
న్యూఢిల్లీ: భారత ప్రధాని మోదీకి జపాన్ ప్రధాని షింజో అబే అరుదైన ఆతిథ్యం ఇవ్వనున్నారు. ఈ నెల 28, 29వ తేదీల్లో జపాన్‌లో పర్యటన సందర్భంగా ప్రధాని షింజో అబే తన విశ్రాంతి గృహానికి మోదీని ఆహ్వానించారు. యమనషి ప్రావిన్స్‌లో కొండల మధ్య ఉన్న సుందరమైన ఆ విశ్రాంతి గృహానికి ఒక విదేశీ నేతను అబే ఆహ్వానించటం ఇదే ప్రథమం. ఈ సందర్భంగా ఇద్దరు ప్రధానులు అక్కడి హోటల్‌లో మధ్యాహ్నం విందు చేయనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment