
ముందుంది ముసళ్ల పండగ
నల్లధనం కక్కించేందుకు మరిన్ని చర్యలు
• జపాన్ పర్యటనలో అక్కడి భారతీయులతో ప్రధాని మోదీ
• నిజాయితీకి తగిన గౌరవం.. తప్పు చేస్తే తప్పదు మూల్యం
• జపాన్ పర్యటనలో అక్కడి భారతీయులతో ప్రధాని మోదీ
• 70 ఏళ్ల క్రితం దాచింది కూడా బయటకు రప్పిస్తా..
• ప్రజలు నోట్ల విషయంలో ఇబ్బందులు పడుతున్నా పెద్దనోట్ల రద్దు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు
• జపాన్ పర్యటనలో అక్కడి భారతీయులతో ప్రధాని మోదీ
కోబే: పాతనోట్ల రద్దుతో నల్లధనం బయటకు వస్తోందని.. పెద్దమొత్తంలో దాచిపెట్టిన బ్లాక్‌మనీని బయటకు తీసుకొచ్చేందుకు మరిన్ని చర్యలు చేపడుతున్నట్లు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. జపాన్ పర్యటనలోఉన్న మోదీ అక్కడి భారతీయులతో మాట్లాడారు. డిసెంబర్ 30 వరకు పాతనోట్లను జనాలు మార్చుకోవచ్చని.. ఆ తర్వాత బయటపడే మొత్తానికి తగిన మూల్యం చెల్లించక తప్పదన్నారు. నల్లధనం దాచుకున్న వారికి మరిన్ని కష్టాలు తప్పవనే సంకేతాలిచ్చిన ప్రధాని.. ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నా దేశ శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని సహకరిస్తున్నారన్నారు. ‘నిజారుుతీగా ఉన్న వారికి ఇబ్బందేం లేదు. ఎవరి అకౌంట్లలోనైనా లెక్కకు అందనివి ఏమైనా బయటపడితే.. స్వాతంత్య్రం వచ్చినప్పటినుంచి వారి లెక్కలను బయటకు తీస్తా.
ఇందుకోసం అదనంగా ఉద్యోగులను పెట్టుకుంటాం. ఎవరినీ వదిలిపెట్టేది లేదు. నా గురించి తెలిసిన వాళ్లంతా చాలా తెలివైన వాళ్లే. అందుకే బ్యాంకుల్లో వేసే బదులు గంగలో వేద్దామని చూస్తున్నారు’ అని మోదీ తెలిపారు. పాతనోట్ల రద్దీని ‘స్వచ్ఛ అభియాన్’గా అభివర్ణించిన ప్రధాని మోదీ.. ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నా నవంబర్ 8 న ఇచ్చిన ప్రకటనకు సహకరిస్తున్నారన్నారు. ‘దేశ ప్రజలందరికీ నా సెల్యూట్. ప్రజలు నాలుగు, ఆరు గంటలపాటు క్యూలైన్లలో నిలబడుతున్నారు. కానీ జాతి శ్రేయస్సు కోసం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. ప్రజలకు కొన్ని రోజులు ఇబ్బందులు తప్పవనే విషయం ఊహించిందే.
కానీ దీన్ని రహస్యంగా ఉంచాల్సిన అవసరముంది. అరుునా ప్రజలు వారి ఆశీర్వాదాలు అందిస్తూనే ఉన్నారు. 2011 సునామీ, భూకంపం విపత్తు తర్వాత జపాన్ ప్రజలు కూడా ఇలాగే ప్రభుత్వానికి సహకరించారు’ అని మోదీ తెలిపారు. ‘నిజారుుతీగా ఉండే వారిని కాపాడేందుకు ప్రతిక్షణం ప్రభుత్వం పనిచేస్తోంది. కానీ తప్పు చేసిన వారు తగిన మూల్యం చెల్లించక తప్పదు గుర్తుపెట్టుకోండి. నల్లధనం బయటపెట్టండని కావాల్సినంత సమయం ఇచ్చాం. ఇక మీ ఇష్టం. మీ కుటుంబం, పిల్లల గురించి ఆలోచించండి’ అని మోదీ తెలిపారు. ‘ప్రజలను అవాస్తవాలతో భయపెట్టిద్దామని ఓ వర్గం వీలైనంత ప్రయత్నం చేస్తోంది. ప్రభుత్వ తీరును వ్యతిరేకించేలా రెచ్చగొడుతోంది. అందరికీ ఒకే చట్టం వర్తిస్తుందనే విషయాన్ని గుర్తుంచుకోవాల’న్నారు. రెండేళ్లలో ప్రభుత్వం తీసుకున్న వివిధ చర్యల ద్వారా రూ.1.25 లక్షల కోట్ల నల్లధనం బయటకు వచ్చిందన్నారు.
ఎఫ్‌డీఐల్లో పెరుగుదల..: భారతదేశ ఆర్థిక వ్యవస్థ వేగంగా ఎదుగుతోందనే విషయాన్ని ప్రపంచమంతా గుర్తిస్తోందని.. ఇందులో భాగంగానే దేశానికి పెద్దమొత్తంలో ఎఫ్‌డీఐలు వస్తున్నాయని మోదీ తెలిపారు. ‘అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్), ప్రపంచ బ్యాంకు భారత వృద్ధి గురించి ఒకే మాట చెబుతున్నారుు. భారత్ మెరుస్తున్న నక్షత్రమని ఐఎంఎఫ్ అంటోంది. ప్రపంచ ఆర్థిక వేత్తలు భారత్ చాలా వేగంగా వృద్ధి రేటు సాధిస్తోందంటున్నారు. ఎఫ్‌డీఐ విషయంలో నా దృష్టిలో రెండు నిర్వచనాలున్నారుు. మొదటిది ఫస్ట్ డెవలప్ ఇండియా, రెండోది ఫారిన్ డెరైక్ట్ ఇన్వెస్ట్‌మెంట్’ అని ప్రధాని అన్నారు.
బుల్లెట్ రైలును నడిపిన మోదీ
జపాన్‌తో పారిశ్రామిక భాగస్వామ్యాన్ని కోరుకుంటున్నామని వెల్లడి
కోబే/ఒసాకో: జపాన్ ప్రధాని షింబో అబేతో కలసి మోదీ శనివారం టోక్యో నుంచి కొబేకు హైస్పీడ్ బుల్లెట్ రైల్లో ప్రయాణించారు. అబేతో కలసి డ్రైవర్ క్యాబిన్‌లోకి వెళ్లిన మోదీ కాసేపు డ్రైవర్ సీట్లో కూర్చుని ఆపరేట్ చేశారు. గంటకు 240 నుంచి 320 కిలో మీటర్ల వేగంతో దూసుకుపోయే ఇలాంటి రైలును ముంబై-అహ్మదాబాద్ మధ్య ప్రవేశపెట్టాలని యోచిస్తున్నారు. అనంతరం వ్యాపార, రాజకీయ ప్రముఖులతో ఇరువురు నేతలు భేటీ అయ్యారు. వీరి సమక్షంలో గుజరాత్, జపాన్ మధ్య ఒప్పందం కుదిరింది. జపాన్ పారిశ్రామిక రంగంతో భారత్ కీలక భాగస్వామ్యాన్ని కోరుకుంటోందని మోదీ అన్నారు. ఇది ఇరు దేశాలకు ఎంతో లాభ దాయకమని కోబేలో వ్యాపారవేత్తలతో మోదీ అన్నారు. అబేతో కలసి బుల్లెట్ రైలు నడిపిన చిత్రాలను మోదీ ట్విటర్‌లో పోస్టు చేశారు.
స్వదేశానికి మోదీ..: మూడు రోజుల జపాన్ పర్యటన ముగించుకుని మోదీ శనివారం స్వదేశానికి తిరుగు ప్రయాణమయ్యారు. పౌర అణు ఇంధనంపై ఇరు దేశాలు సంతకాలు చేయడంతో పాటు మరో 9 ఒప్పందాలు ఈ పర్యటనలో జరిగారుు. మోదీ పర్యటనతో ద్వైపాక్షిక సంబంధాలు బలపడ్డాయని భారత్ పేర్కొంది.