
బి.కొత్తకోట: పెళ్లయి ఏడాది గడిచి, పాప పుట్టిన తర్వాత మైనర్ బాలికను వివాహం చేశారని గుర్తించి కర్ణాటక రాష్ట్రం బట్లపల్లిలో కేసు నమోదు చేసిన వైనం ఆలస్యంగా వెలుగు చూసింది. సీఐ జీవన్ గంగనాథ్‌బాబు వివరాల మేరకు.. కర్ణాటకలోని బట్లపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓబులాపురానికి చెందిన లలితకు తల్లిదండ్రులు లేరు. ఏడాది కిందట 17 ఏళ్ల వయసులో బి.కొత్తకోట మండలం గుడిపల్లికి చెందిన మల్లి కార్జున(35)ను వివాహం చేసుకుంది.
లలిత గర్భం దాల్చడంతో కర్ణాటక రాష్ట్రం చింతామణి ప్రభుత్వ వైద్యశాలకు వెళ్లింది. అక్కడి వైద్యులు వయస్సు ఆరా తీసి బట్లపల్లి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి బి.కొత్తకోట మండలంలో వారు ఉండడంతో ఆ స్టేషన్‌కు బదిలీ చేశారు. జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఆదేశాలతో లలిత భర్త మల్లికార్జునపై ఫోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. ఈ దంపతులకు ఒక పాప కూడా పుట్టింది.