
పంచ్‌కుల (హరియాణా): ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌లో అండర్–18 మహిళల కబడ్డీ పోటీల్లో ఆంధ్రప్రదేశ్ (ఏపీ) జట్టు కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది. సోమవారం జరిగిన తొలి సెమీఫైనల్లో ఆంధ్రప్రదేశ్ 15–50 పాయింట్ల తేడాతో హరియాణా చేతిలో ఓడిపోయింది.
రెండో సెమీఫైనల్లో మహారాష్ట్ర 45–23తో తమిళనాడును ఓడించి నేడు జరిగే ఫైనల్లో హరియాణాతో అమీతుమీకి సిద్ధమైంది. సెమీఫైనల్లో ఓడిన రెండు జట్లకూ కాంస్య పతకాలు అందజేస్తారు.
చదవండి: Kho Kho -League: ఖో–ఖో లీగ్‌లో జీఎంఆర్, అదానీ ఫ్రాంచైజీలు