music teacher
-
విద్యార్థినిపై మాష్టారు లైంగిక వేధింపులు..బట్టలూడదీసి..
పాట్నా: పాఠాలు చెప్పాల్సిన మాష్టారు తన వయసులో సగం కంటే తక్కువ వయసున్న విద్యార్థినిని లైంగిక వేధింపులకు గురి చేస్తుండగా ముగ్గురు ఆగంతకులు వారిని వివస్త్రుల్ని చేసి దేహశుద్ధి చేశారు. ఈ సంఘటన తాలూకు వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. వెంటనే పోలీసులు స్పందించి ఆ మాష్టారిని అరెస్టు చేసి పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశామని ప్రాధమిక విచారణ జరుగుతోందని ఈ జంటను వేధించిన ముగ్గురి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్టు తెలిపారు. వీడియో బయటకు రావంతో.. బెగుసరై జిల్లా ఎస్పీ యోగేంద్ర కుమార్ తెలిపిన వివరాల ప్రకారం పత్ కౌలా గ్రామం తెగ్రా పోలీస్ స్టేషన్ పరిధిలో సంగీతం టీచరుగా పనిచేస్తున్న కిషన్ దేవ్ చౌరాసియా(45) మైనర్ బాలిక(20) తో అసభ్యంగా ప్రవర్తిస్తుండటాన్ని స్థానిక యువకులు ముగ్గురు గమనించి వారిపై దాడి చేసి ఇద్దరి బట్టలు ఊడదీశారు. ఈ సంఘటన మొత్తాన్ని వారు వీడియో కూడా తీశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో బయటకు పొక్కడంతో తాము రంగంలోకి దిగి ప్రాధమిక విచారణ చేపట్టామని తెలిపారు. తప్పుడు రాగం.. ట్యూషన్ చెప్పడానికి వచ్చి తనను లైంగికంగా వేధించారని మైనర్ బాలిక ఇచ్చిన ఫిర్యాదు మేరకు మ్యూజిక్ టీచర్ కిషన్ సింగ్ చౌరాసియా పై పోక్సో చట్టం, ఏసీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం తోపాటు మరికొన్నిసెక్షన్ల కింద కేసులు నమోదు చేసి అతడిని అదుపులోకి తీసుకున్నామన్నారు ఎస్పీ. ఈ జంట పట్ల అమానుషంగా వ్యవహరించిన ఆ ముగ్గురు యువకులు పరారీలో ఉన్నారని వారి కోసం గాలిస్తున్నామని తెలిపారు. ఇది కూడా చదవండి: యూపీలో దారుణం.. చెల్లెలి తల నరికి.. -
గవర్నమెంట్ స్కూల్ కుర్రోడి ప్రతిభ.. 'స్టార్లను తయారుచేసేది టీచర్లే కదా'
కేరళకు చెందిన ఓ విద్యార్థి అద్భుతంగా డ్రమ్ము వాయిస్తున్న వీడియో ఒకటి వైరల్‌గా మారింది. కేరళలోని వయనాడ్‌కు చెందిన ఓ ప్రభుత్వ పాఠశాలలో అంజనాకుమార్ అనే టీచర్ ఓ జానపద గీతాన్ని క్లాస్‌రూంలోనే ఆలపించగా, ఆ పాట రిథమ్‌కు తగ్గట్టుగా స్కూల్ బెంచ్ మీదే అభిజీత్ అనే విద్యార్థి అత్భుతంగా వాయించాడు. ఈ వీడియోను క్లాస్ టీచర్ ఫేస్బుక్లో పోస్ట్ చేయగా 24గంటల్లోనే లక్షకు పైగా లైక్స్ వచ్చాయి. టీచర్ పాటకు అభిజీత్ అద్భుతంగా డ్రమ్ వాయించాడంటూ నెటిజన్లు తెగ మురిసిపోతున్నారు. చిన్నారి ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడం నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటుంది. స్టార్లను తయారుచేసేదే టీచర్లే అంటూ కామెంట్స్ చేస్తున్నారు. This video that has gone viral in Kerala landed in my inbox as I woke up today in Araku. It is a Wayanad folk song sung by a music teacher who had spotted the drumming talent of this student and joined him in an impromptu session in school. It is teachers that create stars. pic.twitter.com/OzvUIiUDvR — Manoj Kumar (@manoj_naandi) July 5, 2023 ఇక అభిజీత్ ప్రతిభకు మినిస్టర్లు, ఎమ్మెల్యేలు వంటి ప్రముఖుల నుంచి పెత్త ఎత్తున ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. మట్టిలో మాణిక్యం అంటూ అతడి టాలెంట్‌కు అందరూ ఫిదా అవుతున్నారు. -
టీచర్ మిస్సింగ్ కేసు..అసలు విషయం తెలిసి నివ్వెరపోయిన పోలీసులు
ఆఫ్రికాలో గతేడాది తప్పిపోయిన ఓ సంగీతం టీచర్ దారుణమైన హత్యకు గురయ్యాడు. తన రూమ్మేట్సే అతన్ని కడతేర్చిన ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన కాంగోలోని బ్రజ్జావిల్లేలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..గతేడాది అక్టోబర్ 26న ఆస్ట్రేలియన్ సంగీత ఉపాధ్యాయుడు మార్క్ సియవరెల్ల ఆఫ్రికాలోని కాంగోలో కనిపించకుండాపోయాడు. అప్పటిన నుంచి అంతు చిక్కని మిస్సింగ్ కేసుగా ఉండిపోయింది. ఎట్టకేలకు ఆ కేసు చిక్కుముడి వీడింది. కానీ అతడ్ని అంతమొందించిన విధానం విని పోలీసులను ఒక్కసారిగా కంగుతిన్నారు. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం..న్యూసౌత్ వేల్స్‌లోని లీటన్కు చెందిన 57 ఏళ్ల మార్క్ సియవరెల్లా ఆరేళ్ల క్రితం ఆప్రికా దేశానికి వెళ్లాడు. అక్కడ అతను మొదటగా అమెరికన్ ఇంటర్నేషనల్ స్కూల్లో ఇంగ్లీష్ తోపాటు సంగీతాన్ని భోధించే ఉపాధ్యాయుడిగా పనిచేసేవాడు. ఆ తర్వాత ఇటీవలే ఫ్రెంచ్ కాన్సులర్ స్కూల్‌కు మారారు. అతను కాంగోలోని బ్రజ్జావిలేలోని అపార్ట్మెంట్లోన తన స్నేహితుడి కలిసి ఉంటున్నాడు. ఇంతలో అతని పాత సహచరుడు, రూమ్మేట్ క్లెమెంట్ బెబెకా అనే వ్యక్తి మార్క్ వద్దకు వచ్చాడు. కాసేపు అక్కడే అపార్ట్మెంట్లో ముగ్గురు కలిసి చాలాసేపు మాట్లాడుకున్నారు. ఇంతలో మార్క్ వాష్‌రూమ్‌కి వెళ్లగానే ఆ ఆపార్ట్‌మెంట్‌లో ఉన్న వ్యక్తి మార్క్ ఇంకొద్దిరోజుల్లో ఆస్ట్రేలియా వెళ్లిపోతున్నట్లు అతని రూమ్మేట్తో చెప్పాడు. అంతేగాదు అతను ఇక్కడ నుంచి వెళ్లిపోతే మనకేం ప్రయోజనం ఉండదు అని మార్క్ రూమ్మేట్తో అన్నాడు. దీంతో బెబెకా అయితే ఏం చేద్దాం మరీ అని అతడిని అడిగాడు. అందుకని అతన్ని కడతేర్చి అతని వద్ద నుంచి ఎంత కొంత సొమ్ము దుండుకుందా అని సలహ ఇచ్చాడు. ఇంతలో మార్క్ తాగి వదిలేసిన మందు గ్లాస్లో పాయిజన్ వేసి అక్కడ టేబుల్ మీద ఉంచాడు అదే అపార్ట్మెంట్లో ఉంటున్న వ్యక్తి. ఇంతలో వాష్‌రూమ్ నుంచి వచ్చిన మార్క్ వారితో మాట్లాడుతూ.. ఆ గ్లాస్‌లోని పాయిజన్‌ని తాగేశాడు. కాసేపటికే స్ప్రుహ తప్పి పడిపోయాడు. దీంతో తామిద్దం మార్క్‌ని ఒక బెడ్‌షీట్‌లో చుట్టి మొసళ్లు అధికంగా ఉండే కాంగో నదిలో పడేశామని బెబెకా చెప్పాడు. ఐతే మార్క్ వద్ద పెద్ద మొత్తంలో డబ్బులు లేవని అతని వద్ద ఉన్న బ్యాంకు కార్డుల సాయంతో డబ్బులు కొట్టేశామని పోలీసలుకు వివరించాడు. కనీసం కుటుంబసభ్యులకు చివరి చూపుకూడా దక్కనీయకుండా అత్యంత ఘోరంగా హతం చేసిన విధానం పోలీసులను షాక్ గురి చేసింది. ఈ విషయాన్ని మార్క్ కుటుంబసభ్యులు విని కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈ మేరకు పోలీసులు సదరు నిందితుడిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేయడమే గాక కోర్టు ముందు హాజరుపర్చనున్నట్లు తెలిపారు. (చదవండి: కాలిఫోర్నియా కాల్పుల ఘటన: పట్టుబడతానన్న భయంతో నిందితుడు..) -
స్త్రీ శక్తి: ఆర్మీ లాయర్ అఖిల
‘అఖిల నారాయణ్ గురించి కాస్త చెప్పండి’ అని అడిగితే... సమాధానం తట్టక బుర్ర గోక్కునేవాళ్లు ఉండొచ్చు. సినిమాలు ఎక్కువగా చూసే వాళ్లు అయితే ‘ఆ..గుర్తొచ్చింది. పోయిన సంవత్సరం ఒక సినిమాలో నటించింది కదా!’ అంటారు. అరుల్ దర్శకత్వంలో వచ్చిన తమిళ్ హారర్ మూవీ ‘కదంపారీ’లో అఖిల నటించింది. అయితే ఇప్పుడు ఆమె గురించి చెప్పుకోవడానికి ఈ హారర్ సినిమా మాత్రమే అక్కర్లేదు. యూఎస్‌లో భారత సంతతికి చెందిన అఖిల తాజాగా అక్కడి సైన్యంలో లాయర్‌గా చేరింది. ‘భేష్’ అనిపించుకుంటోంది. లీగల్ అడ్వైజర్‌గా ఆమె సేవలు అందించనుంది. ‘యూఎస్ ఆర్మీ కంబాట్ ట్రైనింగ్’లో కొన్ని నెలల పాటు కఠినమైన శిక్షణ పొందింది అఖిల. రెడ్, వైట్, బ్లూ...అనే మూడు దశల్లో సాగే ఆర్మీ కంబాట్ ట్రైనింగ్‌లో వెపన్ ఆపరేటింగ్, వారియర్ టాస్క్, బ్యాటిల్ డ్రిల్స్, టాక్టికల్ స్కిల్...మొదలైనవాటిలో శిక్షణ ఇస్తారు. అఖిలకు సంగీతం అంటే బోలెడు ఇష్టం. ‘నైటింగిల్ స్కూల్ ఆఫ్ మ్యూజిక్’ పేరుతో ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తోంది. -
గురువు మృతి: సింగర్ సునీత భావోద్వేగం
అమృతం లాంటి గాన మాధుర్యం సింగర్ సునీత సొంతం. పలకడానికే కష్టంగా ఉండే లైన్లను కూడా ఆమె ఏమాత్రం తత్తరపాటు లేకుండా అవలీలగా పాడేసి సింపుల్ అనిపించేస్తుంది. ఆమె పాడితే పాటకే అందం వస్తుంది. ఇలా ఎన్నో గొప్ప లక్షణాలు ఉండటం వల్లే ఆమె ఎన్నో ఏళ్లుగా టాలీవుడ్లో టాప్ సింగర్‌గా విరాజిల్లుతోంది. కాగా తనకు ఈ సరిగమలు నేర్పించిన గొంతు అకస్మాత్తుగా మూగబోయింది. తన సంగీత గురువు పెమ్మరాజు సూర్యారావు కన్నుమూశారు. ఈ విషయాన్ని సునీత సోషల్ మీడియా వేదికగా వెల్లడిస్తూ భావోద్వేగానికి లోనైంది. "పెమ్మరాజు సూర్యారావు గారు .. చిన్నప్పుడు నాకు సరిగమల భిక్ష పెట్టిన నా గురువు.. స్వర్గస్థులయ్యారు. ఇలాంటి మహానీయుల్ని కోల్పోతుంటే చాలా బాధగా ఉంది" అని రాసుకొచ్చింది. ఈ మేరకు ఆయన ఫొటోను కూడా షేర్ చేసింది. ఇది చూసిన ఆమె అభిమానులు ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ కామెంట్లు పెడుతున్నారు. (చదవండి: సింగర్ సునీత పెళ్లి.. నాగబాబు కామెంట్స్) కాగా ఎన్నో ఏళ్ల పాటు ఒంటరి జీవితాన్ని గడిపిన సునీత ఈ మధ్యే వివాహ బంధంలోకి అడుగు పెట్టిన విషయం తెలిసిందే. శంషాబాద్ సమీపంలోని అమ్మపల్లి శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో వ్యాపారవేత్త రామ్ వీరపనేని పెళ్లి చేసుకుని కొత్త ప్రయాణాన్ని ఆరంభించింది. ఈ పెళ్లి వేడుకకు సంబంధించిన వీడియోలను సైతం ఆమె తన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేసింది. ఇక పెళ్లి తర్వాత తొలిసారిగా భర్తతో కలిసి దిగిన ఫొటోను బుధవారం షేర్ చేసింది. (చదవండి: 57వ ఏట మళ్లీ ప్రేమను అనుభూతి చెందాను) View this post on Instagram A post shared by Sunitha Upadrasta (@upadrastasunitha) -
పేరిణిలో ‘రజిత’
సాక్షి, నిర్మల్ అర్బన్: టీఎస్‌డబ్ల్యూఆర్‌ఎస్ బాలికల జూనియర్ కళాశాలలో ప్రభుత్వ మ్యుజిక్ టీచర్‌గా పని చేస్తున్న ఎట్టెం రజిత రాజన్న సిరిసిల్ల జిల్లాలోని తంగళ్లపల్లి మండల కేంద్రం వాస్తవ్యురాలు. నృత్య కళలోనే ప్రత్యేకత సంతరించుకున్న ‘పేరిణి’లో ఆమె కళాకారిణిగా, శిక్షకురాలిగా రాణిస్తున్నారు. తాను నమ్మిన కళే తనకు ఉద్యోగాన్ని చూపించిందనే రజిత గర్వంగా చెబుతారు. వివాహానంతరం కూడా శిక్షణను కొనసాగించిన రజిత ఓవైపు డిప్లొమాలాంటి సర్టిఫికెట్ కోర్సులు చేస్తూనే మరోవైపు అనేక మందికి శిక్షణనిచ్చారు. ఈ క్రమంలోనే పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో ఆంధ్రనాట్యంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. దేశవ్యాప్తంగా పేరిణి నృత్య ప్రదర్శనలు ఇచ్చిన రజిత పద్మశ్రీ డాక్టర్ నటరాజ రామకృష్ణ చేతుల మీదుగా నాట్యచూడామణి, ప్రభుత్వ సలహాదారుడు డాక్టర్ రమణాచారి చేతుల మీదుగా హంసవాణి అవార్డులను అందుకున్నారు. 2017 అంతర్జాతీయ మహిళ దినోత్సవం సందర్భంగా కేటీఆర్ చేతుల మీదుగా ప్రశంసాపత్రం, విజయవాడ కళాక్షేత్రం వారి నాట్య కౌముది, పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ వీసీ చేతుల మీదుగా కళాభూషణ, అసోంలోని సాలోరి ఆర్ట్స్ ఆకాడమీ వారి బెస్ట్ డ్యాన్స్ కొరియోగ్రాఫర్‌గా ప్రశంసా పత్రాలు అందుకున్నారు. రవీంద్రభారతిలో నిర్వహించిన పేరిణి నృత్యోత్సవంలో కల్చరల్ డైరెక్టర్ మామిడి హరికృష్ణ చేతుల మీదుగా ఉత్తమ నాట్యాచారిణి, బాంబేలో ప్లయింగ్ స్టెరో కంపెనీ వారి బెస్ట్ కొరియోగ్రాఫర్ ప్రశంసాపత్రాలు అందుకున్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ సంబురాల్లో జిల్లా ఉత్తమ కళాకారిణిగా కలెక్టర్ ప్రశాంతి రజితకు అవార్డును అందజేశారు. అలాగే ప్రపంచ తెలుగు మహాసభలో ఉత్తమ పేరిణి కళాకారిణిగా ప్రశంసాపత్రాలు అందుకున్న రజిత తెలంగాణ రాష్ట్ర జానపద కళాకారుల సంఘం జిల్లా అధ్యక్షురాలిగా కూడా సేవలందిస్తున్నారు. -
సంగీతం మాస్టారు అదృశ్యం
శంషాబాద్: ముంబైకి చెందిన ఓ సంగీతం మాస్టారు శంషాబాద్ విమానాశ్రయంలో అదృశ్యమయ్యారు. ఆర్జీఐఏ పోలీస్‌స్టేషన్ ఎస్ఐ శ్రీనివాస్ కథనం ప్రకారం.. ముంబై వర్లీలోని జీఎం భోస్లే రోడ్డులో నివాసం ఉండే సంజయ్ మిస్త్రీ(33) అక్కడ ఓ పాఠశాలలో సంగీతం మాస్టారుగా పనిచేస్తున్నారు. వారం క్రితం విజయవాడలో జరిగిన ఓ కార్యక్రమానికి పది మంది బృందంతో ఆయన పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం సంగీతం బృందం సభ్యులంతా కలసి ఈనెల 16వ తేదీన సాయంత్రం ముంబై వెళ్లడానికి ఎయిర్ ఇండియా విమానంలో హైదరాబాద్‌కు చేరుకున్నారు. మిగతా బృందం ముంబై బయలుదేరగా తాను తర్వాత వస్తానని సంజయ్ సహచరులకు చెప్పారు. అప్పటి నుంచి అతడి ఫోన్ స్విచ్ఆఫ్ వస్తోంది. సంజయ్ ఇంటికి చేరుకోకపోవడంతో అతడి భార్య శ్వేతమిస్త్రీ గురువారం ఆర్జీఐఏ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తులో ఉంది. -
టీచర్ అవతారమెత్తిన నరేంద్ర మోడీ
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉన్నట్టుండి ఉపాధ్యాయుడి అవతారం ఎత్తారు. జపాన్ పర్యటన ఆయనలోని ఈ కళను కూడా బయటకు తీసింది. నాలుగు రోజుల పర్యటన కోసం జపాన్ వెళ్లిన నరేంద్రమోడీ, అక్కడి అత్యంత పురాతన పాఠశాలలు కొన్నింటిని సందర్శించారు. స్కూలు పిల్లలు జపాన్, భారతదేశ పతాకాలను చేతబట్టి, మోడీని సాదరంగా స్వాగతించారు. అక్కడ ఒకచోట సంగీతం క్లాసులు జరుగుతుండగా ఆయన ఉపాధ్యాయుడిలా కాసేపు వాళ్లకు పాఠాలు బోధించారు. స్వయంగా భారతదేశ ప్రధానమంత్రే తమకు క్లాసు చెబుతుండటంతో పిల్లలు ఉప్పొంగిపోయారు. అనంతరం క్యోటోలోని కిన్కాను జి, టో జి (స్వర్ణ దేవాలయం) ఆలయాల్లో మోడీ కాసేపు ప్రార్థనలు జరిపారు. ఈ రెండూ జపాన్‌లో అత్యంత ప్రముఖ దేవాలయాలు.