మెదక్లో ఉద్రిక్తత: మంత్రి హరీశ్ జపాన్ పర్యటన రద్దు | Harish rao cancels Japan tour as mallanna sagar issue tense | Sakshi
Sakshi News home page

మెదక్లో ఉద్రిక్తత: మంత్రి హరీశ్ జపాన్ పర్యటన రద్దు

Published Sun, Jul 24 2016 9:33 PM | Last Updated on Mon, Oct 8 2018 7:43 PM

మెదక్లో ఉద్రిక్తత: మంత్రి హరీశ్ జపాన్ పర్యటన రద్దు - Sakshi

మెదక్లో ఉద్రిక్తత: మంత్రి హరీశ్ జపాన్ పర్యటన రద్దు

హైదరాబాద్: నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్ రావు జపాన్ పర్యటన అర్ధాంతరంగా రద్దయింది. మరి కొద్ది సేపట్లో విమానాశ్రయానికి బయలుదేరుతారనగా మంత్రిగారు నిర్ణయం మార్చుకున్నారు. పలువురు ఉన్నతాధికారులతో కలిసి ఆదివారం రాత్రి జపాన్ వెళ్లాల్సిన ఆయన.. మెదక్ జిల్లాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పర్యటన వాయిదా వేసుకున్నారు. (మల్లన్న సాగర్ ముంపు గ్రామాల్లో తీవ్ర ఉద్రిక్తత)

మల్లన్నసాగర్ ప్రాజెక్టు వ్యతిరేకంగా నిరసన తెలిపేందుకు వెళుతోన్న మహిళలను పోలీసులు అడ్డుకొని పాశవికంగా కొట్టడం, లాఠీచార్జ్ చేయడంతో జిల్లా మొత్తం ఒక్కసారిగా వేడెక్కింది. మహిళలపై పోలీసుల లాఠీచార్జ్ ను నిరసిస్తూ అఖిలపక్షం సోమవారం మెదక్ జిల్లా బంద్ కు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో తాను విదేశీ పర్యటనకు వెళ్లడం సమంజసం కాదనే ఉద్దేశంతోనే మంత్రి హరీశ్ రావు పర్యటన రద్దు నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలిసింది. (మల్లన్న సాగర్‌ కట్టితీరుతాం)


షెడ్యూల్ ప్రకారం మంత్రి హరీశ్, ఇతర ఉన్నతాధికారులు.. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి కీలకమైన పంపులు, పరికరాలను పరిశీలించేందుకు జపాన్ వెళ్లాల్సిఉంది. ఈ నెల 31 వరకు జపాన్లోను ఉండి, తర్వాత ఆస్ట్రియాకు వెళతారు. ఆగస్టు 6న తిరిగి రాష్ట్రానికి తిరిగి రావాల్సిఉంది. ఆయన వెంట నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్‌కె జోషితో పాటు కాళేశ్వరం ప్రాజెక్టు చీఫ్‌ ఇంజనీర్‌ ఎన్‌. వెంకటేశ్వర్లు, సర్కిల్‌-2 ఎస్‌ఈ పి. వెంకట రాములు, సిరిసిల్ల ఈఈ ఎస్‌.ప్రభాకర్‌, టీఎస్‌ జెన్‌కో ఎస్‌ఈ కే శ్రీనివాసరెడ్డిలు మంత్రి వెంట జపాన్‌ బయలుదేరారు. ఆస్ట్రియా వెళ్ళే బృందంలో తెలంగాణ నీటిపారుదల శాఖ ఇంజనీర్‌ ఇన్‌ చీఫ్‌ మురళీధర్‌ రావు , చీఫ్‌ ఇంజనీర్‌ హరిరామ్‌, ఎస్‌ఈ కేఎస్‌ఎస్‌ చంద్రశేఖర్‌, సిద్దిపేట ఈఈ కేఎన్‌ ఆనంద్‌, జెన్‌కో డివిజనల్‌ ఇంజనీర్‌ జే శ్రీనివాస్‌లు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement