Khelo India Youth Games: వెంకటాద్రి పసిడి గురి.. ఏపీ ఖాతాలో మరో స్వర్ణం | Khelo India Youth Games: AP Archer Venkatadri Won Gold | Sakshi
Sakshi News home page

Khelo India Youth Games: వెంకటాద్రి పసిడి గురి.. ఏపీ ఖాతాలో మరో స్వర్ణం

Published Mon, Jun 13 2022 12:21 PM | Last Updated on Mon, Jun 13 2022 12:28 PM

Khelo India Youth Games: AP Archer Venkatadri Won Gold - Sakshi

పంచ్‌కుల(హరియాణా): ఖేలో ఇండియా యూత్‌ గేమ్స్‌లో ఆదివారం ఆంధ్రప్రదేశ్‌కు ఒక స్వర్ణం, ఒక కాంస్య పతకం లభించాయి. ఆర్చరీలో అండర్‌–18 పురుషుల కాంపౌండ్‌ వ్యక్తిగత విభాగంలో కుందేరు వెంకట్రాది బంగారు పతకం సొంతం చేసుకోగా... అండర్‌–18 మహిళల కాంపౌండ్‌ వ్యక్తిగత విభాగంలో మాదల సూర్య హంసిని కాంస్య పతకాన్ని దక్కించుకుంది.

ఫైనల్లో వెంకటాద్రి 144–141తో కోర్డె పార్థ్‌ సునీల్‌ (మహారాష్ట్ర)పై విజయం సాధిం చాడు. సెమీఫైనల్లో వెంకటాద్రి 147–146తో ప్రథమేశ్‌ (మహారాష్ట్ర)పై, క్వార్టర్‌ ఫైనల్లో 147–145తో పెండ్యాల త్రినాథ్‌ చౌదరీ (ఆంధ్రప్రదేశ్‌)పై గెలుపొందాడు. కాంస్య పతక పోరులో సూర్య హంసిని 143–141తో అంతర్జాతీయ క్రీడాకారిణి పరిణీత్‌ కౌర్‌ (పంజాబ్‌)ను ఓడించింది. ఈ క్రీడల్లో ఆంధ్రప్రదేశ్‌ నాలుగు స్వర్ణాలు, మూడు రజతాలు, ఐదు కాంస్యాలతో కలిపి మొత్తం 12 పతకాలతో 14వ స్థానంలో ఉంది. 

చదవండి: Rishabh Pant: అదే మా పొరపాటు.. అందుకే ఓడిపోయాం.. ఇక మూడింటికి మూడు గెలవాల్సిందే!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement