సౌదీ ఎడారిలో చిక్కుకున్న బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా యువకుడు
ఆహారం, నీరు లేక అనారోగ్యంతో ఇబ్బందులు
స్వస్థలానికి తీసుకురావాలని తల్లిదండ్రుల వినతి
అంబాజీపేట: ఉపాధి కోసం సౌదీ వెళ్లిన ఓ యువకుడిని ఏజెంట్ మోసం చేయడంతో ఎడారిలో చిక్కుకుపోయాడు. అధిక ఉష్ణోగ్రతల కారణంగా తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. ప్రభుత్వం జోక్యం చేసుకుని తమ కుమారుడిని తమ ఇంటికి చేర్చాలని అతని తల్లిదండ్రులు కోరుతున్నారు. బాధిత యువకుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం... డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట మండలంలోని ఇసుకపూడి మెరకపేటకు చెందిన సరెళ్ల సత్తిరాజు, మరియమ్మ దంపతుల కుమారుడు సరెళ్ల వీరేంద్రకుమార్ ఈ నెల 9వ తేదీన ఏజెంట్, మధ్యవర్తుల సాయంతో ఖతార్‌లో వంట మనిíÙగా పనిచేసేందుకు వెళ్లాడు.
అతను 10వ తేదీన ఖతార్‌కు చేరగా, అక్కడ వంట మనిషి ఉద్యోగం ఇవ్వలేదు. అతడ్ని ఖతార్ నుంచి ఈ నెల 11 తేదీన సౌదీ అరేబియా పంపించారు. అక్కడ ఎడారిలో ఒంటెలకాపరిగా నియమించారు. భగభగ మండే ఎండ తీవ్రత వల్ల ఎడారిలో ఒంటెలకాపరిగా పని చేస్తున్న వీరేంద్రకుమార్ ఆరోగ్యం దెబ్బతిన్నది. తనకు రక్తపు వాంతులు అవుతున్నాయని, తాగేందుకు నీరు, తినేందుకు ఆహారం దొరకడం లేదని, తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని వీరేంద్రకుమార్ వాట్సాప్ ద్వారా తన తల్లిదండ్రులు సత్తిరాజు, మరియమ్మ, సోదరుడు రవికుమార్‌తోపాటు బంధువులు, స్నేహితులకు తెలియజేశాడు.
తన ఆరోగ్యం క్షీణిస్తోందని, వెంటనే స్వగ్రామం తీసుకువెళ్లేందుకు చర్యలు తీసుకోవాలని కన్నీటిపర్యంతమవుతూ వేడుకున్నాడు. దీంతో ఆందోళనకు గురైన తల్లిదండ్రులు స్థానిక ప్రజాప్రతినిధుల సహకారంతో ఈ నెల 19న అమరావతిలోని ఏపీ నాన్ రెసిడెండ్ తెలుగు సొసైటీ(ఏపీ ఎన్‌ఆర్‌టీఎస్) అధికారులను కలిసి సౌదీలో వీరేంద్రకుమార్ పడుతున్న ఇబ్బందులను తెలియజేసి సాయం చేయాలని కోరారు. అమలాపురం ఎంపీ గంటి హరీ‹Ùమాధుర్, ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ, తహసీల్దార్‌ల దృష్టికి కూడా సమస్యను తీసుకువెళ్లి వీరేంద్రకుమార్‌ను స్వస్థలానికి తీసుకువచ్చేందుకు సహకరించాలని విన్నవించారు.
Comments
Please login to add a commentAdd a comment