
ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. మరికొన్ని నెలల్లో పెళ్లి చేసుకుని కొత్త జీవితంలోకి అడుగుపెట్టాలనుకున్న జంటకు ఊహించని అనుభవం ఎదురైంది. ఏదో సరదాగా అమ్యూజ్‌మెంట్ పార్క్‌కు వెళ్లడమే వారి జీవితాన్ని మలుపు తిప్పింది. పార్క్‌లో జరిగిన ప్రమాదంలో తనకు కాబోయే భార్య చనిపోయింది.
వివరాల ప్రకారం.. నిఖిల్ అనే వ్యక్తికి ప్రియాంక(24)తో కుటుంబ సభ్యులు పెళ్లి నిశ్చయించారు. ఈ క్రమంలో వారిద్దరికీ ఫిబ్రవరిలో నిశ్చితార్థం జరిగింది. మరికొన్ని నెలల్లో వారికి పెళ్లి జరిగాల్సి ఉంది. అయితే, ఇద్దరూ సరదాగా తిరుగొద్దామని నైరుతి ఢిల్లీలోని కపషెరా ప్రాంతంలో ఉన్న ఫన్ అండ్ ఫుడ్ విలేజ్‌కు వెళ్లారు. కాసేపు అక్కడ తిరిగిన తర్వాత అమ్యూజ్‌మెంట్ పార్క్‌లో రోలర్ కోస్టర్ రైడ్ ఎక్కారు. హ్యాపీ మూమెంట్స్ ఎంజాయ్ చేస్తున్న సమయంలో రోలర్ కోస్టర్ స్టాండు విరిగిపోయింది. దీంతో, ప్రియాంక ఎత్తులో నుంచి కింద పడిపోయింది.
దీంతో వెంటనే కాబోయే భర్త నిఖిల్ ఆమెను సమీప హాస్పిటల్‌కు తరలించాడు. కానీ ఎలాంటి ఫలితం లేకపోయింది. అప్పటికే ఆ యువతి మృతి చెందినట్లు డాక్టర్లు వెల్లడించారు. దీంతో, ఒక్కసారిగా నిఖిల్ కుప్పకూలిపోయి కన్నీటిపర్యంతమయ్యాడు. ఇక, ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. మృతిచెందిన ప్రియాంక శరీరంపై తీవ్ర గాయాలు బట్టి.. ఈఎన్‌టీ రక్తస్రావం, కుడి కాలు చీలడం, ఎడమ కాలు మీద గాయం, కుడి ముంజేయి, ఎడమ మోకాలికి తీవ్ర గాయాలు అయినట్టు వైద్యులు వెల్లడించారు.
ఇదిలా ఉండగా.. చాణక్యపురికి చెందిన ప్రియాంక.. నోయిడాలోని సెక్టార్ 3లోని ఒక టెలికాం కంపెనీలో మేనేజర్‌గా పనిచేస్తున్నారు. ఆమెకు తల్లిదండ్రులతో పాటు ఒక సోదరుడు, ఒక సోదరి ఉన్నారు.
Delhi | A 24-year-old woman, Priyanka lost her life after falling from a roller coaster ride at Fun and Food Village in the Kapashera area of Delhi yesterday. She reportedly lost her balance and fell from the ride, sustaining severe injuries. Despite being rushed to a nearby…
— ANI (@ANI) April 5, 2025