టీచర్ అవతారమెత్తిన నరేంద్ర మోడీ
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉన్నట్టుండి ఉపాధ్యాయుడి అవతారం ఎత్తారు. జపాన్ పర్యటన ఆయనలోని ఈ కళను కూడా బయటకు తీసింది. నాలుగు రోజుల పర్యటన కోసం జపాన్ వెళ్లిన నరేంద్రమోడీ, అక్కడి అత్యంత పురాతన పాఠశాలలు కొన్నింటిని సందర్శించారు. స్కూలు పిల్లలు జపాన్, భారతదేశ పతాకాలను చేతబట్టి, మోడీని సాదరంగా స్వాగతించారు.
అక్కడ ఒకచోట సంగీతం క్లాసులు జరుగుతుండగా ఆయన ఉపాధ్యాయుడిలా కాసేపు వాళ్లకు పాఠాలు బోధించారు. స్వయంగా భారతదేశ ప్రధానమంత్రే తమకు క్లాసు చెబుతుండటంతో పిల్లలు ఉప్పొంగిపోయారు. అనంతరం క్యోటోలోని కిన్కాను జి, టో జి (స్వర్ణ దేవాలయం) ఆలయాల్లో మోడీ కాసేపు ప్రార్థనలు జరిపారు. ఈ రెండూ జపాన్లో అత్యంత ప్రముఖ దేవాలయాలు.