చెన్నై మహానగరంలో భవనం కుప్పకూలిన ఘటనలో మృతుల సంఖ్య 24కు చేరింది. భవన శిథిలాల కింద మంగళవారం మరో మృతదేహన్ని కనుగొన్నారు. మృతుడు ఆంధ్రప్రదేశ్కు చెందిన మహేశ్గా గుర్తించినట్లు పోలీసులు వెల్లడించారు. శిథిలాల కింద 26 మంది చిక్కుకున్నారని భావిస్తున్నట్లు చెప్పారు. వారిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. భారీ వర్షాల కారణంగా శనివారం 11 అంతస్తుల భవనం కుప్పకూలింది. ఆ ఘటనలో 18 మంది మృతి చెందారు. మరో 26 మంది ఆచూకీ తెలియకుండా పోయారు.