కలెక్టర్ కోన శశిధర్
నగరంపాలెం: జిల్లా కలెక్టర్, నగరపాలక సంస్థ ప్రత్యేక అధికారి కోన శశిధర్, అర్బన్ జిల్లా ఎస్పీ సీహెచ్ విజయారావు, నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా అనూరాధ ఫిబ్రవరి 13 నుంచి జపాన్ పర్యటనకు వెళ్లనున్నారు. సీఆర్‌డీఏ పరిధిలోని నగరాల్లో పబ్లిక్ రవాణా వ్యవస్థ ఏర్పాటుకు సంబంధించి సర్వే చేస్తున్న జపాన్ ఇంటర్నేషనల్ కార్పొరేషన్ ఏజెన్సీ (జైకా) సీఆర్‌డీఏ పరిధిలోని మున్సిపల్, పోలీస్ అధికారులను జపాన్ స్టడీ టూర్‌కు తీసుకెళ్తుంది.
ఈ బృందం జపాన్‌లో అమలవుతున్న కాంప్రహెన్సివ్ ట్రాఫిక్, ట్రాన్స్‌పోర్టేషన్ (సీటీటీ)ను ఫిబ్రవరి 15–19 వరకు పరిశీలించనుంది. జపాన్ వెళ్లే బృందంలో కలెక్టర్, ఎస్పీ, కమిషనర్‌తో పాటు ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ దినేష్ కుమార్, మున్సిపల్ అర్బన్ డెవలప్‌మెంట్ (సీఆర్‌డీఏ) ప్రిన్సిపల్ సెక్రటరీ అజయ్‌జైన్, విజయవాడ పోలీస్ కమిషనర్ గౌతమ్ సవాంగ్, సీఆర్‌డీఏ కమిషనర్ డాక్టర్ చెరుకూరి శ్రీధర్, విజయవాడ మున్సిపల్ కమిషనర్ జె.నివాస్, సీఆర్‌డీఏ ప్రిన్సిపల్ ప్లానర్ ఎన్.అరవింద్ ఉన్నారు. వీరు 21న భారత్‌కు తిరిగి రానున్నారు. ఈ మేరకు జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్ జపాన్ వెళ్లనున్న అధికారుల బాధ్యతలకు ఇన్‌చార్జులకు అప్పగిస్తూ గురువారం జీవో జారీ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment