించామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు శ్రద్ధ చూపారని తెలిపారు. జపాన్ పర్యటనకు వెళ్లొచ్చిన చంద్రబాబు శుక్రవారం ఢిల్లీలో విలేకరులతో మాట్లాడారు. అమరావతిలో మిజహో బ్రాంచి పెట్టాలని వారిని కోరినట్లు చెప్పారు.

ఫిజి ఎలక్ట్రికల్ ను కలిసి రాష్ట్రంలో పరిశ్రమ ఏర్పాటుచేసే అంశంపై చర్చించినట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో సోలార్ పానెల్ ఏర్పాటుకు రావాలని కోరినట్లు వివరించారు. జైకా, జెబిక్ వంటి ప్రభుత్వ సంస్థల ప్రతినిధులతో చర్చలు జరిపామని చెప్పారు. శ్రీకాకుళంలో జెబిక్ పవర్ ప్రాజెక్టు పనులకు వారు ఆసక్తి చూపినట్లు తెలిపారు. సేఫ్ సిటీగా తిరుపతిని తయారుచేసేందుకు ఎన్ఏసీ ముందుకొచ్చిందని చంద్రబాబునాయుడు వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement