Jaika funds
-
‘టెండర్ల’కు చెమటలు
సాక్షి, విజయవాడ : టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అవకతవకల ప్రక్షాళనకు కొత్త ప్రభుత్వం మొగ్గుచూపడంతో అధికారులు ఆ పనుల్లో నిమగ్నమయ్యారు. జలవనరుల శాఖలో అవినీతి.. ఆశ్రిత పక్షపాతం.. బంధుప్రీతితో జరిగిన టెండర్ల కేటాయింపుపై కొరడా ఝుళిపించేందుకు సిద్ధమయ్యారు. పాతిక శాతం దాటని పనులకు సంబంధించి టెండర్లను రద్దు చేయాలని ఉన్నతాధికారులకు సిఫార్సు చేశారు. జలవనరుల శాఖలో గత ప్రభుత్వ హయాంలో అనుమతించిన టెండర్లను అధికారులు సమీక్షిస్తున్నారు. 25 శాతం కంటే తక్కువ పనులు జరిగిన కాంట్రాక్టులను రద్దు చేయాలంటూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అమలు చేసే పనిలో నిమగ్నమయ్యారు. జిల్లాలో గతంలో కేటాయించిన పనులపై సమీక్షించి నత్తనడకన సాగుతున్న పనులను రద్దు చేయాలని ఉన్నతాధికారులకు సిఫార్సు చేస్తున్నారు. రూ.45 కోట్ల జైకా నిధులతో మున్నేరు అభివృద్ధి.. గత ఏడాది జైకా (జపాన్ ఇంటర్నేషనల్ కో–ఆపరేషన్ ఏజెన్సీ), వరల్డ్ బ్యాంకుల నుంచి వచ్చిన నిధులతో చెరువులు, కాలువల మరమ్మతులు చేపట్టారు. జైకా నుంచి వచ్చిన రూ.45 కోట్ల నిధులతో మున్నేరు మెయిన్ కెనాల్ అభివృద్ధి పనులు, చెరువుల అభివృద్ధి చేపట్టారు. 50 కిలోమీటర్ల పొడవు మున్నేరు కాలువ గట్ల బలోపేతం, ధ్వంసమైన బ్రిడ్జిలను తిరిగి నిర్మించడం వంటి కార్యక్రమాలను చేపట్టారు. ప్యాకేజ్–1లో ఐదు చెరువులు, ప్యాకేజ్–2లో ఏడు చెరువుల అభివృద్ధికి టెండర్లు పిలిచారు. వాస్తవంగా ఆన్లైన్ ద్వారా టెండర్లు దాఖలు చేసినప్పటికీ నాటి అధికార పార్టీ నేతలకు చెందిన కాంట్రాక్టర్లకే ఈ పనులు దక్కాయి. మున్నేరు ప్రధాన కాలువ పనులు 20 శాతం పూర్తికాగా.. ప్యాకేజ్ 1, 2లలో పనులు మాత్రం ఇంకా ప్రారంభం కాలేదు. దీంతో ఈ ప్రాజెక్టుపై ప్రస్తుత పరిస్థితి తెలియజేస్తూ ఒక నివేదికను సిద్ధం చేశారు. వరల్డ్ బ్యాంకు నిధులతో చెరువుల అభివృద్ధి.. వరల్డ్ బ్యాంకు నుంచి వచ్చిన సుమారు రూ.100 కోట్లతో పశ్చిమ కృష్ణాలోని 78 చెరువుల అభివృద్ధి పనులు చేపట్టారు. వరల్డ్ బ్యాంకు నిబంధనల ప్రకారం బాక్స్ టెండర్లు మాత్రమే వేయాల్సి ఉంది. ఇది తెలుగుదేశం నేతలకు వరంగా మారింది. జలవనరుల శాఖ మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అనుచరులకు తప్ప బయట కాంట్రాక్టర్లకు కనీసం టెండర్ ఫారాలు కూడా దక్కకుండా జాగ్రత్త పడ్డారు. వరల్డ్ బ్యాంకు నుంచి వచ్చిన నిధులతో రెడ్డిగూడెంలో 9 చెరువులు, గన్నవరంలో మూడు చెరువులు, మైలవరంలో నాలుగు చెరువులు, బాపులపాడులో 10 చెరువులు, ముసునూరులో 7 చెరువులు, చాట్రాయిలో 8 చెరువులు, విసన్నపేటలో 11 చెరువులు, నూజివీడులో 8 చెరువులు, తిరువూరులో 3 చెరువులు, విజయవాడ రూరల్‌లో ఒక చెరువు, కోడూరులో 4 చెరువులు, ఆగిరిపల్లిలో రెండు, ఏకొండూరు, గంపలగూడెంలో 4 చెరువులకు గట్ల బలోపేతం చేసి, పూడికలు తీసి చెరువుల ద్వారా సాగునీటి వసతికి ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు. ఐదు శాతం అధిక ధరలకు.. తొలుత టెండర్ల ధరలపై 25 శాతం అధిక రేట్లకు టెండర్లు వేశారు. అయితే దీనిపై అధికారులు అభ్యంతరాలు వ్యక్తం చేసి రద్దు చేశారు. దీంతో టెండర్ రేటుపై ఐదు శాతం అధికంగా టెండర్లు దాఖలు చేశారని అధికారులు చెబుతున్నారు. ఈ టెండర్లను మంత్రి అనుచరులే దక్కించుకోగా.. 17 చెరువులకు అగ్రిమెంట్లు పూర్తయ్యాయి. అందులో ఆరు చెరువులకు పనులు ప్రారంభంకాకపోగా, 11 చెరువులకు సంబంధించి 20 శాతంలోపు పనులు జరిగాయి. అయితే ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కావడంతో తెలుగు తమ్ముళ్లు పనులు విషయంలో వెనుక్కు తగ్గారు. ప్రస్తుతం ఈ పనుల ప్రస్తుత స్థితిని వివరిస్తూ కమిషనర్ కార్యాలయానికి లేఖ రాస్తున్నట్లు ఇరిగేషన్ అధికారులు చెబుతున్నారు. వాస్తవంగా ఈ టెండర్లు రద్దయితేనే మంచిదనే భావన అధికారుల్లో వ్యక్తమవుతోంది. -
13న కలెక్టర్ జపాన్ పర్యటన
నగరంపాలెం: జిల్లా కలెక్టర్, నగరపాలక సంస్థ ప్రత్యేక అధికారి కోన శశిధర్, అర్బన్ జిల్లా ఎస్పీ సీహెచ్ విజయారావు, నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా అనూరాధ ఫిబ్రవరి 13 నుంచి జపాన్ పర్యటనకు వెళ్లనున్నారు. సీఆర్డీఏ పరిధిలోని నగరాల్లో పబ్లిక్ రవాణా వ్యవస్థ ఏర్పాటుకు సంబంధించి సర్వే చేస్తున్న జపాన్ ఇంటర్నేషనల్ కార్పొరేషన్ ఏజెన్సీ (జైకా) సీఆర్డీఏ పరిధిలోని మున్సిపల్, పోలీస్ అధికారులను జపాన్ స్టడీ టూర్‌కు తీసుకెళ్తుంది. ఈ బృందం జపాన్‌లో అమలవుతున్న కాంప్రహెన్సివ్ ట్రాఫిక్, ట్రాన్స్‌పోర్టేషన్ (సీటీటీ)ను ఫిబ్రవరి 15–19 వరకు పరిశీలించనుంది. జపాన్ వెళ్లే బృందంలో కలెక్టర్, ఎస్పీ, కమిషనర్‌తో పాటు ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ దినేష్ కుమార్, మున్సిపల్ అర్బన్ డెవలప్మెంట్ (సీఆర్డీఏ) ప్రిన్సిపల్ సెక్రటరీ అజయ్‌జైన్, విజయవాడ పోలీస్ కమిషనర్ గౌతమ్ సవాంగ్, సీఆర్డీఏ కమిషనర్ డాక్టర్ చెరుకూరి శ్రీధర్, విజయవాడ మున్సిపల్ కమిషనర్ జె.నివాస్, సీఆర్డీఏ ప్రిన్సిపల్ ప్లానర్ ఎన్.అరవింద్ ఉన్నారు. వీరు 21న భారత్‌కు తిరిగి రానున్నారు. ఈ మేరకు జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ జపాన్ వెళ్లనున్న అధికారుల బాధ్యతలకు ఇన్చార్జులకు అప్పగిస్తూ గురువారం జీవో జారీ చేసింది. -
జైకా నిధులా...ఆగాల్సిందే
► ప్రతిపాదనల్లో సాంకేతిక లోపాలతో పనుల మంజూరులో జాప్యం ► కొత్త ఆర్థిక సంవత్సరంలోనే పనులు జరిగే అవకాశం విజయనగరం గంటస్తంభం: జైకా నిధులతో ప్రాజెక్టుల అభివృద్ధి జరగాలంటే మరికొంత కాలం వేచి చూడక తప్పని పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం పంపిన ప్రతిపాదనల్లో సాంకేతికపరమైన లోపాలు ఉండడంతో పనుల మంజూరులో జాప్యం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో అభివృద్ధి పనులు మూడు,నాలుగు నెలల్లో జరిగే అవకాశాలు కనిపించడం లేదు. కొత్త ఆర్థిక సంవత్సరం నాటికి అంతా ఒక కొలిక్కి రావచ్చనే సమాచారం ప్రస్తుతం షికారు చేస్తుంది. జిల్లాలో తోటపల్లి తరహా భారీ ప్రాజెక్టుతో పాటు పలు మధ్యతరహా సాగునీటి ప్రాజెక్టులు ఉన్న విషయం తెలిసిందే. దాదాపు అన్ని ప్రాజెక్టులు నుంచి పూర్తిస్థారుు విస్తీర్ణానికి సాగునీరు అందని పరిస్థితి. ప్రాజెక్టుల చెంత నిర్మాణాలు, కాలువలు ఆధ్వానంగా ఉండడం ఇందుకు కారణం. నీరు చెట్టు పథకంలో మట్టి పనులు చేసినప్పటికీ నిర్మాణాలకు రాష్ట్ర ప్రభుత్వం రెండేళ్లుగా నిధులు విడుదల చేయకపోవడంతో అలా పడి ఉన్నారుు. నిధుల కోసం జపం.. ఈ నేపథ్యంలో అధికారులు పనుల నిర్వహణకు నిధులు విడుదల చేయాలని రెండేళ్లుగా ప్రతిపాదనలు పంపుతున్నారు. ప్రభుత్వం నుంచి మాత్రం నిధులు విడుదల జరగడం లేదు. జపాన్ ఇంటిగ్రేటెడ్ కోపరేటవ్ ఏజెన్సీ(జైకా) సాయం చేస్తుండడంతో జిల్లాలో ఉన్న ప్రాజెక్టులు ఆధునీకికరణ పనులకు ప్రతిపాదనలు పంపాలని ఉన్నతాధికారులు జిల్లా అధికారులను కోరారు. ఈ మేరకు జిల్లా అధికారులు ఆండ్ర ప్రాజెక్టు పనులకు రూ.37 కోట్లు, వెంగళరాయసాగర్‌కు రూ.70 కోట్లు, వట్టిగెడ్డకు రూ.40 కోట్లు, పెదంకాలం ప్రాజెక్టు అభివృద్ధికి రూ.20 కోట్లతో ప్రతిపాదనలు గతేడాది పంపారు. కానీ నిధులు మాత్రం ఇంతవరకు మంజూరు కాలేదు. నిధులు రాకపోవడానికి కారణాలేంటి..? ప్రతిపాదనలు పంపి ఏడాది కావస్తున్నా ఇంతవరకు నిధులు మంజూరు కాకపోవడానికి కారణాలు అనేకం. అధికారులు పంపిన ప్రతిపాదనలు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర జలమండలికి పంపడంలో జాప్యం, వారు జైకాకు నివేదించడం, జైకా బృందం రాష్ట్రానికి వచ్చి ప్రాజెక్టులు పరిశీలించడంలో విపరీతమైన జాప్యం కారణంగా నిధులు మంజూరు కాలేదు. ఎట్టకేలకు జైకా బృందం పక్షం రోజలు క్రితం జిల్లాకు వచ్చి ప్రాజెక్టులు పరిశీలించింది. దీంతో నిధులు విడుదల అవుతాయని అంతా అనుకుంటున్నారు. ప్రస్తుతం వరి కోతలు జరుగుతుండడం, భూమి గట్టి పడుతుండడంతో జనవరి నుంచి పనులు ఆరంభించవచ్చని అధికారులు భావించారు. కానీ పరిస్థితి వేరేలా ఉంది. ప్రాజెక్టులు పరిశీలన చేసిన జైకా బృందం క్షేత్రస్థారుు పరిస్థితికి, ముందుగా ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలకు మధ్య తేడాని గమనించించింది. ప్రతిపాదనల్లో సాంకేతిక సమస్యలున్నాయని, మార్పు చేసి తిరిగి పంపించాలని సూచించింది. ఈ మేరకు జలవనరులశాఖ అధికారులు ప్రతిపాదనలు మార్చి పంపిస్తున్నారు. ఈ ప్రతిపాదనలు కేంద్ర జలమండలి (సీడబ్ల్యూసీ)కి వెళ్లి అక్కడ నుంచి జైకాకు వెళ్లాలి. ఇందుకు కొంత సమయం పడుతుంది. వారు పరిశీలించి పనులకు నిధులు మంజూరు చేస్తే తర్వాత టెండర్ల పక్రియ జరుగుతుంది. ఇదంతా జరిగేసరికి రెండు, మూడు నెలలు సమయం పడుతుంది. ఈ ఏడాదిలో మరి నిధులు రాకపోవచ్చని అధికారులు భావిస్తున్నారు. ఒకవేళ వచ్చినా పనులు చేసే సరికి సమయం పడుతుందని, వచ్చే ఆర్థిక సంవత్సరం నాటికి ప్రాజెక్టు పనులు ప్రారంభమయ్యే అవకాశముందంటున్నారు. అంతా అనుకున్నట్లు జరిగితే సాగునీరు... ఈ నేపథ్యంలో వచ్చే ఖరీఫ్ నాటికి ఈ ప్రాజెక్టుల కింద సాగునీరు అందే అవకాశం ఉంటుంది. వాస్తవానికి ఈ ఆర్థిక సంవత్సరం ఆరంభంలోనే నిధులు విడుదలవుతాయని అధికారులు భావించారు. ఈ ఏడాది ఖరీఫ్ నాటికి ప్రాజెక్టుల అధునీకీకరణ జరిగి నీరందుతుందని అనుకున్నారు. కానీ ఆపరిస్థితి లేదు. పోనీ వచ్చే ఏడాది ఖరీఫ్ నాటికి నీరందాలంటే మార్చి, ఏప్రిల్ నాటికి పనులు ప్రారంభమై జూన్ నాటికి పూర్తి కావాలి. ఇందులో ఏమాత్రం తేడా వచ్చినా రైతులు కల వచ్చే ఏడాది కూడా నెరవేరదు. వాస్తవానికి ఈ నాలుగు ప్రాజెక్టులు సక్రమంగా లేకపోవడం వల్ల ఈ ఏడాది సగం విస్తీర్ణానికి కూడా నీరంద లేదు. 15 వేల ఎకరాలకుపైగా సాగు నీరందకుండా పోరుుంది. కావున ప్రభుత్వం ఇప్పటికై నా స్పందించి నిధులు వచ్చేట్లు చేస్తే రైతులకు సాగునీటి చింత తీరుతుంది.