సాక్షి, విజయనగరం: ‘నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు’ కార్యక్రమంలో భాగంగా రేపు(బుధవారం) విజయనగరం జిల్లాలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటించనున్నారు. గుంకలాంలో భారీ కాలనీలో పట్టాలు పంపిణీ, ఇళ్లనిర్మాణ పనులను సీఎం ప్రారంభించనున్నారు. సీఎం వైఎస్ జగన్.. బుధవారం ఉదయం 9.30 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరి, 11:15 గంటలకు గుంకలాం చేరుకోనున్నారు. పైలాన్ ఆవిష్కరణ అనంతరం ఇళ్లపట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనున్నారు. మధ్యాహ్నం 2.45 గంటలకు తిరిగి తాడేపల్లి నివాసానికి చేరుకోనున్నారు.(చదవండి: బాబుపై సీఎం జగన్ వ్యంగ్యాస్త్రాలు)
విజయనగరం నియోజకవర్గంలోని విజయనగరం రూరల్ మండలం గుంకలాం వద్ద 397.36 ఎకరాల్లో 12,301 మంది లబ్దిదారుల కోసం భారీ లే అవుట్‌ను సిద్ధం చేశారు. రూ.4.37 కోట్లతో లే అవుట్‌ను ప్రభుత్వం అభివృద్ధి చేసింది. పేదలకు స్థలాలు ఇచ్చేందుకు గానూ ప్రభుత్వం.. 428 మంది రైతుల నుంచి 101.73 కోట్ల రూపాయలతో భూమిని కొనుగోలు చేసింది. మొత్తంగా విజయనగరం జిల్లాలో 1,08,230 మంది లబ్ధిదారులకు ప్రభుత్వం ఇళ్లపట్టాలు పంపిణీ చేస్తోంది. దీనిలో గ్రామీణ ప్రాంతాలకు చెందిన 65,026 మంది, పట్టణ ప్రాంతాలకు చెందిన 43,204 మంది లబ్ధిదారులు వున్నారు. పేదలకు ఇళ్ళస్థలాలు కేటాయించేందుకు ప్రభుత్వం మొత్తం 1,164 లేఅవుట్‌లను సిద్దం చేసింది. వీటిని అభివృద్ధి చేసేందుకు రూ.10.19 కోట్లు ఖర్చు చేసింది. (చదవండి: ‘సినిమాల్లో వకిల్ సాబ్.. బయట పకీర్ సాబ్’)
Comments
Please login to add a commentAdd a comment