Bihar: Minor Girl Music Teacher Caught In Intimate Act Stripped Thrashed - Sakshi
Sakshi News home page

బీహార్‌లో అమానుషం.. విద్యార్థినిపై మాష్టారు లైంగిక వేధింపులు..

Published Sat, Jul 22 2023 4:23 PM | Last Updated on Sat, Jul 22 2023 4:54 PM

Minor Girl Music Teacher Caught In Intimate Act Stripped Thrashed - Sakshi

పాట్నా: పాఠాలు చెప్పాల్సిన మాష్టారు తన వయసులో సగం కంటే తక్కువ వయసున్న విద్యార్థినిని లైంగిక వేధింపులకు గురి చేస్తుండగా ముగ్గురు ఆగంతకులు వారిని వివస్త్రుల్ని చేసి దేహశుద్ధి చేశారు. ఈ సంఘటన తాలూకు వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. వెంటనే పోలీసులు స్పందించి ఆ మాష్టారిని అరెస్టు చేసి పోక్సో  చట్టం కింద కేసు నమోదు చేశామని ప్రాధమిక విచారణ జరుగుతోందని ఈ జంటను వేధించిన ముగ్గురి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్టు  తెలిపారు.    

వీడియో బయటకు రావంతో.. 
బెగుసరై జిల్లా ఎస్పీ యోగేంద్ర కుమార్ తెలిపిన వివరాల ప్రకారం పత్ కౌలా గ్రామం తెగ్రా పోలీస్ స్టేషన్ పరిధిలో సంగీతం టీచరుగా పనిచేస్తున్న కిషన్ దేవ్ చౌరాసియా(45) మైనర్ బాలిక(20) తో అసభ్యంగా ప్రవర్తిస్తుండటాన్ని స్థానిక యువకులు ముగ్గురు గమనించి వారిపై దాడి చేసి ఇద్దరి బట్టలు ఊడదీశారు. ఈ సంఘటన మొత్తాన్ని వారు వీడియో కూడా తీశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో బయటకు పొక్కడంతో తాము రంగంలోకి దిగి ప్రాధమిక విచారణ చేపట్టామని తెలిపారు. 

తప్పుడు రాగం.. 
ట్యూషన్ చెప్పడానికి వచ్చి తనను లైంగికంగా వేధించారని మైనర్ బాలిక ఇచ్చిన ఫిర్యాదు మేరకు మ్యూజిక్ టీచర్ కిషన్ సింగ్ చౌరాసియా పై పోక్సో చట్టం, ఏసీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం తోపాటు మరికొన్నిసెక్షన్ల కింద కేసులు నమోదు చేసి అతడిని అదుపులోకి తీసుకున్నామన్నారు ఎస్పీ. ఈ జంట పట్ల అమానుషంగా వ్యవహరించిన ఆ ముగ్గురు యువకులు పరారీలో ఉన్నారని వారి కోసం గాలిస్తున్నామని తెలిపారు. 

ఇది కూడా చదవండి: యూపీలో దారుణం.. చెల్లెలి తల నరికి..    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement