సాక్షి, న్యూఢిల్లీ: ఏపీ సీఎం చంద్రబాబు త్వరలో జపాన్‌లో పర్యటించనున్న నేపథ్యంలో అక్కడ చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చించేందుకు ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రతినిధి కంభంపాటి రామ్మోహన్‌రావు గురువారం ఆ దేశానికి చెందిన ప్రతినిధులతో సమావేశమయ్యారు. భారత్‌లో జపాన్ రాయబారి టకేషీయోగీ నిర్వహించిన జపాన్ ఇండియా బిజినెస్ కోఆర్డినేషన్ కమిటీ(జేఐబీసీసీ) సమావేశంలో కంభంపాటితోపాటు ఏపీ పరిశ్రమలశాఖ ప్రధాన కార్యదర్శి ప్రసాద్, పట్టణాభివృద్ధిశాఖ ప్ర ధాన కార్యదర్శి సాంబశివరావు, పరిశ్రమలశాఖకార్యదర్శి అజయ్‌జైన్ పాల్గొన్నారు.
ఎన్‌టీఆర్ పేరు పెట్టడం హర్షణీయం: హైదరాబాద్‌లోని శంషాబాద్ విమానాశ్రయంలోని డొమెస్టిక్ టెర్మినల్‌కు ఎన్‌టీఆర్ పేరు పెడుతూ పౌరవిమానయాన శాఖ ఉత్తర్వులు జారీ చేయటంపై కంభంపాటి హర్షం వ్యక్తం చేశారు.
జపాన్ బృందంతో కంభంపాటి భేటీ
Published Fri, Nov 21 2014 3:06 AM | Last Updated on Sat, Sep 2 2017 4:49 PM
Advertisement